టాలీవుడ్ టాప్ హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. తన నటన, డైలాగ్ డెలివరీతోనే కాకుండా సినిమా సినిమాకు ఎప్పటికప్పుడు ట్రెండీగా లుక్స్ మారుస్తూ తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పరుచుకున్నారు. ఆయన ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివతో కలసి చేస్తోన్న ఎన్టీఆర్ 30 (NTR 30) సినిమాలో నటిస్తున్నారు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ (NTR) కు సంబంధించి లేటెస్ట్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫోటో చూసిన ఎన్టీఆర్ అభిమానులు తెగ మురిసిపోతున్నారు. ఇంతకీ ఆ ఫోటో ఏంటంటే... ఇటీవల ఎన్టీఆర్ న్యూ లుక్ లో ఉన్న ఫోటోను తన సోషల్ మీడియా ఖాతాలో  షేర్ చేసుకున్నారు. ఆ ఫోటో ను ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ క్యాప్చర్ చేస్తున్నట్టుగా ఉంది. 'ఏ న్యూ డే, న్యూ వైబ్' అంటూ క్యాప్షన్ కూడా రాశారు ఎన్టీఆర్. దీంతో ఈ ఫోటో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. 


అభిమానుల అభిరుచులకు అనుగుణంగా ఎప్పుటికపుడు కొత్త లుక్ లో కనిపించే హీరోల్లో ఎన్టీఆర్ ఒకరు. కేవలం సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడూ కనిపిస్తూ అభిమానులను ఉత్సాహపరుస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటారు. ఇటీవల జపాన్ లో 'ఆర్.ఆర్.ఆర్' ప్రమోషన్స్ లో ట్రెండీ కనిపించడమే కాకుండా జపనీస్ భాషలో మాట్లాడి ఔరా అనిపించారు. తాజాగా కొత్త లుక్‌తో కనిపించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు.


ఈ కొత్త లుక్ లో ఎన్టీఆర్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. స్టైలిష్‌ క్రాఫ్‌, గడ్డం, గాగుల్స్‌ తో జీన్స్ ట్రౌజర్‌ వేసుకుని కెమెరాకు ఫోజులిచ్చారు ఎన్టీఆర్. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటో తారక్ కొత్త సినిమాకు సంబంధించిన ఫోటోనే అని కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.  ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. మొన్నటి వరకూ ఈ సినిమాపై విమర్శలు వచ్చాయి. సినిమా నిలిచిపోయినట్లు ప్రచారం కూడా జరిగింది. అయితే ఆ ప్రచారాన్ని కొట్టిపారేస్తూ సినిమా పై క్లారిటీ ఇచ్చేసింది మూవీ టీమ్. 


Also Read : కార్ డ్రైవర్‌కు 15 లక్షలు సాయం చేసిన అల్లు అర్జున్, ఎందుకంటే ?


ఎన్టీఆర్ కొరటాల కాంబోలో వచ్చిన 'జనతా గ్యారేజ్' సినిమా ఎంత హిట్ అయిందో చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో ఎన్టీఆర్ ను ఒక కొత్త లుక్ లో చూపించారు కొరటాల శివ. ఆ సినిమా తర్వాత వారిద్దరి కాంబో లో వస్తోన్న  ఎన్టీఆర్ 30 సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా ప్రి ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే సినిమా స్క్రిప్ట్ కు సంబంధించి కూడా కొన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నాయని ఫిల్మ్ వర్గాల్లో టాక్. వీలైనంత త్వరలోనే సినిమా పట్టాలెక్కనుంది. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ న్యూస్ లుక్ కొత్త సినిమా కు సంబంధించిందా లేదా ఏదైనా యాడ్ కు సంబంధించిన ఫోటో నా అనేది క్లారిటీ లేదు. ఏదేమైనా ఎన్టీఆర్ న్యూ లుక్ మాత్రం ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నిపిందనే చెప్పాలి.