Varalakshmi Sarath kumar about Kotabommali PS movie : వరలక్ష్మీ శరత్ కుమార్. క్యారెక్టర్ ఏదైనా ఇట్టే ఒదిగిపోయి నటించడంలో ఆమెకు ఆమే సాటి. నెగెటివ్ రోల్, సపోర్టింగ్ రోల్ అనే తేడా లేకుండా, ఏ పాత్ర ఇచ్చినా నూటికి నూరు శాతం న్యాయం చేస్తుంది. డిఫరెంట్ క్యారెక్టర్స్ తో సినీ అభిమానులను బాగా అలరిస్తోంది. ప్రస్తుతం ఆమె ‘కోట బొమ్మాళి పీఎస్‌’ అనే సినిమా చేసింది.  తేజ మార్ని తెరకెక్కించిన ఈ చిత్రంలో రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ లీడ్‌ రోల్స్ పోషిస్తున్నారు. సీనియర్ నటుడు శ్రీకాంత్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి ఈ చిత్రాన్ని నిర్మించారు. నవంబర్ 24న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ గురించి వరలక్ష్మీ కీలక విషయాలు వెల్లడించింది.


క్యాట్ అండ్ మౌస్ గేమ్‌లా థ్రిల్ చేస్తుంది- వరలక్ష్మీ శరత్ కుమార్


తన కెరీర్ లో చాలాసార్లు పోలీస్ క్యారెక్టర్లు చేసినా, తొలిసారి తెలుగులోనూ ఆ పాత్రలో కనిపించబోతున్నట్లు వెల్లడించింది వరలక్ష్మీ శరత్ కుమార్.  ‘‘నా కెరీర్‌‌లో ఎక్కువ పోలీస్ క్యారెక్టర్సే వస్తున్నాయి. తమిళంలో చాలా చేశాను. తెలుగు ఆడియెన్స్‌ కు తొలిసారి పోలీస్ గెటప్‌లో కనిపించబోతున్నా. ప్రస్తుతం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ ట్రెండ్ నడుస్తుంది. వాటిలో పోలీస్ ఆఫీసర్‌‌గానే కనిపించాలి. ఈ మూవీ స్క్రిప్ట్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇందులో శ్రీకాంత్ గారు ఒక పోలీస్ ఆఫీసర్, నేనొక పోలీస్ ఆఫీసర్. ఇద్దరిలో ఒకరు క్రిమినల్ అయితే ఎలా ఉంటుంది.. పోలీసులపై పొలిటికల్ ప్రెజర్ ఏ విధంగా ఉంటుందనేది ఈ మూవీ కాన్సెప్ట్. క్యాట్ అండ్ మౌస్ గేమ్‌లా థ్రిల్ చేసేలా సినిమా ఉంటుంది ” అని వివరించింది.


ఈ సినిమా కోసం ఆ పని చేశా- వరలక్ష్మీ శరత్ కుమార్


ఇక ఈ సినిమాలో తన క్యారెక్టర్ చాలా రఫ్ గా ఉంటుందని వెల్లడించింది వరలక్ష్మీ శరత్ కుమార్. తొలిసారి స్మోకింగ్ చేయడం కాస్త ఇబ్బంది కలిగించినట్లు చెప్పుకొచ్చింది. “ఈ చిత్రంలో నా క్యారెక్టర్ చాలా రఫ్ గా ఉంటుంది. ఈ చిత్రంలో నాకు స్మోకింగ్ చేయడం ఛాలెజింగ్‌గా అనిపించింది. ఇప్పటివరకూ ఏ సినిమాలోనూ ఇలాంటి సీన్ చేయలేదు. అందుకే ఛాలెజింగ్‌గా అనిపించింది. క్యారెక్టర్‌‌కి ఆ సీన్ కంపల్సరీ కాబట్టి చేయాల్సి వచ్చింది. యాక్షన్ కంటే మైండ్ గేమ్ ఎక్కువగా ఉంటుంది. ‘లింగిడి లింగిడి’ పాటకు మంచి రెస్పాన్స్ రావడం సంతోషంగా ఉంది. మంచి క్యారెక్టర్స్ చేయడమే నా గోల్. వరలక్ష్మీ చాలా డిఫరెంట్‌గా చేసిందని ప్రేక్షకులు అనుకోవాలనుకుంటా. లేడీ ఓరియంటెండ్ సినిమాలతో పాటు క్యారెక్టర్ నచ్చితే ఎలాంటి మూవీలోనైనా నటించడానికి రెడీ” అని వెల్లడించింది.


వరుస సినిమాలు చేస్తున్న వరలక్ష్మీ


అటు ప్రస్తుతం తెలుగులో ‘హను-మాన్‌’ అనే సినిమా చేసినట్లు చెప్పింది. “ఈ మూవీ సంక్రాంతికి విడుదల కానుంది. ‘శబరి’ అనే మరో సినిమా చేస్తున్నా. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ అయ్యింది. రాజేంద్ర ప్రసాద్‌తోనూ ఓ సినిమా చేస్తున్నా. కన్నడలో సుదీప్‌తో కలిసి ‘మ్యాక్స్’ చిత్రంలో నటిస్తున్నా.  మరికొన్ని ప్రాజెక్టులు లైన్‌లో ఉన్నాయి” అని వరలక్ష్మీ వివరించింది.  


Read Also: ఆలియా భట్ కు వేధింపులు, ఎన్నోసార్లు ఏడ్చానన్న బాలీవుడ్ బ్యూటీ