యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతుంది. దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ సినిమాకి అన్ని ఏరియాల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే ఈ సినిమా రూ.800 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టింది. ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవ్వడంతో టీమ్ మొత్తం ఆనందంలో ఉంది. 


హీరోల పెర్ఫార్మన్స్, జక్కన్న మేకింగ్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అలానే కీరవాణి అందించిన సంగీతం సినిమాకి మరో ఎసెట్ గా నిలిచింది. 'ఆర్ఆర్ఆర్' సినిమాలో పాటలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలిచింది. ఈ సినిమా ఓ చిన్న పాటతో మొదలవుతుంది. 'కొమ్మ ఉయ్యాల.. కోన జంపాల' అంటూ ఓ చిన్నారి పాట పాడే సీన్ తో సినిమా మెయిన్ స్టోరీలోకి ఎంటర్ అవుతుంది. 


ఈ పాట పాడిన చిన్నారి గురించి కీరవాణి ఓ పోస్ట్ పెట్టారు. ఆ చిన్నారి పేరు ప్రకృతి. మార్చి 15న 2019లో ఈ పాటను రికార్డ్ చేశారు కీరవాణి. అప్పటికి ఆ చిన్నారి వయసు మూడేళ్లు. ఆ వయసులోనే ఎంతో స్పష్టంగా ఈ పాటను పాడింది ప్రకృతి. రికార్డింగ్ సమయంలో తీసిన చిన్న వీడియోను కీరవాణి షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. చిన్నతనం నుంచే ప్రకృతికి సంప్రదాయ సంగీతంలో శిక్షణ ఇప్పించారు. ఓ పక్క చదువుకుంటూనే మరోపక్క సంగీత పోటీల్లో పాల్గొంటూ తన టాలెంట్ ను నిరూపించుకుంది. ఈ చిన్నారి హిందీ, తమిళ భాషల్లో కూడా అద్భుతంగా పాడగలదు.


Also Read: 'ఆర్ఆర్ఆర్' టీమ్ కి బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు స్పెషల్ పార్టీ


Also Read: డ్రగ్స్ కేసుపై మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా రియాక్షన్ ఇదే