నందమూరి కల్యాణ్ రామ్(Nandamuri Kalyan Ram) హీరోగా నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ .కె నిర్మిస్తున్న సినిమా 'బింబిసార (Bimbisara Movie). ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్... అనేది ఉపశీర్షిక. ఈ సినిమాతో వశిష్ఠ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హీరోగా కల్యాణ్ రామ్ 18వ చిత్రమిది (NKR18). ఈ సినిమాను ఆగస్టు 5న (Bimbisara On August 5th, 2022) విడుదల చేయనున్నట్టు తెలిపారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్ అయ్యాయి. ఇప్పడు ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. జూన్ 4న సినిమా ట్రైలర్ రిలీజ్ కానుంది. అంతకంటే ముందుగా ట్రైలర్ గ్లింప్స్ ను వదిలారు. ఇందులో 'ఓ యుద్ధం మీద పడితే ఎలా ఉంటుందో చూస్తారు' అనే డైలాగ్ వినిపించింది. కళ్యాణ్ రామ్ పవర్ ఫుల్ లుక్స్, టెరిఫిక్ విజువల్స్ తో ఈ వీడియో ఆకట్టుకుంటుంది.
మరి ట్రైలర్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. 'బింబిసార' కేథరిన్ ట్రెసా (Catherine Tresa), సంయుక్తా మీనన్ (Samyuktha Menon), వరీనా హుస్సేన్ (Warina Hussain) హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు రామజోగయ్య శాస్త్రి, శ్రీమణి, వరికుప్పల యాదగిరి పాటలు రాస్తున్నారు. ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి నేపథ్య సంగీతం అందిస్తున్నారు. చిరంతన్ భట్ స్వరాలు అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రాఫర్.