కార్తీకదీపం (Karthika Deepam ) మార్చి 7 సోమవారం ఎపిసోడ్
కార్తీక్ దీప కలసి చిక్ మంగుళూర్ వెళతారు... మరోవైపు గుడికి వెళ్లిన సౌందర్య-ఆనందరావుతో పూజారి మాట్లాడతాడు. ఎక్కడైతే కార్తీక్ దీప మధ్య అనుమానాలు మొదలయ్యాయో, ఎక్కడైతే వారి బంధం బీటలు వారిందో మళ్లీ అదే చిక్ మంగుళూరుకి వెళ్లి పొరపాటు చేశారనిపిస్తోందమ్మా అంటాడు పూజారి. పోయిన జన్మలో చేసిన పాపాలు వెంటాడతాయి అంటారు. కొన్ని స్థల ప్రభావాలు విచిత్రంగా ఉంటాయి..నాకెందుకో మనసులో ఏదో కీడు శంకిస్తోంది...జాగ్రత్తగా ఉండమని చెప్పండి..వీలైతే వెనక్కు రమ్మని చెప్పండని చెప్పేసి వెళ్లిపోతాడు. పూజార మాటలకు సౌందర్, ఆనందరావులో కంగారు మొదలవుతుంది.
తుపాకీతో కనిపించిన మోనితని చూసి అరుణ, విన్నీ కంగారుపడతారు. మీ బాధ నాకు అర్థమవుతోంది ఏం కాదు దేవుడున్నాడు అంటుంది అరుణ. తుపాకీ గురిపెట్టిన మోనిత..దేవుడు నాకేం చేశాడు...ఇచ్చినట్టే ఇచ్చి అన్నీ లాగేసుకున్నాడు...ఇకపై దేవుడు అన్న పదం నాకు వినిపించకూడదు అంటుంది. వెంటనే తేరుకుని Sorry అరుణ వెళ్లు అంటుంది. దేవుడి కన్నా నిన్ను(తుపాకిని) నమ్ముకుంటేనే నాకు మంచి జరుగుతుంది అంటుంది.
Also Read: రిషి బాధను దూరం చేసే పనిలో పడిన వసుధార, ఆశ్చర్యంలో గౌతమ్
కార్తీక్-దీప చిక్ మంగుళూరు చేరుకుంటారు. గతంలో స్టే చేసిన హోటల్ కి చేరుకున్న తర్వాత కార్తీక్ అప్పటి సంఘటనలు (విహారి-దీపని చూసి తనలో అనుమానం రేకెత్తిన విషయాలు) అన్నీ తలుచుకుంటాడు.
దీప: డ్యామ్ దగ్గరకి వెళ్లిన పిల్లలు ఆడుకుంటుంటారు.( అప్పట్లో కార్తీక్ తో సరదాగా తిరిగిన రోజులు - విహారి కవితలు రాసిన ప్లేసెస్ అన్నీ తలుచుకుంటుంది). ఒక్కసారి నా జీవితంలో తుఫాను మొదలైంది, ఆనందాలు జ్ఞాపకాలు బాధలు అన్నీ మిగిల్చింది ఇక్కడే...పతితులార, బ్రస్టులార అంటూ కవిత్వం చెప్పుకుంటుంది. ఇంతలో కార్తీక్ వచ్చి పిలవడంతో ఉలిక్కి పడుతుంది.
కార్తీక్: Sorry దీప నేను చాలా మూర్ఖంగా, రాక్షసంగా ప్రవర్తించాను...రత్నాల్లాంటి ఇద్దరు అమ్మాయిలను ఇచ్చావు కానీ నాకప్పుడు ఏమైందో, ఎందుకు ఆలోచించానో తెలియదు, ఒక తప్పువల్ల సంవత్సరాల కొద్దీ శిక్ష పడింది నీకు
దీప: అలా అనొద్దు డాక్టర్ బాబు...ఓ వైపు కన్నీళ్లు, మరోవైపు ఆనందం...ఇక్కడికి రాగానే నన్ను నేను మర్చిపోతున్నాను
కార్తీక్: ఇక్కడ మనం తిరిగిన ప్రదేశాలు, అందమైన జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి...ఇన్ని అపురూపమైన తీపి గుర్తుల మధ్య ఆ గాయం ఇంకా నన్ను బాధిస్తూనే ఉంది. నిన్ను అనుమానించి పదకొండేళ్లు నీకు దూరమయ్యాను, వీలైతే నన్ను క్షమించు
దీప: మోనిత కారణంగా మీరు అలా అయ్యారని అర్థం చేసుకోగలను
కార్తీక్: మోనిత అలా చెప్పినా నేను కూడా నిన్ను అలా తప్పుగా అర్థం చేసుకోకూడదు కదా
దీప: మనిద్దరి మధ్య అంత చేసిన మోనితని ఇక మర్చిపోదాం
హిమ: మోనిత ఆంటీ ఏం చేసింది, డాడీ మాట్లాడవేంటి...మోనిత ఆంటీ మంచిదే కదా, నీ ఫ్రెండే కదా ....
దీప: అందరూ మంచి వాళ్లేరా..టైం బ్యాడ్ ఒక్కోసారి అంతే కదా...
కార్తీక్: మనం ఇక్కడకు వచ్చింది హ్యాపీగా గడపడానికి, నో ప్రశ్నలు, నో డౌట్స్...ఓన్లీ ఎంజాయ్ మెంట్
హిమ: మనం తిరిగి వెళ్లేసరికి నాకు డ్రైవింగ్ వచ్చేస్తుంది కదా..
కార్తీక్: నన్ను రోజూ హాస్పిటల్ కి నువ్వే డ్రాప్ చేద్దుగానివి
సౌందర్య ఇంట్లో: పూజారి మాటల్లో ఏదో అపశకునం వినిపిస్తోందండీ అన్న సౌందర్యతో...నాక్కూడా అలాగే ఉందంటాడు ఆనందరావు. ఆ మాటలు విన్నప్పటి నుంచీ నాకు భయంగా ఉందన్న సౌందర్య మాటలు విని...జాగ్రత్తగా ఉండమని వర్రీ అవడం ఎందుకు అంటారు ఆదిత్య, శ్రావ్య. కొన్ని మాటలు వినడానికి తేలికగా ఉన్నా వాటి లోతు చాలా ఉంటుంది...పూజారి గారి మాటల్లో ఆ లోతు కనిపిస్తోంది, ఏదో జరగబోతోందనే భయం వినిపిస్తోంది అంటుంది. ఒకే విషయంపై ఎక్కువగా ఆలోచించినా అలాగే అనిపిస్తుందనగానే...వదిలెయ్ సౌందర్య అంటాడు ఆనందరావు. కష్టాలు, కలహాలతోనే వాళ్లకాపురం గడిచిపోయింది, ఇంతకాలానికి ఇద్దరూ దగ్గరై...ఆనందంగా గడపేందుకు వెళ్లారు...ఆ ఆనందానికి ఎవరి అడ్డం రాబోతోందో, ఎవరి రూపంలో రాబోతోందో భయం వేస్తోంది అంటుంది. అన్నయ్య వాళ్లు హ్యాపీగా ట్రిప్ ఎంజాయ్ చేసి వస్తారన్న ఆదిత్యతో... నా మనసు నాకు అబద్ధం చెప్పలేదు.. అందుకే ఇంతలా భయపడుతున్నాను. అందరకీ ధైర్యం చెప్పే మీరే ఇలా అయిపోతే ఎలా అన్న శ్రావ్యతో...ఓసారి దీపకు కాల్ చేసి మాట్లాడితే కానీ నా మనసు ప్రశాంతంగా ఉండదంటుంది.
Also Read: రావణ సంహారం జరిగిన తర్వాత కూడా సీతారాముల కష్టాలు పోలేదు, కార్తీక దీపం సీరియల్ లో మరో మలుపు
చిక్ మంగుళూరులో దీప-కార్తీక్ పిల్లలు రిసార్ట్ కు చేరుకుంటారు. పిల్లలు అంతా తిరుగుతూ ఎంజాయ్ చేస్తుంటారు. వాళ్లని చూసి దీప-కార్తీక్ మురిసిపోతారు. మళ్లీ దీప గతంలో అక్కడ కార్తీక్ తో కలసి హ్యాపీగా స్పెండ్ చేసిన విషయాలు తలుచుకుని నవ్వుకుంటుంది. పిల్లలిద్దరూ ఓరూమ్, కార్తీక్ -దీప మరో రూమ్ కి వెళతారు. వెనుకనుంచి దీప కళ్లు మూస్తే..ఎవరబ్బా అన్న కార్తీక్ తో నేను కాక ఎవరుంటారు అని అలుగుతుంది. కదా...ఇక్కడికైనా ఎక్కడికైనా ఎవరొస్తారు వంటలక్క తప్ప అంటాడు కార్తీక్.
రేపటి( మంగళవారం) ఎపిసోడ్ లో
పిల్లలతో కలసి సంతోషంగా స్పెండ్ చేస్తారు. నన్ను వంటలక్క అని హిమ ఆటపట్టిస్తుంటే నీపని చెబుతా అన్న దీపని అడ్డుకుంటాడు కార్తీక్. కాసేపు సరదాగా ఆడుకుంటారు. సంతోషంగా ఉన్న దీపని చూసి మురిసిపోయిన కార్తీక్...ఇలా నిన్ను చూస్తుంటే ఏమనిపిస్తోందో తెలుసా... ఈ రోజు ఆఖరి రోజు అయినా పర్వాలేదంటాడు..షాక్ అయిన దీప అలా మాట్లాడొద్దు అంటుంది.