Darshan: మీడియాకు మిడిల్ ఫింగర్ చూపించిన దర్శన్, జైల్లో ఉన్నా పొగరు... నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

నటుడు దర్శన్ కు జైలుకు వెళ్లినా పొగరు తగ్గలేదు. ఫ్యామిలీ మెంబర్స్ ను కలిసేందుకు సెల్ నుంచి బయటకు వచ్చిన ఆయన, మీడియాకు మిడిల్ ఫింగర్ చూపించారు. దర్శన్ తీరుపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Continues below advertisement

Darshan Showing Middle Finger To Media: తన అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న కన్నడ నటుడు దర్శన్... ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్కిస్తున్నాడు. తాజాగా తన భార్య విజయలక్ష్మి, అతడి సోదరుడు దినకర్‌ తో మాట్లాడేందుకు న్యాయస్థానం అరగంట పాటు అవకాశాన్ని కల్పించింది. ఈ నేపథ్యంలో సెల్ నుంచి బయటకు వచ్చాడు. ఆయను విజువల్స్ తీసేందుకు వెళ్లిన మీడియాను చూసి, అసభ్య రీతిలో వ్యహరించాడు. తన మిడిల్ ఫింగర్ చూపిస్తూ ముందుకెళ్లాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియోలో తెగ వైరల్ అవుతోంది. దర్శన్ తీరుపై పలువురు నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జైలుకు వెళ్లినా బుద్దిరాలేదంటూ మండిపడుతున్నారు. ఇంతకాలం అతడి సినిమాలు చూసినందుకు సిగ్గుగా ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు.    

Continues below advertisement

అభిమానులకు దర్శన్ భార్య రిక్వెస్ట్

జైల్లో దర్శన్ ను కలిసిన తర్వాత ఆయన భార్య విజయలక్ష్మి మీడియా ముందు పలు కీలక విషయాలు వెల్లడించింది. దర్శన్ అభిమానులు సంయమనం పాటించాలని కోరింది. “బయటి పరిస్థితుల గురించి దర్శన్ తో మాట్లాడాను. అతడు జైల్లో ఉండాల్సి రావడం నిజంగా బాధగా ఉంది. తన అభిమానుల గురించి ప్రత్యేకంగా అడిగారు. అందరినీ సంయమనం పాటించాలని కోరారు. అభిమానులు తనకు అండగా ఉండాలని కోరారు. తన అభిమానులు మంచి పనులలో భాగస్వామ్యం కావాలన్నారు. అతడు త్వరగా బయటకు రావాలని ప్రార్థించాలని కోరారు. న్యాయ వ్యవస్థపై మాకు అపారమైన విశ్వాసం ఉంది. మరికొద్ది రోజుల్లో మా కుటుంబానికి మంచి రోజులు వస్తాయని భావిస్తున్నాం” అని చెప్పుకొచ్చింది.      

రేణుకాస్వామి దారుణ హత్యలో దర్శన్ కీలకపాత్ర

కొద్ది నెలల క్రితం రేణుకా స్వామి అనే అభిమానని దర్శన్ దారుణంగా హత్య చేశాడు. దర్శన్ తన భార్య విజయ లక్ష్మిని కాదని నటి పవిత్ర గౌడతో ఎఫైర్ పెట్టుకోడాన్ని రేణుకా స్వామి తట్టుకోలేకపోయాడు. దర్శన్ ను వదిలిపెట్టాలంటూ ఇన్ స్టా వేదికగా హెచ్చరించాడు. చివరకు అశ్లీల ఫోటోలు పంపి వేధించాడు. ఈ విషయం దర్శన్ కు తెలియడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన అనుచరులతో కలిసి రేణుకాస్వామిని కిడ్నాప్ చేయించాడు. చిత్రహంసలకు గురిచేసి చంపేశాడు. ఈ హత్యలో దర్శన్ నేరుగా పాల్గొన్నట్లు ఆధారాలు లభించడంతో ఆయన ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. ఈ కేసులో దర్శన్ తో పాటు పవిత్రగౌడ మరో 13 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు అప్పట్లో కన్నడ సినీ పరిశ్రమతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. కన్నడ ప్రేక్షకులు ఎంతో మంది తమ అభిమాన హీరో అంటూ చెప్పుకునే దర్శన్ ఇంతటి దారుణానికి ఒడిగట్టాడని తెలుసుకుని షాకయ్యారు. గత కొంతకాలంగా జైల్లో ఉన్న దర్శన్ కేసు తీవ్రత దృష్ట్యా బెయిల్ లభించడం లేదు.   

Read Also: ‘దేవర’ను ఇంటర్వ్యూ చేసిన టిల్లు, దాస్- ప్రమోషన్స్ లో జోరు పెంచిన యంగ్ టైగర్ ఎన్టీఆర్

Continues below advertisement
Sponsored Links by Taboola