వెటరన్ కన్నడ యాక్టర్ కళాతపస్వి రాజేష్(89) ఫిబ్రవరి 19, తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా శ్వాసకోస సంబంధిత సమస్యలతో బాధ పడుతున్న ఆయను ఫిబ్రవరి 9న బెంగుళూరులోని ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. కొన్నిరోజుల పాటు ట్రీట్మెంట్ అందించారు. అయితే సడెన్ గా ఆయన శరీరం ట్రీట్మెంట్ కి స్పందించకపోవడంతో ఈరోజు కన్నుమూశారు. 


ఏప్రిల్ 15, 1932లో జన్మించిన రాజేష్ అసలు పేరు ముని చౌడప్ప. స్టేజ్ షోల్లో నటించే సమయంలో అతడి పేరుని విద్యాసాగర్ గా మార్చుకున్నారు. ఆ తరువాత సినిమాల్లో అవకాశాలు రాగా.. తన స్క్రీన్ నేమ్ ను రాజేష్ గా పెట్టుకున్నారు. 1960లో నటుడిగా కెరీర్ మొదలుపెట్టిన ఆయన కన్నడలో ఎన్నో సినిమాల్లో నటించి 'కళాతపస్వి' అనే బిరుదుని సంపాదించుకున్నారు. 







అభిమానులు చివరిచూపు చూసుకోవడం కోసం.. ఆయన పార్థివదేహాన్ని ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు విద్యారణ్యపురలో ఆయన స్వగృహంలోనే ఉంచనున్నారు. రాజేష్ మరణవార్త తెలుసుకున్న సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.