Kayal Anandhi Mangai Trailer Out: కయాల్ ఆనంది.. పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. వరంగల్ జిల్లాకు చెందిన ఈ ముద్దుగుమ్మ పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందం, అభినయంతో ఆకట్టుకుంది. ‘జాంబిరెడ్డి’, ‘శ్రీదేవి సోడా సెంటర్’, ‘ఇట్లు మారేడుపల్లి ప్రజానీకం’ లాంటి సినిమాలలో అద్భుతంగా నటించింది. ప్రస్తుతం ఈ అమ్మాయి తమిళ, తెలుగు చిత్రం ‘మాంగై’లో నటిస్తోంది. గుబెంతిరన్ కామచ్చి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దుష్యంత్ జయప్రకాష్, రామ్, ఆదిత్య కతిర్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో త్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రచారం కార్యక్రమాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచింది. అమ్మాయి అందాలను సెల్ ఫోన్‌తో ఫోటోలు తీస్తున్నట్లుగా ఉన్న ఈ పోస్టర్ ఆడియెన్స్ లో ఆసక్తిని పెంచింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు.
సస్పెన్స్, థ్రిల్లర్ గా ఆకట్టుకున్న ‘మాంగై’ ట్రైలర్
ఇక ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం సస్పెన్స్, థ్రిల్లర్ గా కొనసాగింది. మున్నార్ నుంచి చెన్నైకి ఒంటరిగా ప్రయాణమైన యువతి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు. తాజా ట్రైలర్‌లో కూడా అదే విషయాన్ని వెల్లడించింది. కారులో ఆనంది, దుష్యంత్ కలిసి ప్రయాణం మొదలు పెడతారు. ఈ ప్రయాణంలో ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి? వాటి నుంచి ఆనంది బయటపడిందా? ప్రాణాలు కోల్పోయిందా? అనేది ఈ సినిమాలో ఆసక్తికరంగా చూపించబోతున్నారు మేకర్స్. అయితే, ఈ సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఆనంది ఒకే డ్రెస్సులో కనిపించడం విశేషం. ఇక ఈ సినిమాను కేరళలోని మున్నార్, పూపరాతో పాటు తమిళనాడులోని తేని, కంబం, కుడలూర్, లోయర్ క్యాంప్, చెన్నైలో షూట్ చేశారు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
తొలుత ఈ సినిమాలో నటించకూడదని భావించిన ‘మాంగై’
కొద్ది రోజుల క్రితం ‘మాంగై’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, చిత్ర నిర్మాతలు వెట్రిమారన్, అమీర్ కలిసి విడుదల చేశారు. JSM పిక్చర్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందుతోంది. వాస్తవానికి ఈ సినిమాలో బోల్డ్ సన్నివేశాలు, బూతు డైలాగులు ఉన్నాయట. ఈ నేపథ్యంలో సినిమా చేయకూడదని ఆనంది భావించిందట. అయితే, ఆమె భర్త తనను ఈ సినిమాలో నటించేలా ప్రోత్సహించారని చెప్పుకొచ్చింది. బోల్డ్ సన్నివేశాలు ఉన్నా ఫర్వాలేదు, మంచి కథ ఉంది కాట్టి వదులుకోవద్దని చెప్పారట. ఆనంది భర్త సోక్రటీస్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి. ఆయన దర్శకత్వంలో పలు సినిమాలు తెరకెక్కాయి. ఆనందిని సోక్రటీస్‌కు 2021లో పెళ్లి అయ్యింది. పెళ్లి తర్వాత ఆమె చేస్తున్న బోల్డ్ సినిమా ఇదే కావడం విశేషం. ఆనంది చివరిసారిగా నాగ చైతన్య నటించిన ‘కస్టడీ’లో అతిథి పాత్రలో కనిపించింది. అటు మలయాళీలో ఇండస్ట్రీలోనూ ఆనంది అడుగు పెట్టింది.
Read Also: ‘యానిమల్‘లో అండర్‌వేర్ యాక్షన్ సీన్ - సందీప్ రెడ్డి భార్య, కొడుకు రియాక్షన్ ఇదే!