Narne Nithin Shivani Engagement Highlights : ఓ పెళ్లితో రెండు కుటుంబాలు దగ్గరవుతాయి. అలాంటి పెళ్లి సినీ ఇండస్ట్రీలో జరిగితే.. ఆ మ్యూచవల్ ఫ్యాన్స్​కు పండగే అవుతుంది. ఇప్పుడు నార్నె నితిన్.. శివానీల ఎంగేజ్​మెంట్​ విషయంలో అదే జరుగుతుంది. వీరి పెళ్లిటాపిక్​ కంటే.. విక్టరీ వెంకటేష్​.. జూనియర్ ఎన్టీఆర్ బంధువులైపోయారనేది హాట్ టాపిక్​గా మారింది. దీంతో వెంకీ మామ, ఎన్టీఆర్​ల మ్యూచువల్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఇంతకీ నార్నె నితిన్ పెళ్లి చేసుకుంటున్న అమ్మాయి.. వెంకటేష్​కి ఏమి అవుతారంటే.. 


'మ్యాడ్' మూవీతో సూపర్ హిట్ అందుకుని.. అదే జోష్​లో 'ఆయ్​'తో వచ్చి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు నార్నె నితిన్. ఇతని సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే.. ఎన్టీఆర్ అభిమానులు చేసే సందడి అంతా ఇంతా కాదు. ఎందుకంటే మనోడు.. జూనియర్ ఎన్టీఆర్​కు స్వయానా బావమరిది. విడుదలైన రెండు సినిమాలతో మంచి రెస్పాన్స్ అందుకున్న నితిన్.. సినీ కెరీర్​పైనే కాకుండా.. పర్సనల్ లైఫ్​పైన కూడా ఫోకస్ పెట్టాడు. సైలెంట్​గా ఆదివారం ఎంగేజ్​మెంట్​ చేసుకున్నాడు. 


హాట్ టాపిక్ ఇదే.. శివానీ ఎవరు?


ఇంతకీ నార్నె నితిన్ పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి ఎవరు? ఆమెకు వెంకీమామకు ఉన్న సంబంధం ఏంటి అనే ప్రశ్నే ఎక్కువగా వినిపిస్తుంది. నార్నె నితిన్ ఎంగేజ్​మెంట్ చేసుకున్న శివానీ.. హీరో దగ్గుబాటి వెంకటేష్ ఫ్యామిలీకి బంధువులు అయిన తాళ్లూరి వెంకట కృష్ణప్రసాద్.. స్వరూపల కూతురు. వెంకీమామకు శివానీ.. కజిన్ కూతురు అవుతుంది. ఎన్టీఆర్ బావమరిదితో శివానీకి నిశ్చితార్థం జరగడంతో.. వీరి కుటుంబాలు బంధువులైపోయారు. 


నార్నె నితిన్, శివానీల నిశ్చితార్థం ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. బావమరిది ఎంగేజ్​మెంట్​కు జూనియర్ ఎన్టీఆర్ కుటుంబంతో సహా ట్రెడీషనల్ డ్రెస్​లో వచ్చి సందడి చేశారు. అమ్మాయి తరపు నుంచి.. వెంకీ మామ ఫ్యామిలీ వచ్చి రెట్టింపు జోష్​నిచ్చారు. హీరో కళ్యాణ్ రామ్ కూడా ఫ్యామిలీతో వచ్చారు. హారిక హాసిని ఎంటర్​టైన్​మెంట్స్ అధినేత చినబాబు, సితార ఎంటర్​టైన్​మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. 


ఎంగేజ్​మెంట్ హైలెట్స్​..


నార్నె నితిన్ ఎంగేజ్​మెంట్​తో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ.. దగ్గుబాటి వెంకటేష్ ఫ్యామిలీ బంధువులయ్యారు. వీరి ఎంగేజ్​మెంట్స్​ ఫోటోల్లో ఎన్టీఆర్ న్యూ లుక్​ రివిల్ అయ్యింది. ఇదే వార్​ 2 లుక్​ అంటూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు వేస్తున్నారు. అలాగే వెంకీమామ.. జూనియర్ ఎన్టీఆర్ పిల్లలతో నవ్వుతూ మాట్లాడుతున్న వీడియోలను అభిమానులు తెగ షేర్లు చేస్తున్నారు. ఈ మూడు టాపిక్స్ నార్నె నితిన్, శివానీ ఎంగేజ్​మెంట్​ వేడుకలో హైలెట్స్​గా నిలిచాయి. 


నార్నె నితిన్ నెక్స్ట్ సినిమాలు.. 


మ్యాడ్, ఆయ్ సినిమాలతో బ్లాక్​బాస్టర్స్ అందుకున్న నార్నె నితిన్ తర్వాత ఎలాంటి సినిమాలు చేస్తాడన్నా ఆసక్తి అందరిలోనూ ఉంది. కథా ప్రాధన్యమున్న సినిమాలు చేస్తున్నాడంటూ.. ప్రేక్షకులు కూడా అతని సినిమాలు గురించి ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం నార్నె శ్రీశ్రీశ్రీ రాజావారు, మ్యాడ్ స్క్వేర్ సినిమాలు చేస్తున్నాడు. మ్యాడ్ సూపర్ హిట్ కావడంతో.. మ్యాడ్ స్క్వేర్​పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. శ్రీశ్రీశ్రీ రాజావారు దసరాకు విడుదల కావాల్సి ఉంది కానీ.. పలు కారణాల వల్ల వాయిదా పడింది. 



Also Read : ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ నిశ్చితార్థం - సైలెంట్‌గా చేసుకున్న ‘ఆయ్’ హీరో!