హిందీ సినిమా పరిశ్రమలో కరణ్ జోహార్ కు క్రేజ్ మమూలుగా ఉండదు. ప్రముఖ దర్శక, నిర్మాతగా కొనసాగుతున్న ఆయన.. వెండితెరతో పాటు బుల్లితెరపై సైతం సందడి చేస్తున్నారు. ఆయన హోస్ట్ చేస్తున్న షో కాఫీ విత్ కరణ్ ఉత్తరాదిన ఎంతో ఫేమస్ అయ్యింది. ఇప్పటికీ 6 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో.. ఇప్పుడు ఏడో సీజన్ లోకి అడుగు పెట్టింది. గత షోలతో పోల్చితే ఈ షో మరింత పాపులర్ అవుతోంది. ఎప్పటి లాగే ఈ సీజన్ లోనూ  షో కి వచ్చే సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలతో అడిగి ఆసక్తి రేపుతున్నారు. ఆయా సెలబ్రిటీల ఎఫైర్స్, సెక్స్ లైఫ్ గురించి కూడా ఏమాత్రం మోహమాటం లేకుండా అడిగేస్తారు కరణ్. తాజాగా ఎదుటి వారి శృంగార అనుభవం గురించి అడుగుతూ తన ఎక్స్‌పియరెన్స్ చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.


కాఫీ విత్ కరణ్ సీజన్ 7లో భాగంగా తన జీవితంలో జరిగిన ఒక షాకింగ్  విషయాన్ని వెల్లడించారు కరణ్. ఈ సీజన్ తాజా షోలో టైగర్ ష్రాఫ్, కృతి సనన్  కలిసి పాల్గొన్నారు. సినిమాల గురించి పలు విషయాలను ముందుగా అడిగారు కరణ్. ఆ తర్వాత టైగర్ ష్రాఫ్‌ సెక్స్ లైఫ్ గురించి కరణ్ అడిగారు. ర్యాపిడ్ ఫైర్ రౌండ్‌ లో భాగంగా.. శృంగారంలో పాల్గొన్న అత్యంత విచిత్రమైన, విభిన్నమైన ప్రదేశమేదని క్వశ్చన్ చేశారు. ఇది విచిత్రం కాదు గానీ,  గాలిలో ఎత్తైన ప్రదేశంలో శృంగారం చేయడం అడ్వెంచరస్ గా ఉంటుందని టైగర్ ష్రాఫ్ చెప్పాడు. టైగర్ ష్రాఫ్ చెప్పిన వెంటనే కరణ్ జోహార్ రియాక్ట్ అయ్యారు. విమానంలో సెక్స్ చేసే గ్రూపులో నువ్వు కూడా సభ్యుడివా? జనాలు ఎలా చేస్తారో అర్ధం కాదు. షో తర్వాత నేను దీని గురించి మాట్లాడుతాను అంటూ.. ‘‘నేను కూడా ఓసారి అలా ప్రయత్నించాను. హెవీ వెయిట్ కారణంగా సమస్య వచ్చింది. లోపల కదలడానికి తగినంత స్థలం లేదు’’ అని చెప్పి అందరినీ షాక్ కు గురి చేశారు.


ఆ తర్వాత హీరోయిన్‌ కృతి సనన్‌ను కూడా కరణ్ ఇలాంటి ప్రశ్నే వేశారు. ‘‘నువ్వు ఇప్పటి వరకు సింగిల్‌ గానే ఉన్నావ్‌. ఎవరైనా ఉన్నారా? అని అడిగారు. ఓ రూమర్‌ కూడా ఉంది. అది నా పార్టీలోనే స్టార్ట్‌ అయిందట. అక్కడ చాలా మంది కృతి సనన్‌, ఆధిత్య రాయ్‌ కపూర్ల జంట చక్కగా ఉందని చెప్పారు. ఓ మూల రొమాన్స్‌ చేసుకుంటున్నారని కూడా అన్నారు’’ అని చెప్పారు. ‘‘మేము ఇద్దరం జంటగా బానే కనిపిస్తాం. నా గురించి నీకు తెలుసు. మూలన  అలాంటి పనులు చేయం’’ అని కృతి సనన్‌ చెప్పింది.  అతడు పక్కన ఉంటే చాలా సరదాగా ఉంటుందని చెప్పింది.  ప్రస్తుతం ఈ షో కి సంబంధించిన క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  



Also Read : ఎన్టీఆర్‌ను టార్గెట్ చేసిన కేసీఆర్? - దెబ్బకు రెండున్నర కోట్ల నష్టం


Also Read : ఫ్లాప్‌ల‌తో క‌ట్టిన స్టార్‌డ‌మ్ కోట - ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ క్రేజ్ వేరే లెవల్