Karthika Deepam November 29th  Episode 1522 (కార్తీకదీపం నవంబరు 29 ఎపిసోడ్)


శౌర్య గురించి టెన్షన్ పడుతున్న దీపకి ధైర్యం చెబుతాడు కార్తీక్. అప్పుడు దీప..నేను ఓ మాట అడుగుతాను అంటుంది..
దీప: ఒకవేళ నాకు ఏమైనా అయితే శౌర్యను వెతుకుతారు కదా 
కార్తీక్: ఎందుకు దీప అలా మాట్లాడతావు అని
దీప: నాకు ఏమైనా అయితే తర్వాత పరిస్థితి ఏంటి ..డాక్టర్ బాబు నిజంగా తను మీ కూతురే నేను ఉన్నా లేకపోయినా తన బాధ్యత మీదే 
కార్తీక్: దీప నాకు గతం గుర్తుకు వచ్చింది ఆ విషయం చెబితే సంతోషం తట్టుకునే స్టేజ్ లో నీ గుండె లేదు అందుకే చెప్పడం లేదనుకుని బాధపడతాడు. శౌర్య నా బాధ్యత అని అప్పుడే చెప్పాను కదా నువ్వు ధైర్యంగా ఉండు 
దీప: మరి మీరు నా దగ్గర ఉంటే ఆ మోనిత ఊరుకుంటుందా 
కార్తీక్: నేను తన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు శౌర్య దొరికే వరకు నీకు బాగయ్యేవరకూ ఇక్కడే ఉంటాను 
దీప: మీకు నిజంగానే గతం గుర్తుకు వచ్చి ఉంటే ఎంత బాగుండేదో డాక్టర్ బాబు అనుకుని బాధపడుతూ ఉంటుంది.  దుర్గా గురించి అడిగినా..అరెస్టు విషయం కార్తీక్ చెప్పడు


AlsoRead: విషమంగా దీప ఆరోగ్యం- నిజం తెలిసి మోనితని బురిడీ కొట్టించిన శివ


మరోవైపు సౌందర్య ఆలోచిస్తూ ఉండగా ఇంతలో హిమ అక్కడికి వచ్చి వెళ్దాం పద నానమ్మ పొద్దున్నే ఎవరో ఫోన్ చేస్తానన్నారు కదా అంటే ఇంకా రాజమ్మ ఫోన్ చేయలేదే అంటుంది. అప్పుడు సౌందర్య రాజమ్మకు ఫోన్ చేస్తుంది. అప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో సౌందర్య ఆనందరావు అక్కడికి బయలుదేరుతారు. మరొకవైపు కార్తీక్ హాస్పిటల్ కి వెళ్లిచూస్తే బెడ్ పై దీప ఉండదు. హాస్పిటల్ మొత్తం వెతుకుతూ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళిపోయావు దీప అసలే ని ఆరోగ్యం బాగోలేదు అని బాధపడుతూ ఉంటాడు కార్తీక్. మరొకవైపు ఆనంద్ రావు, సౌందర్య వాళ్ళు రాజమ్మ ఇంటికి వెళతారు. అక్కడ రాజమ్మ వాళ్ళు ఇల్లు ఖాళీ చేశారు అనడంతో సౌందర్య షాక్ అవుతుంది. జరిగిన విషయాలు తలుచుకుని నాకు ఇదేదో అనుమానంగా ఉంది సౌందర్య అంటాడు. అప్పుడు సౌందర్య ఆ ఇంట్లో ఉన్న ఆమెను ఎంత బెదిరించి అడిగినా కూడా ఆమె అబద్దాలు చెబుతూ ఉంటుంది. అప్పుడు సౌందర్య కోపంతో ఈ మోనిత, ఇందరుడు ఇద్దరి లెక్కలు తేలుద్దాం పదండి అంటుంది... సౌందర్య వాళ్లు అటు వెళ్లగానే..ఆ ఇంట్లో ఉన్న ఆమె..ఇంద్రుడికి కాల్ చేసి అసలు విషయం చెబుుంది. అప్పుడు ఇంద్రుడు వాళ్ళు ఎన్నిసార్లు వచ్చి అడిగినా కూడా నువ్వు అదే మాట మీద ఉండు భయపడకు అంత నేను చూసుకుంటాను అంటాడు.


మరోవైపు శౌర్య.. బాబాయ్ పిన్నిని ఇబ్బంది పెట్టడం ఎందుకు అమ్మా నాన్నని నేనే వెతుక్కుంటా అనుకుని వెతుకుతూ ఉంటుంది. అటు దీప శౌర్య ఫోటో చేతిలో పట్టుకుని రోడ్డుపై నడుచుకుంటూ వెళుతూ ఉంటుంది. అలా ఒకరికి తెలియకుండా శౌర్య దీప ఇద్దరూ పక్కపక్కనే వెతుక్కుంటూ ఉంటారు. ఇంతలో అక్కడకు వచ్చిన ఇంద్రుడు కావాలనే శౌర్యని అక్కడి నుంచి లాక్కొని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇంద్రుడు వాళ్ళు ఆటోలు వెళుతుండగా దీప రోడ్డు పక్కన పడిపోయి ఉంటుంది. అప్పుడు ఆటో డ్రైవర్ ఎవరో ఆవిడ అక్కడ పడిపోయారని చెప్పడంతో ఇంద్రుడు..దీపని చూసి షాక్ అవుతాడు. ఇంద్రుడు ఒడిలో పడుకున్న శౌర్య ఎవరు బాబాయ్ అనడంతో ఎవరూ లేమ్మా అని అబద్ధం చెపుతాడు.  ఆ తర్వాత  కార్తీక్ కార్లో వెళ్తూ దీప గురించి ఆలోచిస్తూ ఎక్కడికి వెళ్లావు దీప అనుకుంటూ వెళ్తూ ఉంటాడు. అటు సౌందర్య వాళ్ళు శౌర్య అతికించిన పోస్టర్లు చూసి కావాలనే ఎవరో వాళ్ళ పనులకు అడ్డంకి పడుతున్నారు అనుకుంటూ ఉంటాడు ఆనంద్ రావు. 


Also Read: నిజం తెలిసి గౌతమ్ ని ఛీ కొట్టిన రిషి- దేవయానికి వార్నింగ్ ఇచ్చిన మహేంద్ర


రేపటి( బుధవారం) ఎపిసోడ్ లో
ఇక చాలు దీపా ఆ మోనిత మొహం కూడా చూడను..నువ్వు కోలుకున్నాక నీకు నిజం చెప్పేసి శౌర్యని తీసుకుని హైదరాబాద్ వెళ్లిపోదాం అని దీప ముందు కన్నీళ్లతో కూర్చుంటాడు కార్తీక్... మరోవైపు సౌందర్య నిలదీయడంతో మోనిత గన్ ఎక్కుపెట్టింది...