KGF Star Yash Part of Salaar: దేశ వ్యాప్తంగా ‘సలార్’ ఫీవర్ పట్టుకుంది. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తుతున్నారు. నార్త్, సౌత్ అనే తేడా లేకుండా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఓవర్సీస్ లోనూ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. వసూళ్ల పరంగానూ ‘సలార్’ దుమ్మురేపుతోంది. తొలి రోజు రూ. 150 కోట్ల మార్క్ ను టచ్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
‘కేజీఎఫ్’ స్టార్ కు ‘సలార్’ మేకర్స్ థ్యాంక్స్
ఇక ‘సలార్’ సినిమాలో ‘కేజీఎఫ్’ స్టార్ యష్ భాగం కావడం విశేషం. ఈ విషయాన్ని ‘సలార్’ చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు, మూవీ టైటిల్ కార్డ్స్ ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా చెప్పింది. ఈ మేరకు ఓ స్లైడ్ ప్రదర్శించింది. అయితే, యష్ ఈ సినిమాలో నటించలేదు. కానీ, ఈ సినిమా ముహూర్తం షాట్ సమయంలో యష్ పాల్గొన్నారు. మూవీ ఓపెనింగ్ ఈవెంట్ కు హాజరకు కావడం పట్ల ఆయనకు కృతజ్ఞతలు చెప్పి ఉంటారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ‘సలార్’ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం జనవరి 2021లో జరిగింది. ఈ వేడుకలో యష్ పాల్గొన్నారు. ప్రభాస్‌తో కలిసి ఫోటోలకు పోజులిచ్చాడు.
‘సలార్’కు ‘కేజీఎఫ్’కు ఎలాంటి సంబంధ లేదు- ప్రశాంత్ నీల్
‘సలార్’ మూవీని ‘కేజీఎఫ్’ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు. అయితే, ఈ సినిమా ట్రైలర్ విడుదలైన సందర్భంగా చాలా మంది ఈ మూవీ ‘కేజీఎఫ్’ చిత్రాలకు కొనసాగింపుగా వస్తుందని అభిప్రాయపడ్డారు. ‘కేజీఎఫ్’ సినిమాకు ‘సలార్’ సినిమాకు సంబంధం ఉందంటూ చాలా మంది నెటిజన్లు ట్రైలర్ లో కొన్ని కామన్ పాయింట్స్ చూపించారు. అయితే, ‘సలార్’ సినిమాకు ‘కేజీఎఫ్’కు ఎలాంటి సంబంధం లేదని ప్రశాంత్ నీల్ వెల్లడించారు. నెటిజన్లు కేవలం ‘కేజీఎఫ్’లో సెట్ చేసిన టోన్ ను పోల్చుతున్నారని చెప్పుకొచ్చారు. ‘సలార్’లో ప్రభాస్ క్యారెక్టర్, ‘కేజీఎఫ్’లో యష్ పాత్రతో క్రాస్ ఓవర్ అంచనాలు ఉన్నప్పటికీ, రెండు కనెక్ట్ కావని ప్రశాంత్ స్పష్టం చేశాడు.
యష్ అభిమానులకు ‘సలార్’ మేకర్స్ సర్ ప్రైజ్
అటు ‘సలార్’ మూవీ చూస్తున్న ‘యష్’ అభిమానులకు మేకర్స్ అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చారు. ‘సలార్’ బ్రేక్ సమయంలో యష్ తర్వాతి చిత్రం ‘టాక్సిక్’ టైటిల్ రివీల్ వీడియోను ప్లే చేశారు. ఈ వీడియోకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. ఊహించని సర్ ప్రైజ్ తో అభిమానులు కేరింతలు కొట్టారు. ‘సలార్’ మేకర్స్ కు థ్యాంక్స్ చెప్పారు.
Read Also: ఓర్నీ, ‘సలార్’ ఫస్ట్ డే.. ఫస్ట్ షో.. ఫ్రీగా చూసేసిన ప్రభాస్ అభిమానులు, ఏం జరిగిందంటే..