కార్తీకదీపం (Karthika Deepam ) మార్చి 14 సోమవారం ఎపిసోడ్
యాక్సిడెంట్లో కార్తీక్, దీప చనిపోగా చెట్టుకొమ్మకి చిక్కుకున్న హిమని ఇంద్రుడు, చంద్రమ్మ కాపాడుతారు. అన్నీ తలుచుకుని ఏడుస్తునన హిమకి అన్నం తినిపించే ప్రయత్నం చేస్తారు. క్షణం క్షణం దీపని తలుచుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది. నన్ను హైదరాబాద్ తీసుకెళ్లండి మా నానమ్మ దగ్గరకి అని అడుగుతుంది. చిక్ మంగుళూర్ నుంచి హైదరాబాద్ అంటే మాటలా...అక్కడకు తీసుకెల్లాళంటే ఎంతఖర్చు అవుతుందో తెలుసా నాలుగైదు వేలైనా అవుతుందంటుంది చంద్రమ్మ. నువ్వు భయపడి నన్ను భయపెట్టకు ఈ ఇంద్రుడు తలుచుకుంటే ఏమైనా చేస్తాడంటాడు.
సౌందర్య ఇంట్లో
చేతిపై హిమ-శౌర్య ఇద్దరూ పచ్చబొట్లు పొడిపించుకుంటారు. హిమ గుర్తుగా శౌర్య 'H', శౌర్య గుర్తుగా 'H'వేయించుకుంటారు. ఆ హెచ్ ని చెరిపేసుకుంటానంటుంది శౌర్య. హిమపై అనవసరంగా కోపం పెంచుకుని నువ్విలా చేస్తే ఏమైపోతావో అనే భయమేస్తోంది అంటుంది శ్రావ్య. అమ్మా-నాన్న కలిశారు అంతా సంతోషంగా ఉన్నాం అనుకునే సమయంలో ఇలా అవడానికి కారణం ఆ హిమే అని ఫైర్ అయిన శౌర్య అక్కడి నుంచి వెళ్లిపోతుంది. వాళ్లు పోయినా కనీసం ఇదైనా వాళ్ల గుర్తుగా మిగిలినందుకు సంతోష పడాలో, ఇలా అయిపోతున్నందుకు భాదపడాలో అర్థం కావడం లేదంటుంది సౌందర్య.
ఆనందరావు: ఎవరూ ఎవర్నీ ఓదార్చలేని స్థితిలో ఉన్నాం...మన మధ్య ఒక్కరు లేరంటేనే తట్టుకోలేం అలాంటి ముగ్గురు ప్రాణాలు ఒకేసారి గాల్లో కలసిపోయాయి
సౌందర్య; పెద్దవాడి సమస్యకి పరిష్కారం ఎలా అనుకున్నాను కానీ ఇలాంటి పరిష్కారం దొరుకుతుందని అస్సలు అనుకోలేదు
ఆదిత్య: మీరిలా ఏడుస్తుంటే ఎలా ఓదార్చాలో అర్థంకావడంలేదు
ఆనందరావు: ఎవరు ఎవర్ని ఓదార్చాలో ఏం చెప్పి బాధను దూరం చేయాలో అర్థంకావడం లేదు
మరోవైపు శౌర్య బయటకూర్చుని కార్ డ్రైవింగ్ విషయంలో హిమ మాటలు గుర్తుచేసుకుంటుంది. ఇంతలో అక్కడకు వచ్చిన బస్తీవాసులంతా శౌర్యని ఓదార్చుతారు. డాక్టర్ బాబు , దీపమ్మ లేరనుకుంటే హిమకూడా లేకపోవడం మేం తట్టుకోలేకపోతున్నాం, మీ ఇద్దరూ ఎంత చక్కగా ఉండేవారో అన్న వారణాసిపై శౌర్య మండిపడుతుంది.మా అమ్మా-నాన్నని చంపేసిన రాక్షసి అది దాని పేరు ఎత్తొద్దంటుంది.
వారణాసి: మాకున్న దిక్కుని దేవుడు ఇలా తీసుకెళ్లిపోయాడేంటి, మాకు ఏ కష్టం వచ్చినా దీపక్క వచ్చి మాకు అండగా నిలబడేది, మాకోసం హాస్పిటల్ కట్టించింది, బస్తీబతుకుల్లో వెలుగునిచ్చింది...దీపక్క-డాక్టర్ బాబు లేని లోటు మీ ఇంటికే కాదు మా బస్తీకి కూడా .
ఆదిత్య: మీ కోసం మా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి
సౌందర్య: ఇప్పటివరకూ దీప, నా కొడుకు లేరని బాధపడ్డాను కానీ మీ మనసుల్లో వాళ్లు బతికే ఉన్నారు...మీకు ఏం అవసరం అయినా అండగా ఉంటాం. బస్తీవాసులు వెళ్లిపోయిన తర్వాత..శౌర్యా ఏంటిది ఎందుకే చనిపోయిన శౌర్యని మళ్లీ చంపుతున్నావ్
శౌర్య: అది చనిపోలేదు బతికేఉంది...
సౌందర్య: మా ముందు మాట్లాడినట్టు ఎవ్వరి ముందూ మాట్లాడకు అనగానే లేచి వెళ్లిపోతుంది శౌర్య. ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న హిమని ఇంతలా ద్వేషిస్తోంది...ఇది ఎటు దారితీస్తుందో అనే భయం వేస్తోంది.
ఆనందరావు: అది ద్వేషం కాదు హిమ డ్రైవింగ్ వల్లే ఇదంతా జరిగిందని బాధ..నెమ్మదిగా అదే అర్థంచేసుకుంటుంది
సౌందర్య:దాని పరిస్థితి చూస్తుంటే మారేలా కనిపించడం లేదు
Also Read: జగతి విషయంలో రిషి నిర్ణయాన్ని తప్పుబట్టిన వసుధార, మహేంద్ర రియాక్షన్ ఏంటి
హిమని హైదరాబాద్ తీసుకెళ్లేందుకు డబ్బుల కోసం ఏటీఎం బయట కాచుక్కుంటారు చంద్రమ్మ, ఇంద్రుడు. మన దగ్గరున్నది ఇస్తే దానం సాయం అంటారు. మనం మాత్రం ఉన్నోళ్ల దగ్గర్నుంచి దొంగతనం చేసి లేనివాళ్లకి ఇస్తున్నాం అంటాడు. అంతలో ఒకడు డబ్బులు తీసుకుని బయటకు రావడం చూసి చేబదులు దొరికింది అనుకుంటారు. ఫోన్లో రంగారావు గారితో మాట్లాడారు కదా డబ్బులిస్తానని ఇదిగో లైన్లో ఉన్నారంటూ ఫోన్ ఇస్తుంది చంద్రమ్మ. ఇప్పుడే మాట్లాడాను కదా అంటూ ఫోన్ మాట్లాడతాడు. మరోవైపు ఇంకో కాల్ రావడంతో ఆడబ్బుల బ్యాగు చంద్రమ్మ చేతికి ఇవ్వడంతో కారు వెనుకే ఉన్న ఇంద్రుడికి ఇస్తుంది. తనకు కావాల్సిన డబ్బులు తీసుకుని తిరిగి బ్యాగు ఇచ్చేస్తాడు. మొత్తానికి డబ్బు దొంగతనం చేస్తారు. సౌందర్య ఫ్యామీలీ అంతా కలసి దీప-కార్తీక్ కి పిండం పెడతారు. ఎవరికి వారే వాళ్లతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటారు.
Also Read: శౌర్య ఆవేశం హిమ జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పబోతోంది
రేపటి ఎపిసోడ్ లో
కార్తీక్-దీప ఫొటోల పక్కనున్న దండేసి ఉన్న హిమ ఫొటో తీసి బయటకు విసిరికొడుతుంది శౌర్య. అది కరెక్ట్ గా హిమ కాళ్ల దగ్గర పడుతుంది. అమ్మా నాన్నని మింగేసిన భూతం అది...దాని గుర్తులు ఏవీ ఇంట్లో ఉండకూడదు. అమ్మా నాన్నని మింగేసిన రాక్షసి అది నాకు ఎప్పటికీ కాదు..నేను హిమని వదిలిపెట్టను...మళ్లీ ఇంట్లో దాని పేరు ఎవ్వరు ఎత్తినా నేను మీకు దక్కను అంటుంది శైర్య. ఆ మాటలు విన్న హిమ ఇంట్లోకి అడుగుపెట్టకుండా బయటకు వెళ్లిపోతుంది.