కార్తీకదీపం మార్చి 5  శనివారం ఎపిసోడ్ 


తమ్ముడు కావాలంటూ హిమ వీరంగం
బొమ్మలు, పాలసీసా పట్టుకుని మేడపైనుంచి దిగొచ్చిన హిమ..అమ్మా తమ్ముడు ఎక్కడా కనిపించడం లేదేంటని అడుగుతుంది. అందర్నీ అడుగుతుంటే... తమ్ముడిని వాళ్ల బంధువులు వచ్చి తీసుకెళ్లారని చెబుతుంది సౌందర్య. షాక్ అయిన హిమ.. తీసుకెళ్లడం ఏంటి, తమ్ముడికి బంధువులు ఎవ్వరూ లేరుకదా, అయినా మీరెలా ఇస్తారు, అమ్మా తమ్ముడిని ఎవరికి ఇచ్చారు మనం వెళ్లి తెచ్చుకుందాం పద, డాడీ తమ్ముడిని తెచ్చుకుందాం పదండి, శౌర్య నువ్వు మాట్లాడవేంటి తమ్ముడు వెళ్లిపోతే నీకు బాధగా లేదా... నాకు తమ్ముడు కావాలి, నాకు ఆనంద్ కావాలి అంటూ నేలపై కూర్చుని ఏడుస్తుంది. సముదాయించేందుకు దీప ప్రయత్నించినా...నాకేం చెప్పొద్దు, నేను విననంటుంది. ఆనంద్ కావాలి అంటూ పెద్ద వీరంగమే వేస్తుంది.  మీరు ఎప్పుడూ నిజం చెప్పరు, నేనే తమ్ముడిని వెతికి పట్టుకుంటానన్న హిమ..శౌర్య నీకు తమ్ముడిపై ప్రేమ లేదు కదా అంటూ సీరియస్ గా పైకి వెళ్లిపోతుంది.  బాబు విషయంలో నేను ఏదైనా తప్పుచేసి ఉంటే నన్ను క్షమించు పెద్దోడా అన్న సౌందర్...పిల్లల్ని తీసుకుని కొన్నాళ్లు ఎక్కడికైనా వెళ్లిరండి అని చెబుతుంది. 


Also Read: బంధం, ప్రేమ, స్నేహం, అసూయ- గుండె బరువెక్కించిన శుక్రవారం ఎపిసోడ్
గుడిలో సౌందర్య అన్నమాటలు తలుచుకుని రగిలిపోయిన మోనిత...నలుగురిలో నా పరువు తీస్తారా...నాకు కావాల్సింది నాకు దక్కకుండా మీకు కావాల్సింది మీరు తీసుకుంటే చూస్తూ ఊరుకుంటానా...మోనితతో పెట్టుకుంటే ఎవరినా మోక్షమే అంటూ గన్ తీస్తుంది. నా ఆవేశం ఎప్పుడూ కార్తీక్ ప్రేమనే కోరుకుంది కానీ ఈ రోజు బలి కోరుకుంది అంటుంది. 


విహారయాత్రలో కార్తీక్-దీప
కార్తీక్-దీప పిల్లలు అంతా కలసి విహారయాత్రకు వెళతారు. అంతా సంతోషంగా ఉన్నప్పటికీ హిమ మాత్రం ఇంకా ఆనంద్ నే గుర్తుచేసుకుంటూ బాధపడుతుంటుంది. ఇలా వెళతామని అస్సలు అనుకోలేదమ్మా అని శౌర్య.. నాక్కూడా ఆశ్చర్యంగానే ఉందని దీప అంటారు. ఎప్పటికీ ఇలాగే ఉంటామా అన్న దీప మాటలకు సమాధానంగా...అవును మనకు కష్టాలన్నీ దూరమయ్యాయి, తుఫాను వెలిసిపోయింది ఇకపై అంతా ప్రశాంతంగానే ఉంటాం అంటాడు కార్తీక్. తాడికొండలో పడిన ఇబ్బందుల గురించి దీప-కార్తీక్ ఇద్దరూ మాట్లాడుకుంటారు. అన్నింటినీ తలుచుకుంటున్నారు, అందర్నీ తలుచుకుంటున్నారు కానీ ఆనంద్ ని అందరూ మరిచిపోయారంటుంది హిమ. ఆనంద్ ని మీరంతా మర్చిపోయారు కదా తమ్ముడి మీద మీకెవ్వరికీ ప్రేమ లేదు కదా అంటుంది. ఆనంద్ గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంతమంచదని దీప-కార్తీక్ మనసులోనే అనుకుంటారు. 


హిమతో దీప చెప్పిన మాటలు
ఒకప్పుడు ఇద్దరం వేర్వేరుగా ఉన్నాం...అప్పుడు మనం ఎంత బాధపడ్డామో నీకు తెలుసు కదా..ఇద్దరం కలుసుకున్నాక ఎంత సంతోష పడ్డామో ఓ సారి గుర్తుచేసుకో. ఆనంద్ ముద్దుగా ఉంటాడు, మంచివాడు ఎప్పుడో ఓసారి ఆకలిస్తేనే ఏడ్చేవాడు, అందరకీ వాడంటే ఇష్టమే, ఏదో మన దగ్గరకి చేరాడు కానీ పిల్లలు తల్లిదండ్రుల దగ్గరకు చేరితేనే సంతోషిస్తారు కదా. వాడు మనతో కలసిపోయాడు కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ హ్యాపీగా ఉంటాడు. వాడు ఆనందంగా ఉండటం మనకి కూడా హ్యాపీనే కదా అని కార్తీక్ వంతపాడుతాడు. మనకు నిజమైన సంతోషం ఎప్పుడొస్తుందంటే మనకు ఇష్టమైన వారిని సంతోషపెట్టినప్పుడు మాత్రమే...బాబు అంటే అందరికీ ఇష్టమే...కానీ అదే టాపిక్ పదే పదే మాట్లాడొద్దు అంటుంది దీప. ఎందుకు అని అడిగితే... ఆనంద్ గురించి మాట్లాడితే తాడికొండ, అక్కడ పడిన కష్టాలు గుర్తొస్తాయంటుంది దీప. అందరం సంతోషంగా ఇలా చిక్ మంగుళూర్ వెళుతున్నాం కదా సరదాగా ఉన్నప్పుడు డాడీని బాధపెడతావా తప్పు కదా  అంటుంది. సరే నేను ఏమీ మాట్లాడను, తమ్ముడి గురించి అస్సలు అడగను అంటుంది. ఏంటి అలిగావా అని దీప...అలిగిన వారు చెబుతారా అని హిమ...హిమ అలక ఎలా తీర్చాలో నాకు తెలుసులే అని కార్తీక్ అంటారు. 


Also Read:  నువ్వు నటివి అయితే నేను మహానటిని, మోనితకి విశ్వరూపం చూపించిన సౌందర్య
హిమ ఇద్దరం కలసి డ్రైవింగ్ చేద్దాం రా అని పిలుస్తాడు. హిమ వచ్చి కార్తీక్ ఒళ్లో కూర్చుంటుంది.  డాక్టర్ బాబు ఇప్పుడు ఎందుకు ఇవన్నీ అంటే..హలో వంటలక్కా నీలాగా అందరి కాళ్లు విరగ్గొట్టదులే అని కౌంటర్ ఇస్తాడు. ( అప్పుడు విహారిని ఢీకొట్టడం ఆ తర్వాత జరిగిన పరిణామాలు గుర్తుచేసుకుంటుంది దీప...అప్పటి చిన్న సంఘటన జీవితాలను ఎన్నో మలుపులు తిప్పింది.., మళ్లీ ఆ జ్ఞాపకాలను వదిలేసిన దగ్గరకే వెళుతున్నామా అనుకుంటుంది). డాడీ నువ్వు వదిలేసెయ్ అని అల్లరి చేస్తుంది... కార్తీక్ చెప్పినా వినిపించుకోదు హిమ. నీ అలక తీర్చేందుకు మాత్రమే నేర్పిస్తానన్నారని దీప అంటే...నువ్వు నడిపితే భయం అంటుంది శౌర్య. హిమా వెనక్కు వచ్చేసెయ్ అని శౌర్య అనగానే మనం చచ్చిపోం లే..నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డం వేస్తానంటుంది హిమ. ఇలాంటి సమయంలో ఇలా మాట్లాడకూడదు అంటుంది దీప.  


చాలా రోజులకి మా కుటుంబంలో ప్రశాంతత నెలకొంది పంతులుగారు అని గుడిలో పూజారితో అంటారు సౌందర్య, ఆనందరావు. వరుసగా కష్టాలు పడి ఇప్పుడే తేరుకున్నాం అంటారు. కర్మ ఫలం అనుభవించక తప్పదంటాడు పూజారి. వెన్నెల తర్వాత అమావాస్య తప్పదు, చీకటి తర్వాత సూర్యుడు రాకా తప్పదని చెబుతాడు పూజారి. అంతా కలసి ఎందుకు రాలేదని పూజారి అడిగితే ఎక్కడైతే వారికి మనస్పర్థలు మొదలయ్యాయో అక్కడికే వెళ్లారని చెబుతుంది సౌందర్య. చిక్ మంగుళూర్ వెళ్లారా ....అక్కడకు వెళ్లకుండా ఉండాల్సింది అమ్మా అన్న పూజారిని ఎందుకు అని అడుగుతుంది. రావణ సంహారం జరిగినా కూడా సీతారాముల కష్టాలు పోలేదమ్మా..కాలం మళ్లీ వాళ్లని విడదీసింది..కాలం బలమైంది అమ్మా,..ఎంతటి పనైనా చేస్తుంది...ఎక్కడైతే కార్తీక్ దీప మధ్య అనుమానాలు మొదలయ్యాయో, ఎక్కడైతే వారి బంధం బీటలు వారిందో మళ్లీ అదే చిక్ మంగుళూరుకి వెళ్లి పొరపాటు చేశారనిపిస్తోందమ్మా., పోయిన జన్మలో చేసిన పాపాలు వెంటాడతాయి అంటారు. కొన్ని స్థల ప్రభావాలు విచిత్రంగా ఉంటాయి..నాకెందుక మనసులో ఏదో కీడు శంకిస్తోంది...జాగ్రత్తగా ఉండమని చెప్పండి..వీలైతే వెనక్కు రమ్మని చెప్పండని చెప్పేసి వెళ్లిపోతాడు.