సింగర్ మనో టెలివిజన్ నటుడిగా పరిచయం అవుతున్న సరికొత్త సీరియల్ కళ్యాణం కమనీయం. గతంలో అఖిలాండేశ్వరిగా జీ తెలుగు ప్రేక్షకులను అలరించిన హరిత రెండేళ్ల తర్వాత సీతారత్నంగా వస్తున్నారు. జనవరి 31న రాత్రి 7.30 గంటలకు తొలి ఎపిసోడ్ మొదలు కానుంది. అమ్మ కోసం అన్వేషిస్తున్న ఇద్దరి కూతుళ్ల కథ ఇది. తన పిల్లలని ఎప్పటికైనా కలుసుకోవాలి, కళ్లారా చూసుకోవాలని ఓ అమ్మ వేదన ఈ కథ.
కథ విషయానికొస్తే, సీతారత్నం (హరిత) సాధారణ గృహిణి, ఒక శరణాలయాన్ని నడుపుతుంది. మరోవైపు చైత్ర (మేఘన లోకేష్) ఫీజియోథెరపిస్ట్. తండ్రి ( సింగర్ మనో) ఆఖరి నిముషంలో అమ్మ గురించి నిజాన్ని చెప్పి కన్నుమూస్తాడు. అప్పుడు అమ్మ గురించి అన్వేషణ ప్రారంభించిన అక్కాచెల్లెళ్లు సీతారత్నం చెంతకి చేరుతారు. అదే సమయంలో సీతారత్నం కోసం రాక్ స్టార్ విరాజ్ (మధు) కి ఎదురునిలబడుతుంది డాక్టర్ చైత్ర. రాక్ స్టార్, డాక్టర్ మధ్య గొడవ తగ్గి ప్రేమ ఎలా మొదలైంది. సీతారత్నానికి వాళ్లే తన పిల్లలు అనే నిజం తెలుస్తుందా.. తల్లీ కూతుర్లు ఒక్క టయ్యేదెప్పుడు..ఇదే కళ్యాణం కమనీయం కథ.
రెండేళ్ల తర్వాత జీ తెలుగులో అడుగుపెట్టిన హరిత...తనకు పుట్టించికి వచ్చినంత ఆనందం కలుగుతోందన్నారు. పిల్లల కోసం తల్లిపడే తపన, ఆరాటం..ఈ కథ మీ అందరికీ నచ్చుతుందని, తనను ఆదరిస్తారని ఆశిస్తున్నా అన్నారు. మరి సీతారత్నం, చైత్ర మరియు విరాజ్ జీవితాలు ఏ విధమైన మలుపులు తిరుగుతాయో తెలియాలంటే ‘కళ్యాణం కమనీయం’ సీరియల్ చూడాల్సిందే. ఈ జనవరి 31 నుంచి రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది.
Also Read: నాన్నకు ప్రేమతో రిషి.. జగతిని ఇంటికి తీసుకొస్తాడా, మధ్యలో వసు రాయబారమా .. గుప్పెడంత మనసు సోమవారం ఎపిసోడ్
Also Read: మోనిత కొడుకు కోసం కార్తీక్-దీప తాపత్రయం, నెల రోజులు గడువిచ్చిన రుద్రాణి.. కార్తీకదీపం సోమవారం ఎపిసోడ్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి