Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode
విహారి, సహస్ర పెళ్లి విషయం గురించి ఇంట్లో ఎవరూ ఎందుకు మాట్లాడటం లేదని సహస్ర తల్లి విహారి వాళ్ల అమ్మ దగ్గరకు వెళ్లి వాదిస్తుంది. ఇప్పటికే రెండుసార్లు పీటల మీద పెళ్లి ఆగిపోయిందని...అప్పుడు తప్పకుండా విహారికి సహస్రను ఇచ్చి పెళ్లి చేస్తామని మాట ఇచ్చారంటుంది..ఇప్పుడు అదేగానీ జరగకపోతే సహస్ర బ్రతకదని బెదిరిస్తుంది. ఈ మాటలన్నీ బయట నుంచి విహారీ వింటుంటాడు. త్వరలోనే మంచి ముహూర్తం చూసి ఇద్దరికి పెళ్లిచేద్దామని విహారి తల్లి మాటిస్తుంది.ఈసారి పెళ్లి జరగకుంటే జరిగే పరిణామాలకు బాధ్యురాలివి నువ్వేనంటూ సహస్ర తల్లి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
మదన్ లక్ష్మీ వద్దకు వచ్చి తన భర్త గురించి వివరాలు అడుగుతాడు. నిన్నువదిలేసి వెళ్లిన వాడు పెద్ద మూర్ఖుడు అనడంతో కనకం కోపంతో రగిలిపోతుంది.ఇంకోసారి తన భర్త గురించి మాట్లాడొద్దని హెచ్చరిస్తుంది.అప్పుడు విహారీ అక్కడే ఉంటాడు. వెంటనే మదన్ విహారి దగ్గరకు వెళ్లి నువ్వు చెబితే లక్ష్మీ వింటుందిరా నువ్వైనా చెప్పరా అని అడగ్గా....తనని ఫోర్స్ చేయొద్దని విహారి అంటాడు. ఇంతకు ముందు కూడా మనం ఒత్తిడి చేయబట్టే ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని...విషం తాగిందని అంటాడు. కాబట్టి ఆమెపై మరోసారి ఒత్తిడి తీసుకురావొద్దని చెప్పి ఇద్దరూ కలిసి కారులో ఆఫీసుకు బయలుదేరి వెళ్లిపోతారు.
కన్‌స్ట్రక్షన్ వర్కు నుంచి సూపర్‌వైజర్ అంబికకు ఫోన్ చేసి గోడ కూలి ఓ కూలి చనిపోయాడని మీరు ఇచ్చిన నాసిరకం అప్రూవల్ వల్లే ఇదంతా జరిగిందని చెబుతాడు. అప్పుడు ఆమె నాకు ఏం సంబంధం..మీ సీఈవో విహారిని అతన్నినిలదీయండని ఉసుగొల్పుతుంది. పైగా నీకు ఎంత డబ్బులు కావాలన్నాఇస్తాను...ఆ చనిపోయిన కూలీ కుటుంబ సభ్యులతో విహారిపై కేసు పెట్టించమని రెచ్చగొడుతుంది.
కారులో వెళ్తుండగా విహారి లక్ష్మీని అడుగుతాడు...నీ భర్తను అంటే ఎందుకు అంత కోపం వచ్చిందని ప్రశ్నిస్తాడు. దానికి లక్ష్మీ...నిన్నటి వరకు పెళ్లిచేసుకో చేసుకో అని అన్న మీరే...ఇవాళ నన్ను ఫోర్స్‌చేయొద్దని అన్నారని అడుగుతుంది. ఇంతలోనే కూలి చనిపోయిన విషయం విహారికి ఫోన్ ద్వారా మరో సూపర్ వైజర్ తెలుపుతాడు. వాళ్లు కేసు పెడతామని చెబుతాడు. ఇది తెలిసి వెంటనే కనకంతో కలిసి విహారి సైట్ వద్దకు బయలుదేరతాడు.అప్పటికే పోలీసులు ఇంటికి రావడంతో విహారి వాళ్ల అమ్మ అతనికి ఫోన్ చేసి అసలు విషయం చెబుతుంది. దీంతో విహారి సైట్‌కు వెళ్లకుండి తిరిగి ఇంటికి వస్తాడు. స్టేషన్‌కు రావాల్సిందిగా ఎస్‌ఐ చెప్పడంతో కనకం నోటీసు ఇచ్చారా అంటూ నిలదీస్తుంది. అయినప్పుటికీ పోలీసులు విహారిని స్టేషన్‌కు తీసుకెళ్తాడు.
అంబిక సీఐకు ఫోన్ చేసి 50 లక్షలు లంచం ఇస్తానని ఆశపెడుతుంది. విహారిని విచారించకుండా ఎన్‌కౌంటర్ చేస్తే ఆ డబ్బు మొత్తం మీకు ఇస్తానని చెబుతుంది. అలాంటి పనులు చేయనని చెప్పడంతో ఈసారి కోటిరూపాయలు ఇస్తానని చెబుతుంది..అప్పటికీ సీఐ లొంగకపోవడంతో ఎస్పీగా ప్రమోషన్ ఇప్పిస్తానని ఆశపెడుతుంది. అడ్వాన్స్‌గా నోట్ల కట్టలు లంచ్‌బాక్స్‌లో పెట్టి అంబికా సీఐకు అందజేస్తుంది. ఎన్‌కౌంటర్ చేసిన తర్వాత మిగిలిన సొమ్ము ఇస్తానని చెబుతుంది. దీంతో విహారిని ఎన్‌కౌంటర్ చేసేందుకు సీఐ అంగీకరిస్తాడు. విహారిని సెల్‌లో బంధించడంతో ఇవాల్టి ఏపీసోడ్ ముగిసిపోతుంది.