టుడు విజయ్ దేవర కొండ ఇప్పుడు ‘లైగర్’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా విజయ్ కాఫీ విత్ కరణ్ సీజన్ లో (Koffee With Karan 7)లో ‘లైగర్’ హీరోయిన్ అనన్య పాండేతో కలిసి ఇంటర్వ్యూ ఇచ్చాడు. మంగళవారం విడుదలైన ఈ ఎపిసోడ్ ప్రోమోలో కరణ్ జోహర్ విజయ్ దేవరకొండను బోల్డ్ క్వశ్చన్స్ అడిగాడు. విజయ్ కూడా ఎక్కడా తడబడకుండా ఆన్సర్స్ ఇచ్చాడు. 


ప్రోమో ప్రకారం.. కరణ్ జోహర్.. ‘‘నీకు చీజ్ ఇష్టమా?’’ అని విజయ్ దేవరకొండను అడిగాడు. ఈ సందర్భంగా విజయ్ గురించి సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్‌ల మధ్య జరిగిన వాగ్వాదాన్ని రౌడీ బాయ్‌కు చూపించారు. అది చూసి విజయ్ కాస్త సర్‌ప్రైజ్ అయ్యాడు. ఆ తర్వాత కరణ్ అనన్యకు, ఆదిత్య రాయ్ కపూర్‌కి మధ్య ఏం జరుగుతుందని అడిగాడు. ఇందుకు ఆమె సైలెంట్ అయిపోయింది. 


విజయ్‌ను కరణ్ ఈసారి బోల్డ్ క్వశ్చన్ అడిగాడు. ‘‘నువ్వు చివరిగా ఎప్పుడు సెక్స్ చేశావ్?’’ అన్నాడు. విజయ్ దేవరకొండ ఆ ప్రశ్నకు జవాబు దాటేస్తూ.. ‘‘వ్యాయామం’’ చేశా అన్నాడు. అయితే, అనన్య పాండే మాత్రం ‘‘ఈ రోజే చేశాడని నేను అనుకుంటున్నా’’ అని సమాధానం ఇచ్చింది. ఆమె సమాధానాన్ని కరణ్ సరిచేస్తూ.. ‘‘కాదు, ఈ రోజు ఉదయం అనాలి’’ అని విజయ్‌ను ఆటపట్టించారు. 


ఆ తర్వాత కరణ్ ‘‘నువ్వు ఎప్పుడైన త్రిసోమ్(ఒక వ్యక్తి ఇద్దరితో కలిసి చేసే సెక్స్) చేశావా? ఇష్టమేనా?’’ అని అడిగాడు. ఇందుకు విజయ్ సమాధానం ఇస్తూ‘‘ఎప్పుడూ చేయలేదు. కానీ, అభ్యంతరం లేదు’’ అని సమాధానం ఇవ్వడంతో ప్రోమో ముగిసింది. ఈ షోలో కరణ్.. విజయ్ దేవర కొండ, రష్మికపై వస్తున్న రూమర్స్ గురించి కూడా అడిగినట్లు సమాచారం. 


‘కాఫీ విత్ కరణ్ సీజన్ -7’లో విజయ్ దేవరకొండ, అనన్య పాండేల ఇంటర్వ్యూ జులై 28న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. విజయ్ దేవర కొండ నటించిన పాన్-ఇండియా చిత్రం ‘లైగర్’ ఆగష్టు 25 న విడుదలవుతోంది. రమ్య కృష్ణన్, రోనిత్ రాయ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మైక్ టైసన్ అతిథి పాత్రలో నటిస్తున్నారు. పూరీ కనెక్ట్స్‌తో కలిసి, కరణ్ జోహార్ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 


Also read: కన్నీళ్లు పెట్టుకున్న మంచు లక్ష్మీ, ఇంత కష్టంగా ఉంటుందా అంటూ కామెంట్


Also Read: 'లెక్క' తప్పిన జాన్వి- ఆడేసుకుంటున్న నెటిజన్స్, పాపం అడ్డంగా బుక్కైపోయింది