Devara Release Trailer Out Now: మాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా ‘దేవర’. ఈ సినిమాకు సంబంధించి ఒక ట్రైలర్ ఇప్పటికే విడుదల అయింది. దీనికి మిశ్రమ స్పందన వచ్చింది. ఈ ట్రైలర్‌లో ‘దేవర’ వరల్డ్‌ను, పాత్రలను పరిచయం చేశారు. ఇప్పుడు పూర్తిగా సినిమాలో ఉన్న యాక్షన్‌పై ఫోకస్ చేస్తూ కొత్త రిలీజ్ ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ‘దేవర’లో యాక్షన్ ఏ స్థాయి ఊర మాస్‌గా ఉందో ఈ ట్రైలర్‌ను చూసి అర్థం చేసుకోవచ్చు. ఫ్యాన్స్‌తో పాటు యాక్షన్ మూవీ లవర్స్‌కు గూస్ బంప్స్ ఇచ్చేలా కొత్త ట్రైలర్‌ను ‘దేవర’ టీమ్ కట్ చేసింది. ఇప్పటికే ఒక రకంగా దూసుకుపోతున్న అడ్వాన్స్ బుకింగ్స్ ఈ ట్రైలర్‌తో నెక్స్ట్ లెవల్‌కు వెళ్లడం పక్కా అనుకోవచ్చు.



అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే రికార్డుల జాతర...
‘దేవర’ సినిమా రిలీజ్ కాకముందే రికార్డుల మోత మొదలు పెట్టింది. సెప్టెంబర్ నెల మొదట్లో ప్రారంభం అయిన ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్‌లో ‘దేవర’ దూసుకుపోతుంది. నార్త్ అమెరికా (యూఎస్ఏ, కెనడా) కలిపి నాలుగు రోజుల ముందే రెండు మిలియన్లకు పైగా వసూలు చేసింది ‘దేవర’. ఇందులో కేవలం ప్రీమియర్ల వరకు మాత్రమే 1.82 మిలియన్ డాలర్ల వరకు ఉండటం విశేషం.


‘బాహుబలి 2’, ‘సలార్’ వంటి పాన్ ఇండియా సినిమాల ప్రీమియర్ రికార్డులను ‘దేవర’ జస్ట్ అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే బద్దలు కొడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రిలీజ్ ట్రైలర్ చూపించే జోరుతో ‘ఆర్ఆర్ఆర్’, ‘కల్కి 2898 ఏడీ’ నంబర్ల దగ్గరకు వెళ్తుందేమో చూడాలి. టాలీవుడ్‌కు సంబంధించి హయ్యస్ట్ ప్రీమియర్స్ రికార్డు ప్రస్తుతానికి ‘కల్కి 2898 ఏడీ’ పేరు మీద ఉంది. నార్త్ అమెరికాలో ‘కల్కి 2898 ఏడీ’ 3.9 మిలియన్ డాలర్లను ప్రీమియర్ల ద్వారా కలెక్ట్ చేసింది. రెండో స్థానంలో ఉన్న ‘ఆర్ఆర్ఆర్’ 3.46 మిలియన్ డాలర్లు వసూలు చేసింది.


Also Read: 'దేవర' ఫస్ట్ రివ్యూ: సినిమా చూసిన రాజమౌళి ఫ్రెండ్ - లాస్ట్ అరగంట అదిరిందంతే


ఏపీలో ప్రత్యేక అనుమతులు
ఆంధ్రప్రదేశ్‌లో ‘దేవర’ టికెట్ ధరల పెంపునకు, స్పెషల్ షోలకు కావాల్సిన ప్రత్యేక అనుమతులు కూడా వచ్చేశాయ్. దీనికి సంబంధించిన అధికారిక జీవోను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ మొత్తంగా 27వ తేదీ అర్థరాత్రి 12 గంటల నుంచే షోలు వేసుకోవడానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. మొదటి రోజు ఆరు ఆటలు, రెండో రోజు నుంచి పదో రోజు వరకు ఐదు ఆటలు వేసుకోవడానికి కావాల్సిన పర్మిషన్లు లభించాయి. ఇక సినిమాకు మంచి టాక్ రావడం ఒక్కటే పెండింగ్.


టికెట్ రేట్లు ఎంత ఉండనున్నాయి?
ఏపీలో మల్టీప్లెక్స్‌లకు సంబంధించి ఇప్పటికి ఉన్న రేట్లకు పైన రూ.130 వరకు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. రెండు వారాల వరకు ఈ పెరిగిన ధరలు అందుబాటులో ఉంటాయి. అంటే ఏపీలో ‘దేవర’ మల్టీప్లెక్స్ టికెట్ రేట్ రూ.312 వరకు ఉంటుందన్న మాట. ఇక సింగిల్ స్క్రీన్లలో హయ్యర్ క్లాస్‌ల్లో రూ.110, లోయర్ క్లాసుల్లో రూ.60 వరకు టికెట్ రేట్లు పెంచుకోవచ్చు.


Also Read: ఇండియన్ ఐడల్ 3 విన్నర్‌కు ఎన్ని లక్షలో తెలుసా? ఫస్ట్ - సెకండ్ రన్నరప్‌లు ఎవరు, వాళ్ల ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?