Karthika Deepam November 19th Episode 1513 (కార్తీకదీపం నవంబరు 19 ఎపిసోడ్)
శౌర్య తినకుండా బాధగా కూర్చుని చూస్తుంటుంది. నానమ్మ వచ్చాక సర్దిచెప్పి పంపించేసి వస్తానంటుందిశౌర్య. దీంతో ఎలాగైనా శౌర్య మనసు మార్చాలని ప్లాన్ చేసుకున్న ఇంద్రుడు-చంద్రమ్మ మీ నానమ్మ రానంది అని అబద్ధం చెబుతారు. రాను అని నా ముఖం మీదే చెబితే తట్టుకోలేను అందుకే నేను రానని చెప్పిందని ఇంద్రుడు మాయమాటలు చెబుతాడు. నువ్వు ఎప్పుడు వస్తానంటే అప్పుడు నిన్ను తీసుకుని రమ్మన్నారని చెబుతారు. ఆ మాటలు విన్న శౌర్య కన్నీళ్లు పెట్టుకుంటుంది.. అమ్మానాన్నలు కనిపించే వరకే ఇక్కడ ఉంటాను బాబాయ్ కనిపించిన తర్వాత తాతయ్య వాళ్ళ దగ్గరికి వెళ్లి పోతాను అంటుంది.
Also Read: వసుకి బొట్టుపెట్టిన రిషి, మహేంద్రకి లెటర్ రాసి పెట్టేసి వెళ్లిపోయిన జగతి
సౌందర్య-ఆనందరావు
జరిగింది మొత్తం తలుచుకుని ఆలోచిస్తుంటుంది సౌందర్య. ఆనందరావు బాధగా పక్కన కూర్చుని ఉంటాడు
సౌందర్య: నన్ను తలపై కొట్టి స్పృహ కోల్పోయేలా చేసి హైదరాబాద్ శివారులో వదిలిపెట్టింది అంటే అది మామూలు ఆడది కాదు శౌర్య అన్న మాటలను బట్టి చూస్తే నిజంగానే కార్తీక్ దీప ఆ ఊర్లో ఉన్నారని నాకు అనిపిస్తోంది. కార్తీక్,దీప లు బతికే ఉన్నారేమో కార్తీక్ మోనిత దగ్గర ఉండటం వల్ల నా తల పగలగొట్టిందేమో
ఆనందరావు: నన్ను చూసి కూడా మోనిత కంగారుపడింది..కేవలం కార్తీక్ కోసం మాత్రమే అలా ప్రవర్తిస్తుంది..అందుకే నాక్కూడా అదే అనుమానం ఉందంటాడు
మోనిత
దేవుడికి దండం పెట్టుకుంటూ..అన్నీ అర్థమవుతున్నాయి కానీ కార్తీక్ కు గతం గుర్తుకు వచ్చిందా లేదా అన్న విషయాన్ని తెలుసుకోలేకపోతున్నాను ఈ ఒక్క విషయంలో క్లారిటీ ఇవ్వు అని అనుకుంటుంది..ఇంతలో దుర్గ వచ్చి మోనిత పక్కనే నిల్చుని దండం పెట్టుకుంటూ నాకు కూడా ఒక క్లారిటీ కావాలి స్వామి అంటాడు. నీకేం అన్యాయం చేశానురా నాతో ఎందుకు ఆడుకుంటున్నావ్ అని మోనిత ఫైర్ అవుతుంది. కార్తీక్ సార్ దీపమ్మ ఇంట్లో ఉండగా తాళం పగుల కొట్టావ్...కానీ బయటకు వచ్చిచూస్తే బయట రక్తంబొట్లు ఉన్నాయి తలుపులు పగులకొడితే రక్తం రాదు కదా..అంటే నువ్వు ఎవరి నెత్తో పగులకొట్టావ్ అని అడిగితే మోనిత తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది... ఇద్దరి మధ్యా కాసేపు మాటల యుద్ధం జరుగుతుంది.
Also Read: సౌందర్య తల పగులగొట్టిన మోనిత, దీప-కార్తీక్ లో మొదలైన అనుమానం!
మరోవైపు సౌందర్య కి కట్టుకడుతూ కొద్దిరోజుల పాటూ ఎక్కడికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండమని చెబుతుంది డాక్టర్. అప్పుడు డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత సౌందర్య ఆనంద్ రావులు మోనిత గురించి మాట్లాడుకుంటూ ఏ ఆడది చేయని పనులన్నీ మోనిత చేస్తోందని మాట్లాడుకుంటారు. మరొకవైపు మోనిత కార్తీక్ దీపల గురించి వీళ్లు ఇంత క్లోజ్ అయ్యారు ఏంటి నా ఇంట్లో కలిసి ఏం చేస్తున్నారు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఏదో ఒకటి చేసి కార్తీక్ ను ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోవాలి లేదంటే సౌందర్య ఆంటీ వస్తే నాపనై పోతుందని అనుకుంటుంది. అప్పుడే ఎంట్రీ ఇచ్చిన శివ...ఆవిడను హైదరాబాద్ తీసుకెళ్లే వరకు నేను టెన్షన్ తో చచ్చిపోయాను మేడం అని అంటాడు. ఇంతకీ ఆవిడ ఎవరో చెప్పండి లేదంటే టెన్షన్ తో చచ్చి పోయేట్టున్నాను అని అడుగుతాడు....
కార్తీక్...శౌర్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత మోనిత లక్ష రూపాయలు ఇచ్చి మరోసారి సౌందర్య టాపిక్ ఎత్తొద్దంటుంది. సమయానికి అక్కడికి వచ్చినకార్తీక్ ఆ డబ్బు తీసుకుని.. ఇంత డబ్బులు ఇస్తున్నావని అడుగుతాడు. కార్తీక్ ను డైవర్ట్ చేయాలనే ఆలోచనతో అసలు నీ అనుమానం ఏంటి..ఆ వంటలక్కని చంపేయమని ఇస్తున్నా అని చెబుతుంది. కార్తీక్ షాక్ అవుతాడు.
ఎపిసోడ్ ముగిసింది