టాలీవుడ్ లో బ్యాగ్రౌండ్ ఉన్నా సొంత టాలెంట్ తో దేశ వ్యాప్తంగా ఫ్యాన్ బేస్ ను పెంచుకున్న హీరోల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఒకరు. సినిమా సినిమాకు తన స్టైల్ మారుస్తూ స్టైల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు అల్లు అర్జున్. కేవలం సినిమాల్లోనే కాదు సేవా గుణంలోనూ ఆయన ఎప్పుడూ ముందుంటారు. తన వద్ద పని చేసే వారికి కూడా ఎప్పుడూ ఏదొక హెల్ప్ చేస్తుంటారు. ఎవరికి అవసరం వచ్చినా కాదనకుండా సాయం చేస్తారు. ఇటీవల తన వద్ద పనిచేసే కారు డ్రైవర్ కు ఆర్థిక సాయం చేసి తన మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు. అల్లు అర్జున్ వద్ద బోరబండ వాసి మహిపాల్ గత పదేళ్లుగా డ్రైవర్ గా వర్క్ చేస్తున్నాడు. మహిపాల్ సొంత ఊరు వరంగల్.
ఇటీవల బోరబండలో మహిపాల్ సొంత ఇల్లు కట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అల్లు అర్జున్ మహిపాల్ కి 15 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశారు. మహిపాల్ కుటుంబ సమేతంగా అల్లు అర్జున్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆ సందర్భంలో తీసిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ తమ అభిమాన హీరో మంచి మనసుని పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇంతకు ముందు కూడా పలు సందర్భాలలో ఎంతో మందికి అల్లు అర్జున్ సాయం చేశారు. కేరళకు చెందిన ఓ నర్సింగ్ విద్యార్థిని అల్లు అర్జున్ దత్తత తీసుకున్నాడు. కోవిడ్ బారిన పడి ఆ విద్యార్థి తండ్రి మరణించడంతో చదువుకు ఆటంకం ఏర్పడింది. ఫీజులు కూడా చెల్లించలేని దుస్థితి లో ఆ కుటుంబం ఉంది. ఈ విషయం తన వద్దకు రావడంతో ఆ విద్యార్థి చదువుకు అయ్యే ఖర్చు మొత్తం అల్లు అర్జున్ పెట్టుకుంటాను అని హామీ ఇచ్చారు. అల్లు అర్జున్ ఔదార్యం గురించి ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు.
Also Read : 'యశోద' రివ్యూ : అసలు కథ వేరే బాస్ - సమంత షీరోయిజం ఎలా ఉందంటే?
ప్రస్తుతం అల్లు అర్జున్ వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారు. ఇప్పటికే పుష్ప 2 షూటింగ్ దిశగా అడుగులు వేస్తోంది. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా హిట్ అందుకున్నారు. ఈ సినిమాలో బన్నీ స్టైల్, యాటిట్యూడ్, డైలాగ్స్ కు దేశవ్యాప్తంగానే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఫాలోయింగ్ పెరిగింది. ఈ సినిమాలో పాటలు కూడా అందర్నీ ఉర్రూతలూగించాయి. ఈ సినిమాతో అల్లు అర్జున్ స్థాయి మరింత పెరిగింది. పుష్ప పాన్ ఇండియా లెవల్ లో హిట్ అవ్వడంతో పుష్ప 2 పై భారీ అంచనాలే ఉన్నాయి. దర్శకుడు సుకుమార్ బన్నీ కాంబో లో వచ్చిన సినిమాలు మంచి హిట్ అందుకున్నాయి. అందుకే ఈ సారి పుష్ప 2 పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మరి పుష్ప 2 లో బన్నీ, సుకుమార్ ఏం మ్యాజిక్ చేస్తారో చూడాలి.