కృష్ణ, మురారీ ఒకరి మీద మరొకరకి ఉన్న ప్రేమ బయట పెట్టుకోలేక బాధపడుతూ ఉంటారు. తను కోల్పోయిన జీవితం తనకి కావాలని ముకుంద అడిగిన మాటలు రేవతి గుర్తు చేసుకుంటూ ఉండగా మురారీ వస్తాడు. అమ్మకి అంతా తెలిసిపోయిందా ముకుంద మొత్తం చెప్పేసిందా ఎందుకు అలా చూస్తుందని తల్లి దగ్గర నుంచి తప్పించుకుని వెళ్ళిపోతాడు. కృష్ణని ఇవాళ బయటకి తీసుకెళ్తాను గురువుగారు నా మనసులో మాట చెప్తాను తన మనసులో ఏముందో తెలుసుకుంటాను. ముకుంద మాది అగ్రిమెంట్ మ్యారేజ్ అని బయట పెట్టకముందే ఈ విషయం తేల్చుకుంటాను. మా బంధం వన్ ఇయర్ కాకుండా జీవిత కాలం పొడిగించాలని అనుకుంటే ముకుంద ఏమవుతుందో? కానీ ముందు కృష్ణ బయట పడాలి కదా అనుకుని నిద్రపోతున్న తనని లేపుతాడు.
Also Read: కావ్యని ఆగర్భ శత్రువన్న రాజ్- రుద్రాణిని వాయించేసిన అత్తాకోడళ్ళు
రెస్టారెంట్ కి వెళ్దామని అంటే ఏమైనా మాట్లాడాలా అంటుంది. ఏమైనా చెప్పాలని అనుకుంటున్నారా? అంటే అవునని చెప్తాడు. నాతో చెప్పాలనుకుంటుంది ఏముంది ఏసీపీ సర్ ప్రేమించిన అమ్మాయి గురించా? అని కృష్ణ ఆలోచిస్తుంది. ఇద్దరూ కాసేపు మాట్లాడుకుని నవ్వుకుంటారు. మనసులో ఇంకొక అమ్మాయిని పెట్టుకుని ఇంత మనస్పూర్తిగా ఎలా నవ్వగలుగుతున్నారు ఏంటని కృష్ణ అనుకుంటుంది. రెస్టారెంట్ కి వెళ్ళాలి కదా నువ్వే డ్రెస్ సెలెక్ట్ చేయమని మురారీ అడుగుతాడు. మళ్ళీ కబోర్డ్ లో డైరీ పెట్టిన విషయం గుర్తొచ్చి దాన్ని చూసేస్తుందేమోనని కంగారు పడతాడు. కృష్ణ తీసిన డ్రెస్లో డైరీ ఉండేసరికి అది ఎక్కడ కనిపిస్తుందానని టెన్షన్ పడతాడు. ఆ డైరీ నేను ఎక్కడ చూస్తానోనని టెన్షన్ పడుతున్నాడని కృష్ణ పసిగట్టేస్తుంది. ఇది నేను వేసుకుంటాలే లోపలికి వెళ్ళమని తనని హడావుడిగా పంపించేస్తాడు. తను ప్రేమించిన అమ్మాయి ఎవరో నేను చదివేశానని ఆయనకి తెలియదు కదా అనుకుంటుంది.
కృష్ణ వెళ్లిపోగానే మురారీ డైరీ తీస్తాడు. ముందు ముకుంద గురించి రాసినా తర్వాత కృష్ణ గురించి రాసింది చదివితే నా ప్రేమ అర్థం చేసుకుంటుంది ఏమోనని ఆశపడతాడు. కృష్ణ, మురారీ బయటకి వెళ్తూ రేవతి దగ్గరకి వెళ్ళి చెప్తుంది. ఇవాళ సండే కదా అని బ్రేక్ ఫాస్ట్ కి బయటకి వెళ్తున్నామని కృష్ణ అంటే సరే వెళ్ళమని రేవతి కూడా పర్మిషన్ ఇస్తుంది. మురారీ మాత్రం తల్లికి ఎదురుపడలేక తలదించుకుని వెళతాడు. ఏమైంది మీకు వచ్చేటప్పుడు అత్తయ్యకి చెప్పకుండా వచ్చారని కృష్ణ అడిగితే ఏం లేదని అంటాడు. ముకుంద తన స్నేహితురాలితో కలిసి రెస్టారెంట్ లో మాట్లాడుతుంది. ఆ ఇంట్లో ఒక్క రోజు కూడా ఉండలేకపోతున్నా? అగ్రిమెంట్ పూర్తవగానే కృష్ణ వెళ్ళిపోతుంది. కానీ ఈలోపు మురారీకి కృష్ణ మీద ప్రేమ కలిగితే నా పరిస్థితి ఏంటాని ముకుంద తన భయాన్ని స్నేహితురాలితో పంచుకుంటుంది.
Also Read: తన మనసులో కృష్ణకే స్థానమని తెగేసి చెప్పిన ముకుంద- బాధలో కూరుకుపోయిన 'కృష్ణ ముకుంద మురారీ'
మురారీ వాళ్ళు ఎక్కడ ప్రేమలో పడతారోనని చిన్నత్తయ్యకి ప్రేమ గురించి చెప్పేశాను. కృష్ణ, మురారీ మధ్య ప్రేమ లేదని తెలిస్తే మా పెళ్లికి అందరూ ఒప్పుకుంటారని సంబరంగా చెప్తుంది. ముకుంద వాళ్ళు ఉన్న రెస్టారెంట్ కి కృష్ణ వాళ్ళు కూడా వస్తారు. మనం కూర్చునే ప్లేస్ లో ఎవరో కూర్చున్నారని చూసి ముకుంద అని పలకరిస్తుంది. గీతిక మురారీని పలకరించి నీ గురించే మాట్లాడుకుంటున్నామని అనేసరికి కృష్ణ షాకింగ్ గా చూస్తుంది. వాళ్ళని పలకరించేసి వెళ్లిపోతారు. టిఫిన్ కి కూడా రెస్టారెంట్ కి వచ్చారంటే వాళ్ళు ప్రేమలో పడిపోయారని అనిపిస్తుందని గీతిక అనేసరికి ముకుంద బిత్తరపోతుంది. గీతిక గురించి మురారీని అడుగుతుంది.