తెలుగు టీవీ రంగంలో ‘జబర్దస్త్’ కామెడీ షో మాదిరిగానే, హిందీలో ‘కపిల్ శర్మ కామెడీ షో’ చాలా ఫేమస్. బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంటుంది. కపిల్ శర్మ కామెడీ షోలో ప్రతివారం సెలబ్రిటీలు సందడి చేస్తుంటారు. దేశంలో బాగా పాపులర్ అయిన టీవీ షోలలో ‘కపిల్ శర్మ కామెడీ షో’ టాప్ ప్లేస్ లో ఉంటుంది. ఈ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కపిల్ శర్మతో పాటు అతడి సహ నటుడు తీర్థానంద రావు బాగా పాపులర్ అయ్యాడు. తాజాగా ఆయన ఆత్మహత్యాయత్నం చేసుకోవడం అందరినీ షాక్ కు గురి చేసింది. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి చికిత్స కొనసాగుతోంది.

  


ఆత్మహత్యాయత్నానికి కారణం ఆమేనా?


తాజాగా ఫేస్ బుక్ లైవ్ లోకి వచ్చిన తీర్థానందరావు తన ఇబ్బందులను చెప్పుకుంటూ ఆత్మహత్యాయత్నం చేశాడు. సహజీవనం చేస్తున్న యువతి వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆయన వెల్లడించాడు. ఆమె తనను బ్లాక్ మెయిల్ చేస్తోందని, డబ్బులు డిమాండ్ చేస్తోందని ఆరోపించారు. ఆమెతో గత రెండు సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్నట్లు తెలిపాడు. గత కొంతకాలంగా తమ మధ్య గొడవలు అవుతున్నట్లు వెల్లడించాడు. పేస్ బుక్ లైవ్ లో తన కష్టాలను చెప్పుకుంటూనే అత్యంత ఫినాయిల్ తాగాడు. ఆ లైవ్ చూసిన తన ఫ్రెండ్స్ వెంటనే ఆయన ఇంటికి చేరుకున్నారు. అప్పటికే తను అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే అతడిని హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం తనకు హాస్పిటల్లో చికిత్స కొనసాగుతోంది. ఆయన పరిస్థితి విషమంగానే ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.


గతంలోనూ ఆత్మహత్యాయత్నం చేసిన తీర్థానందరావు


తీర్థానందరావు గతంలో కరోనా లాక్ డౌన్ సమయంలో ఆత్మహత్య యత్నం చేశాడు. ఆర్థిక ఇబ్బందులో ఆత్మహత్యకు ప్రయత్నించాడు. డబ్బులు లేకపోవడంతో తన కుటుంబ సభ్యులు కూడా తనను దూరంగా పెట్టారని అప్పట్లో ఆవేదన వ్యక్తం చేశాడు.  ఆత్మహత్యాయత్నం తర్వాత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చాలా బాధపడ్డాడు. ఆత్మహత్యాయత్నం చేసి  ఆసుపత్రిలో ఉంటే తనను చూడడానికి ఎవరూ రాలేదని చెప్పాడు. డిశ్చార్జ్‌ అయి ఇంటికి వచ్చాక కూడా ఎవరూ పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం సహజీవనం చేస్తున్న మహిళ డబ్బుల కోసం వేధిస్తోందని ఆరోపిస్తూ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇప్పటికే ఆమె వల్ల చాలా అప్పు చేసినట్లు తెలిపారు. తనపై పోలీసు కేసు కూడా పెట్టిందని,  మానసికంగా వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. 2016 వరకు ‘కపిల్‌ శర్మ షో’ కమెడియన్ చేసిన తీర్థానందరావు.. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు రావడంతో షో నుంచి వెళ్లి పోయాడు. పలు సినిమాల్లో అవకాశాలు వచ్చినా, పెద్దగా ఆర్థికంగా స్థిరపడే రెమ్యునరేషన్ మాత్రం రాలేదు. ఏదో అలా బతుకు బండి ముందుకు లాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే అమ్మాయి వేధింపుల మూలంగా ఆత్మహత్యాయత్నం చేశాడు. 24 గంటలు గడిస్తే గానీ, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఓ నిర్ణయానికి రాలేమని డాక్టర్లు చెప్తున్నారు. ఆయన ప్రాణానానికి ఎలాంటి హాని కలుగకూడదని అభిమానులు కోరుకుంటున్నారు.


Read Also: అల్లు అర్జున్ మల్టీఫ్లెక్స్ ‘AAA సినిమాస్’లోని ఈ ప్రత్యేకతలు మీకు తెలుసా?