ముకుంద మురారీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నీకు ఉంగరం తొడిగితే సగం పెళ్ళైనట్టే అనుకున్నా, అదే ఉంగరం గుడిలో దేవుడి సాక్షిగా తొడుగుతానని అనుకుంటుంది. భవానీ దగ్గర మురారీ వస్తాడు. ఆశ్రమానికి వెళ్తున్నాను కానీ ఉండటానికి కాదు. ట్రస్టీగా ఉన్న ఆశ్రమంలో హాస్పిటల్ లో కట్టిస్తున్నా అది పూర్తయిన తర్వాత వస్తానని చెప్తుంది. ఇక అందరూ గుడికి వస్తారు. మనకి ఈ దేవుడి సన్నిధిలోనే ఎంగేజ్మెంట్ అవుతుందని ముకుంద అనుకుంటుంది. గుడిలో ఒక ముసలాయన ఆకలికి తట్టుకోలేక అల్లాడిపోవడం భవానీ వాళ్ళు చూస్తారు. ఇవాళ మీ పుట్టినరోజు కదా ఎంతో కొంత సాయం చేయమని కృష్ణ చెప్పడంతో మురారీ వెళ్లబోతుంటే పూజ పూర్తయిన తర్వాత వచ్చి ఇవ్వమని భవానీ చెప్తుంది. సరే ముకుంద ప్లేస్ లో నువ్వు ఉండి వాళ్ళకి సహాయం చేసి రమ్మని ముకుంద అంటుంది. రింగ్ తొడగటానికి కృష్ణ అడ్డు తప్పించాను ఇక మిగతా వాళ్ళని కూడా తప్పించాలని అనుకుంటుంది.


Also Read: స్వప్నకి పెళ్లి చూపులు ఫిక్స్ చేసిన కనకం- కావ్యని ఎందుకు వదిలేస్తున్నావని రాజ్ ని నిలదీసిన ధాన్యలక్ష్మి


ప్రసాదం తీసుకొస్తానని చెప్పి వెళ్తుంది అక్కడ పెద్ద క్యూ ఉండేసరికి తన ఉంగరం ఏదో పోయిందని అబద్దం చెప్తుంది. అది నిజమనుకుని అందరూ వెతుకుతూ ఉండగా కృష్ణ ప్రసాదం తీసుకుని వెళ్ళిపోతుంది. గుడిలో ప్రదక్షిణలు చేయడానికి పంపించేస్తుంది. అభిషేకం చేసే దగ్గర ముకుంద, మురారీ మాత్రమే ఉంటారు. కృష్ణ తొందరగా వస్తే బాగుండని మురారీ అనుకుంటాడు. ఆదర్శ్ ని తొందరగా ఇంటికి వచ్చేలా చేయమని భవానీ దేవుడిని వేడుకుంటుంది. ముకుంద ఉంగరం తీసి మురారీకి పెట్టాలని అనుకుంటుంది. అటు కృష్ణ గూడలో ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. ముకుంద వల్ల నా కొడుకు కోడలు జీవితంలో కలతలు రాకుండా ఉండాలంటే తనకోక దారి చూపించమని రేవతి మనసులో అనుకుంటుంది. అప్పుడే కృష్ణ ప్రదక్షిణలు చేస్తుంటే మురారీ అక్కడ అభిషేకం చేస్తున్నాడని వెళ్ళి సాయం చేయమని చెప్తుంది. మురారీ అభిషేకం చేస్తుంటే ముకుంద హెల్ప్ చేస్తుంది.


Also Read: పగతో రగిలిపోతున్న మనోహర్- జ్ఞానంబ ఇంట వెల్లివిరిసిన ఆనందం


మురారీ అభిషేకం పూర్తవుతుంటే ఇంకా కృష్ణ రాలేదని ఎదురుచూస్తూ ఉంటాడు. అటు ముకుంద కృష్ణ ఎక్కడ వస్తుందోనని టెన్షన్ పడుతుంది. అభిషేకం చేసేటప్పుడు ముకుంద మురారీ వేలికి ఉంగరం పెట్టేస్తుంది. ఇప్పుడు మనకి ఎంగేజ్మెంట్ అయిపోయినట్టేనని సంతోషపడుతుంది. మురారీ ఆ ఉంగరం తీసేందుకు ట్రై చేస్తాడు కానీ అది రాదు. అప్పుడే కృష్ణ, భవానీ వాళ్ళందరూ వస్తారు. అభిషేకం పూర్తయిందని పూజారి చెప్తాడు. ముకుంద మురారీ పక్కన నిలబడితే తనని వెనక్కి రమ్మని పిలిచి కృష్ణని పక్కన నిలబెడుతుంది రేవతి.