పిల్లలకి పేరెంట్స్ గా తప్పితే మా ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదని తులసి కోర్టులో చెప్తుంది. లాస్య మాయలో పడి నందగోపాల్ మీకు విడాకులు ఇచ్చారా అని మాధవ్ అడుగుతాడు. అవునని అంటుంది. అది లాస్య క్యారెక్టర్ ఒక స్త్రీ అయి ఉంది మరొక స్త్రీ భర్తని లాక్కుంది. తులసి ఎక్కడ తన భర్తని లాక్కుంటుందేమోనని ఇన్ సెక్యూరిటీతో భయపడుతుంది, ఇంట్లో వాళ్ళని టార్చర్ చేసింది అది తట్టుకోలేక తిరగబడ్డాడని మాధవ్ చెప్తాడు. అసలు లాస్యకి నందుతో గొడవ ఎందుకు పడిందో చెప్పమని నిలదీస్తాడు.
లాస్య లాయర్: ఈ నందగోపాల్ కి ఆడవాళ్ళ పిచ్చి ఉంది
లాస్య: నందునే నాకు దగ్గర అయ్యాడు. అతని వీక్ నెస్ తెలిసి జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నా
మంగమ్మ: లాస్యకి మొగుడంటే ప్రాణం కానీ అయ్యగారిది వంకర బుద్ధి ఎన్నో సార్లు నా కొంగు కూడా లాగాడు. ఏంటి ఇదని అడిగితే లాస్యని కొట్టారు ఎన్నో దెబ్బలు భరించింది
Also Read: ఆదర్శ్ రాకపోతే తనే కోడలికి రెండో పెళ్లి చేస్తానన్న భవానీ- తండ్రి నిర్ణయంతో షాక్లో ముకుంద
నందుకి సపోర్ట్ గా సాక్ష్యాలు ఉన్నాయా అని జడ్జి అడిగితే గడువు కావాలని మాధవ్ కోరతాడు. మూడు రోజుల గడువు ఇస్తానని రుజువు చేయలేకపోతే శిక్ష పడుతుందని జడ్జి చెప్పేస్తాడు. విక్రమ్, దివ్య కలిసి అమ్మవారికి కుంకుమార్చన చేస్తారు. అగ్నిసాక్షిగా మన మధ్య యుద్దం మొదలైనట్టే అత్తయ్య అని దివ్య మనసులో అనుకుంటుంది. ఈరోజు నుంచి నీకు నరకం చూపిస్తానని రాజ్యలక్ష్మి అనుకుంటుంది.
తులసి మంగమ్మ దగ్గరకి వచ్చి ఇలాగేనా కొంగు పట్టుకుని లాగిందని అరుస్తుంది. పాతికేళ్లు కాపురం చేశావు నీకు తెలియదా అని లాస్య నీచంగా మాట్లాడుతుంది. గొడవ మొదలుపెట్టింది మీ అబ్బాయి నేను కంటిన్యూ చేస్తున్నానని లాస్య అంటుంది. తులసి, లాస్య మధ్య కాసేపు మాటల యుద్ధం నడుస్తుంది. నందు వచ్చేసరికి మళ్ళీ లాస్యతో గొడవకు దిగుతాడు. టాపు చేశానని తెలుసుకుని ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా తనని వదిలేశాను. నాతో ఉంటూ నాకే వెన్నుపోటు పొడుస్తుంటే ఏ నమ్మకంతో భార్య స్థానం ఇవ్వమంటావని నందు అడుగుతాడు. ఇవ్వకపోతే నష్టపోయేది నీ కుటుంబమేనని లాస్య బెదిరిస్తుంది. పంతులు పూజ పూర్తయిన తర్వాత అన్నీ సర్దుకుంటుంటే దివ్య వస్తుంది. మీరు దొంగపంతులని నాకు తెలుసని దివ్య అంటుంది.
దివ్య: ఆచారాలు, సాంప్రదాయాలు అని చెప్పి మా అత్త చెప్పినట్టు పూజలు చేస్తూ నటిస్తున్నారా దొంగపంతులు
పంతులు: మీరు నన్ను అనుమానిస్తున్నారని పెద్దమ్మగారికి చెప్తాను
దివ్య: పంతులు మొదటి భార్యకి తెలియకుండా రెండో భార్యకి నగలు ఇచ్చిన వీడియో చూపించి బెదిరిస్తుంది. దొంతి కాళ్ళ బేరానికి వస్తాడు. పంతులు రాజ్యలక్ష్మి గురించి చెప్పిన మాటలు కూడ రికార్డు చేస్తుంది. అబద్ధాలు ఆడు అయితే నేను చెప్పినట్టు ఆడాలి. లేదంటే వీడియో మొదటి భార్యకి, ఆడియో అత్తయ్యకి పంపిస్తా
Also Read: పెళ్ళాన్ని చూసి ఫ్లాట్ అయిపోయిన రాజ్- కావ్య మన పెళ్లి జరగనివ్వదని స్వప్నని నమ్మించిన రాహుల్
నందుని కేసు నుంచి బయటపడేసేందుకు తులసి ప్రయత్నాలు మొదలుపెడుతుంది. దొంగ సాక్ష్యం పుట్టించి అయినా సరే నందుని విడిపించమని అనసూయ సలహా ఇస్తుంటే వద్దని అంటాడు.