ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్ దంపతుల రెండో కుమారుడు జహంగీర్ అలీ ఖాన్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కరీనా, సైఫ్ దంపతులకు ఇప్పటికే తైమూర్ ఖాన్ అనే కుమారుడు ఉన్న విషయం తెలిసిందే. ఈ ఖాన్ ఫ్యామిలీ అంతా కలిసి ఇటీవల మాల్దీవులు ట్రిప్‌కు వెళ్లింది. సైఫ్ పుట్టిన రోజు సందర్భంగా వీరంతా మాల్దీవులు వెళ్లారు. మాల్దీవ్స్ వెకేషన్‌కి సంబందించిన ఫొటోలను కరీనా తన అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటోంది. ట్రిప్ పూర్తయిన తర్వాత తిరిగి వస్తుండగా.. కాలీనా విమానాశ్రయంలో మన జహంగీర్ ముఖం కెమెరాలకు చిక్కింది. దీంతో బుడ్డి తైమూర్ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో లీకైంది.





2012లో కరీనా కపూర్.. సైఫ్ అలీఖాన్‌ని వివాహం చేసుకుంది. 2016లో వీరికి తైమూర్ అలీఖాన్ జన్మించాడు. ఆ తర్వాత 2021 ఫిబ్రవరి 15న కరీనా.. జహంగీర్‌కు జన్మనిచ్చింది. జహంగీర్‌ను కరీనా దంపతులు ముద్దుగా జెహ్ అని పిలుచుకుంటారు. తైమూర్ చిన్నప్పటి ఫొటోలు ఎప్పటికప్పుడు లీక్ అవుతుండేవి. అప్పట్లో ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. అయితే జెహ్ విషయంలో మాత్రం ఇప్పటి వరకు ఒక్క ఫొటో కూడా బయటకు రాలేదు.


ఇటీవల ఆరు నెలలు పూర్తి చేసుకున్న సందర్భంగా జెహ్‌ను ఎత్తుకున్న ఫొటోను కరీనా షేర్ చేసింది. అయితే అందులో జెహ్ ముఖం పూర్తిగా కనిపించలేదు. జెహ్ ఫస్ట్ లుక్ ఫొటోలను చూసిన ఫ్యాన్స్ అంతా అచ్చం తైమూర్ లానే ఉన్నాడని కామెంట్లు చేస్తున్నారు.





 Also Read: Actress Private Video: హీరోయిన్ల ప్రైవేట్ వీడియోలు ఎందుకు వైరల్ అవుతున్నాయి?


 Also Read: KGF 2 Release Date: కేజీఎఫ్ ఛాప్టర్ - 2 రిలీజ్ డేట్ వచ్చేసింది... కానీ, ట్విస్టు ఏంటంటే...


 Also Read: Sushant Singh Facebook: సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఫేస్‌బుక్‌ డీపీ ఛేంజ్‌... షాక్‌ అవుతున్న అభిమానులు..