టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న కాజల్ అగర్వాల్.. 2020లో గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకుంది. పెళ్లి తరువాత కూడా ఆమెకి వరుస అవకాశాలు రావడంతో నటిగా బిజీ అయింది. వరుసగా షూటింగ్స్ లో పాల్గొంది. అయితే ఆమె గర్భం దాల్చడంతో సడెన్ గా సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. నాగార్జున 'ది ఘోస్ట్' సినిమాలో నటిస్తానని ఒప్పుకొని ప్రెగ్నెన్సీ కారణంగా సినిమా నుంచి తప్పుకుంది.
ప్రస్తుతం కాజల్ ఇంట్లోనే ఉంటూ రెస్ట్ తీసుకుంటుంది. మొన్నామధ్య కాజల్ బేబీ బంప్ ఫొటోను ఆమె భర్త గౌతమ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫొటో బాగా వైరల్ అయింది. ఇప్పుడు కాజల్ స్వయంగా రెండు బేబీ బంప్ ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. రూమ్ బాల్కనీలో నుంచి బయటకు చూస్తూ పోజులిచ్చింది కాజల్. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రీసెంట్ గా కాజల్ ప్రెగ్నెన్సీ వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ తో మాట్లాడిన వీడియో మీటింగ్ కి సంబంధించిన ఫొటోను షేర్ చేసింది. అందులో కాజల్ నెంబర్ కనిపించడంతో నెటిజన్లు రెచ్చిపోయారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ఈ బ్యూటీ నటించిన 'ఆచార్య' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. బాలీవుడ్ లో 'ఉమ' అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాను పూర్తి చేసింది కాజల్.