యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా ఇటీవల విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ ఓ సినిమాను మొదలుపెట్టనున్నారు. నిజానికి ఈపాటికే సినిమా మొదలుకావాల్సింది కానీ 'ఆచార్య' సినిమా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. సినిమా విడుదలయ్యాక కొరటాల కొంత గ్యాప్ తీసుకొని తారక్ సినిమాను మొదలుపెడతారని అంతా అనుకున్నారు.
కానీ అలా జరగడం లేదు. జూన్ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని ఇటీవల కొరటాల చెప్పారు. అందుతున్న సమాచారం ప్రకారం.. ఇప్పుడు జూలై రెండో వారానికి పోస్ట్ పోన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం కూడా 'ఆచార్య' సినిమా అనే సమాచారం. ఈ సినిమా వలన నష్టపోయిన బయ్యర్లను సెటిల్ చేసే పనిలో పడ్డారు కొరత. అది పూర్తయ్యాక మళ్లీ ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్ పై ఫోకస్ పడతారు.
'ఆచార్య' రిజల్ట్ తేడా కొట్టడంతో తన తదుపరి సినిమాను పకడ్బందీగా తీర్చిదిద్దాల్సిన అవసరముంది. కొరటాలను టెన్షన్ పెట్టకుండా తారక్ మంచి సపోర్ట్ ఇస్తున్నప్పటికీ కొరటాల మాత్రం మరింత జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. 'ఆచార్య' బయ్యర్లకు కొంతమేర నష్టాలను ఎన్టీఆర్ సినిమాతో భర్తీ చేయాల్సి ఉన్న నేపథ్యంలో కచ్చితంగా ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాలి. అందుకే కొరటాల ఏ రకంగా ఛాన్స్ తీసుకోవడం లేదు. అందుకే స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో కొరటాల తన సినిమాకి సంబంధించిన ఓ పోస్టర్ ను రిలీజ్ చేయాలనుకుంటున్నారట. ప్రస్తుతం ఈ పోస్టర్ పై వర్క్ జరుగుతోంది. మరి నిజంగానే అప్డేట్ ఇస్తారో లేక ఫ్యాన్స్ ను నిరాశ పరుస్తారో చూడాలి.
ఈ సినిమాను కొరటాల స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్‌తో కలిసి ఎన్టీఆర్ అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించనున్నారు. వచ్చే ఏడాదిలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ స్టూడెంట్ పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. బస్తీలో చదువుకునే ఓ స్టూడెంట్, అదే బస్తీలో పేద విద్యార్థుల హక్కుల కోసం, పేద విద్యార్థులకు అండగా ప్రభుత్వంతో ఎటువంటి పోరాటం చేశాడు.. ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కొన్నాడు..? అనేదే ఈ సినిమా కథ.
Also Read: 'కేజీఎఫ్2' ఓటీటీ రిలీజ్ - ఫ్రీగా చూసే ఛాన్స్ లేదు!
Also Read: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేయబోయే సినిమాలివే!