యువ కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండ (Kartikeya Gummakonda) నటించిన తాజా సినిమా 'బెదురులంక 2012'. ఇందులో 'డీజే టిల్లు' ఫేమ్ నేహా శెట్టి (Neha Shetty) కథానాయిక. యుగాంతం వస్తే? ఓ పల్లెటూరిలో ప్రజలు ఏం చేస్తారు? అనే కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. ఈ రోజు ఆ పల్లె ప్రజల ప్రపంచాన్ని పరిచయం చేశారు.
చిత్రీకరణ పూర్తి...
జనవరిలో టీజర్!
'బెదురులంక 2012' చిత్రానికి క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్నారు. సి. యువరాజ్ సమర్పణలో లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై బెన్నీ ముప్పానేని (రవీంద్ర బెనర్జీ) నిర్మిస్తున్నారు. ఆయన నిర్మాణ సంస్థలో మూడో చిత్రమిది. 'కలర్ ఫోటో' చిత్రాన్ని నిర్మించింది ఆయనే. సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యిందని, జనవరి తొలి వారంలో టీజర్ విడుదల చేయాలని అనుకుంటున్నట్లు నిర్మాత తెలిపారు. ఈ రోజు 'ద వరల్డ్ ఆఫ్ బెదురులంక 2012' వీడియో విడుదల చేశారు. అందులో పల్లె, పల్లెలో ప్రజలను చూపించారు.
'ఆర్ఎక్స్ 100' హీరో కార్తికేయ, 'డీజే టిల్లు' హీరోయిన్ స్నేహా శెట్టి, 'కలర్ ఫోటో' నిర్మాత బెన్నీ కలిసి చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు బావున్నాయి.
విశాలమైన గోదావరి... నది తీరమంతా పచ్చటి కొబ్బరి చెట్లు... బండి మీద 'రయ్ రయ్...' మంటూ దూసుకు వెళుతున్న హీరో కార్తికేయ... చక్కటి లంగా ఓణీలో హీరోయిన్ నేహా శెట్టి... సుమారు నిమిషం నిడివి గల టీజర్‌లో కార్తికేయ, నేహా శెట్టి మధ్య ప్రేమతో పాటు అజయ్ ఘోష్, రాజ్ కుమార్ బసిరెడ్డి, గోపరాజు రమణ, 'ఆటో' రాంప్రసాద్ క్యారెక్టర్లను కూడా దర్శకుడు క్లాక్స్ పరిచయం చేశారు. ఊరిలో జనాలంతా యుగాంతం వస్తుందని ఎంజాయ్ చేసే తీరు నవ్వించేలా ఉంది.
''హొయ్ రబ్బోయ్... ఓరి నాయనా...
ఇదేంట్రోయ్... ఈ మాయ....
అయ్ బాబోయ్... ఆగలేం రోయ్...
వచ్చేయండ్రోయ్... వెయిటింగ్ ఇక్కడ''
అంటూ నేపథ్యంలో వచ్చే సాంగ్ క్యాచీగా ఉంది. ''ఈ యవ్వారం సూతంటే నీకు ఏమనిపిస్తుంది' అని అజయ్ ఘోష్ అడగడం హైలైట్.
Also Read : చేసుకోబోయే అమ్మాయిని రాత్రికి తీసుకు రమ్మంటే?
అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న చిత్రమిదని నిర్మాత బెన్నీ చెప్పారు. డ్రామా, కామెడీ సినిమాలో మెయిన్ హైలైట్స్ అవుతాయని ఆయన తెలిపారు. కార్తికేయ, నేహా శెట్టిల కెమిస్ట్రీ ఎంత అందంగా ఉందో... మిగతా క్యారెక్టర్లు చేసే పనులు కూడా అంతే నవ్విస్తాయని క్లాక్స్ చెప్పారు. త్వరలో టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని ఉందని ఆయన తెలిపారు.
అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, 'ఆటో' రామ్ ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య, సురభి ప్రభావతి, కిట్టయ్య, అనితానాథ్, దివ్య నార్ని తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి యాక్షన్: అంజి, పృధ్వీ, సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, కిట్టూ విస్సాప్రగడ, కృష్ణ చైతన్య, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: దుర్గారావు గుండా, ఛాయాగ్రహణం: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు, సన్నీ కూరపాటి, నృత్యాలు: బృంద, మోయిన్, సంగీతం: మణిశర్మ, సహ నిర్మాతలు: అవనీంద్ర ఉపద్రష్ట, వికాస్ గున్నల, సమర్పణ: సి. యువరాజ్, నిర్మాత: రవీంద్ర బెనర్జీ ముప్పానేని, రచన - దర్శకత్వం: క్లాక్స్.
Also Read : వినాయక్‌కు ముందు తెలుసేమో!? - పెళ్లి, పిల్లలు, ఆ 'అదుర్స్' మీమ్స్‌పై నయనతార రియాక్షన్ చూశారా?