Pawan Kalyan Question in KBC: కౌన్ బనేనా కరోడ్ పతి సినిమా గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ హోస్టుగా చేస్తున్న ఈ షో దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యింది. ఈ షోలో పాల్గొన్ని ఎంతో మంది పెద్ద మొత్తంలో ప్రైజ్ మనీ గెల్చుకున్నారు. ప్రస్తుతం కౌన్ బనేనా కరోడ్ పతి 16వ సీజన్ కొనసాగుతోంది. తాజాగా ఈ షోలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి ప్రశ్న అడిగారు అమితాబ్ బచ్చన్.

  


ఇంతకీ పవన్ గురించి అడిగిన ప్రశ్న ఏంటంటే?


కౌన్ బనేనా కరోడ్ పతి లేటెస్ట్ ఎపిసోడ్ హాట్ సీట్ లో డాక్టర్ రాణి బ్యాంగ్, డాక్టర్ అభయ్ బ్యాంగ్ కూర్చున్నారు. వారికి పవన్ కల్యాణ్ గురించి ప్రశ్న వేశారు అమితాబ్. 2024 ఎన్నికల్లో ఏపీలో ఓ నటుడు డిప్యూటీ సీఎం అయ్యారు.. అతను ఎవరు? అని అడిగారు. పవన్ కల్యాణ్, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ అనే నాలుగు ఆప్షన్లు ఇచ్చారు. అభయ్ దంపతులకు సరైన ఆన్సర్ తెలియకపోవడంతో ఆడియెన్స్ పోల్‌కు వెళ్లారు. ఆడియెన్స్ లో ఎక్కువ మంది పవన్ కల్యాణ్ అని ఆన్సర్ చెప్పారు. అభయ్ కూడా పవన్ కల్యాన్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకున్నారు.  ఆ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పడంతో రూ. 1.60 లక్షలు గెలుచుకున్నట్లు బిగ్ బీ చెప్పారు. అటు తమకు హెల్ప్ చేసిన ఆడియెన్స్ కు అభయ్ థ్యాంక్స్ చెప్పారు. 


పవన్ కల్యాణ్ గురించి అమితాబ్ ఏం చెప్పారంటే?


అభయ్ దంపతులు పవన్ కల్యాణ్ ప్రశ్నకు సమాధానం చెప్పిన తర్వాత... అమితాబాబ్ పవర్ స్టార్ గురించి పలు విషయాలు చెప్పారు.  “జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఏపీ నూతన ఉప ముఖ్యమంత్రిగా బాధత్యలు తీసుకున్నారు. ఆయన మంచి నటుడు. చిరంజీవి చిన్న తమ్ముడే ఈ పవన్ కల్యాణ్” అంటూ హాట్ సీట్ లోని వారితో పాటు ఆడియెన్స్ కు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ నెట్టింట వైరల్ అవుతోంది. తమ అభిమాన నటుడు, నాయకుడు పవన్ కల్యాణ్ గురించి ప్రతిష్టాత్మక షోలో ప్రశ్న అడగడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ఈ వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు.






ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్


తాజాగా జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ జనసేన పార్టీ మహాకూటమిలో భాగస్వామ్యం అయ్యింది. ఆయన పార్టీ 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి, అన్ని స్థానాల్లో విజయం సాధించింది. పవన్ కల్యాణ్ లో ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో పలు కీలక శాఖలను పర్యవేక్షిస్తున్నారు.


Read Also: అక్కడ 'దేవర' ప్రీమియర్ - హాలీవుడ్‌లో ఆ రికార్డ్‌ కొట్టిన ఫస్ట్ ఇండియన్ సినిమా ఎన్టీఆర్‌దే