బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వివాదాస్పద కామెంట్స్ చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఏ విషయానైన్నా మొహమాటం లేకుండా మాట్లాడుతుంటుంది. తాజాగా మరోసారి తన అత్యుత్సాహాన్ని ప్రదర్శించి పరువు తీసుకుంది కంగనా. అసలు విషయంలోకి వస్తే.. శుక్రవారం నాడు భారీ అంచనాల మధ్య విడుదలైన 'బ్రహ్మాస్త్ర' సినిమాకి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. 


రిలీజ్ కి ముందు వచ్చిన హైప్ కారణంగా అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్ లో జరిగాయి. తొలిరోజు నుంచే ఈ సినిమాను థియేటర్లో చూడడానికి జనాలు ఆసక్తి చూపించారు. అయితే కంగనా ఇవేవీ పట్టించుకోకుండా.. ఈ సినిమా పెద్ద డిజాస్టర్ అని తేల్చేసింది. సుమిత్ కడెల్ అనే బాలీవుడ్ క్రిటిక్ 'బ్రహ్మాస్త్ర' సినిమా సింగిల్ స్టార్ రేటింగ్ ఇచ్చినట్లు.. సినిమాను బాగా విమర్శించినట్లు ఒక ట్వీట్ ని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టుకుంది.
అయితే కంగనా కోట్ చేసిన ట్విట్టర్ అకౌంట్ ఫేక్ అని తెలుస్తోంది. నిజానికి సుమిత్ అనే క్రిటిక్ 'బ్రహ్మాస్త్ర' సినిమాకి 3 స్టార్స్ రేటింగ్ గా ఇచ్చారు. సినిమాను పొగుడుతూ రివ్యూ ఇచ్చారు. రివ్యూలసంగతి పక్కన పెడితే.. 'బ్రహ్మాస్త్ర' సినిమాకి తొలిరోజు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. శనివారం కూడా బుకింగ్స్ బాగున్నాయి. ఆదివారం కూడా భారీ వసూళ్లు వచ్చే ఛాన్స్ ఉంది. 


అలా చూసుకుంటే కంగనా చెప్పినట్లు 'బ్రహ్మాస్త్ర' సినిమా డిజాస్టర్ అయ్యే అవకాశాలు లేవు. మరోపక్క కంగనా ఫేక్ ట్విట్టర్ అకౌంట్ పోస్ట్ షేర్ చేస్తూ.. సినిమాను విమర్శించడం వలన ఆమెను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. రీసెంట్ గా ఆమె నటించిన 'ధాకడ్' కంటే 'బ్రహ్మాస్త్ర' చాలా బెటర్ అని కంగనాను టార్గెట్ చేస్తున్నారు. 


Brahmastra Box Office Day 1 worldwide gross Collection : 'బ్రహ్మాస్త్ర' చిత్రానికి తొలి రోజు రూ. 75 కోట్లు వచ్చినట్లు చిత్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ వెల్లడించారు. ఆయన కలెక్షన్స్ పోస్టర్ విడుదల చేశారు. ''నా మనసు కృతజ్ఞత, ఉత్సాహం, ఆశతో నిండింది. మా 'బ్రహ్మాస్త్ర'ను చూడటానికి ప్రతి చోట థియేటర్లకు వెళ్లిన ప్రతి ఒక్కరికీ పెద్ద థాంక్యూ. సినిమా హాళ్లకు వెళ్లే సంప్రదాయాన్ని కొనసాగిస్తారని ఆశిస్తున్నాను'' అని అయాన్ ముఖర్జీ పేర్కొన్నారు. రాబోయే కొన్ని రోజులు ఈ సినిమాకు చాలా కీలకం. వీకెండ్ తర్వాత బాక్సాఫీస్ దగ్గర సినిమా పరిస్థితి ఎలా ఉంటుందనేది చూడాలి. 


ర‌ణ్‌బీర్‌ కపూర్ (Ranbir Kapoor), ఆలియా భట్ (Alia Bhatt) జంటగా నటించిన 'బ్రహ్మాస్త్ర'కు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, అక్కినేని నాగార్జున, మౌనీ రాయ్, షారూఖ్ ఖాన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఎస్.ఎస్. రాజమౌళి సమర్పణలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా విడుదలైంది. 


Also Read : టాక్‌తో సంబంధం లేకుండా 'బ్రహ్మాస్త్ర' కలెక్షన్స్ - తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్స్


Also Read : 'ఒకే ఒక జీవితం' రివ్యూ : టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ & మదర్ సెంటిమెంట్ శర్వాకు హిట్ ఇచ్చాయా?