కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) కథానాయకుడిగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్ పతాకంపై 'బన్నీ' వాస్ నిర్మించిన చిత్రం 'వినరో భాగ్యము విష్ణు కథ' (Vinaro Bhagyamu Vishnu Katha). ఇందులో క‌శ్మీర ప‌ర్ధేశీ (Kashmira Pardeshi) కథానాయిక. ఫిబ్రవరి 17న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ రోజు టీజర్ విడుదల చేశారు.


Vinaro Bhagyamu Vishnu Katha Teaser Review : 'వినరో భాగ్యము విష్ణు కథ' టీజర్ ఎలా ఉందనే విషయానికి వస్తే... ''నా పేరు విష్ణు! మా జీవితాలు అన్నీ ఏడు కొండల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇంకొన్ని రోజుల్లో మీరందరూ చూడబోయేది నా కథ'' అని హీరో కిరణ్ అబ్బవరం చెప్పే మాటతో టీజర్ స్టార్ట్ అయ్యింది. టీజర్ అంతా హీరో వాయిస్ ఓవర్ మీద నడిచింది. 


''ఈ రోజుల్లో లవ్ లేకుండా ఏ స్టోరీ ఉంది సార్?'' అని కిరణ్ అబ్బవరం చెప్పడం... స్క్రీన్ మీద క‌శ్మీర ప‌ర్ధేశీతో లవ్ సీన్స్ రావడం బావుంది. ఆ తర్వాత కామెడీ, థ్రిల్, కాన్సెప్ట్ అన్నీ ఉన్నాయని హీరో చెప్పారు. 


''కాన్సెప్ట్ తో మొదలై... లవ్, కామెడీ మిక్స్ అయ్యి... క్రైమ్ నుంచి సస్పెన్స్ వైపు సాగే ఇంటెన్స్ యాక్షన్ డ్రామా అనుకోండి'' సినిమా గురించి కిరణ్ అబ్బవరం క్లారిటీ ఇచ్చారు. 


Also Read : '3Cs' వెబ్ సిరీస్ రివ్యూ : అమ్మాయిలు డ్రగ్స్ కలిపిన వోడ్కా తాగి, ఆ 'హ్యాంగోవర్'లో రచ్చ చేస్తే?



కిరణ్ అబ్బవరం పుట్టినరోజు (జూలై 15) సందర్భంగా గత ఏడాది జూలై 14న ఒక చిన్న వీడియో గ్లింప్స్ విడుదల చేశారు. ఇటీవల 'వాసవ సుహాస...' పాట కూడా విడుదల చేశారు. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి... పాట చాలా బావుందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. 'వాసవ సుహాస...' ప్రారంభానికి ముందు హీరోకి, తాతకు మధ్య జరిగే సంభాషణ సినిమాలోని కథా సారాంశాన్ని తెలిపే విధంగా ఉంది. కనిపించే ప్రతివాడు మన పక్కింటి వాడేనని సందేశాన్ని సినిమాలో ఇస్తున్నారని అర్థమైంది. ''నీ స్థాయి అనేది ప్రపంచాన్ని నువ్వు ఎంత ఎత్తు నుంచి చూస్తావ్ అన్నదాని బట్టే ఉంటుంది'' అని 'శుభలేఖ' సుధాకర్ చెప్పే మాట బావుంది. కనిపించే ప్రతి మనిషికి సాయం చేసే గుణం ఉన్న యువకుడిగా హీరో పాత్రను పాటలో పరిచయం చేశారు. కిరణ్ అబ్బవరం లుక్ కూడా పక్కింటి కుర్రాడిలా ఉంది. 
   
'వాసవ సుహాస...' పాటకు కళ్యాణ చక్రవర్తి త్రిపురనేని గొప్ప సాహిత్యం అందించారు. సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ అందించిన బాణీ, కారుణ్య గానం కూడా బావున్నాయి. ఈ పాటకు విశ్వ రఘు నృత్య దర్శకత్వం వహించారు. ఇందులోని సాహిత్యం అర్థం కాకున్నా మళ్ళీ వినాలనిపించేలా ఉంది.


Also Read : జనవరిలో తెలుగు థియేటర్లలోకి వస్తున్న సినిమాలు ఏవో చూడండి


'భలే భలే మగాడివోయ్', 'గీత గోవిందం', 'ప్రతి రోజూ పండగే', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్', 'ఊర్వశివో రాక్షసివో', '18 పేజెస్' వంటి విజయవంతమైన సినిమాలను నిర్మించిన జీఏ 2 పిక్చర్స్ లో ఈ సినిమా మరో హిట్ అవుతుందని యూనిట్ నమ్ముతోంది. ఈ సినిమాతో మురళీ కిశోర్ అబ్బురు తెలుగు చిత్రసీమకు ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌లు: స‌త్య‌ గమిడి - శ‌రత్ చంద్ర నాయుడు, ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్, సినిమాటోగ్రఫీ: విశ్వాస్ డేనియ‌ల్, స‌హ నిర్మాత‌: బాబు, సంగీతం: చైత‌న్ భరద్వాజ్.