తన్నిష్ఠ ఛటర్జీ (Tannishtha Chatterjee), జేడీ చక్రవర్తి (JD Chakravarthy) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'దహిణి - మంత్రగత్తె'. పలు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్న దర్శకుడు రాజేష్ టచ్‌రివర్ తెరకెక్కించారు. ప్రజలను చైతన్యవంతులను చేయాలనే తపన ఆయన ప్రతి సినిమాలో కనబడుతుంది. సమాజంలో సమస్యలే ఆయన (Rajesh Touchriver) ఎంపిక చేసుకునే కథలు. అందుకే, ఆయన సినిమాలకు అవార్డులు వస్తుంటాయి.
టైటాన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో 'దహిణి'కి అవార్డు!
ఆస్ట్రేలియాలో నిర్వహించే టైటాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ పెస్టివల్‌లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌గా 'దహిణి - ది విచ్' (Dahini - The Witch Movie) నిలిచింది. ఈ పురస్కారాన్ని సోమవారం సిడ్నీలోని ప్యాలెస్ చౌవెల్‌లో అందజేయనున్నారు. ఈ చిత్రానికి ఇది మూడో అంతర్జాతీయ అవార్డు. ఆల్రెడీ స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌కు 'దహిణి' ఎంపిక అయ్యింది. పసిఫిక్ బీచ్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్‌లో 'బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్' అవార్డు లభించింది.
'దహిణి' కథేంటి?
Dahini The Witch Movie Story : చేతబడి చేస్తున్నారనే అనుమానంతో అమాయక మహిళలను ఏ విధంగా చిత్ర హింసలకు గురి చేస్తున్నారు? చంపేస్తున్నారు? అనే అంశంతో సినిమా తీశారు. 'విచ్ హంటింగ్' పేరుతో మన దేశంలోని పలు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో జరుగుతున్న దారుణాలను వెలుగులోకి తీసుకురావాలనే ప్రయత్నంతో... వివాదాస్పద అంశాలను స్పృశిస్తూ రాజేష్ టచ్‌రివర్ 'దహిణి' తెరకెక్కించారు. ఒరిస్సాలోని మయూర్ బంజ్ జిల్లా, పరిసర ప్రాంతాల్లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా, వాస్తవికతకు దగ్గరగా చిత్రాన్ని రూపొందించారు.
సోషల్ థ్రిల్లర్!
'దహిణి' చిత్రాన్ని సోషల్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారని, ఇందులో ఇప్పటి వరకు ఎప్పుడూ కనిపించినటువంటి వైవిధ్యమైన పాత్రలో జీడీ చక్రవర్తి కనిపిస్తారని చిత్ర బృందం పేర్కొంది.
"విచ్ హంటింగ్ పేరుతో అమాయక మహిళలను చంపడం అనాగరిక చర్య. దీనిని ఇప్పటికీ కొంత మంది పాటిస్తున్నారు. ఈ విధంగా చేయడం మానవ హక్కుల ఉల్లంఘన. అయినప్పటికీ... ఎవరూ ఈ దారుణాల గురించి మాట్లాడటం లేదు. ఇది దురదృష్టం. అందుకని, వాస్తవాలను అందరికీ తెలియజేసే ఉద్దేశంతో మేం ఈ సినిమా తీశాం'' అని సునీత కృష్ణన్ అన్నారు.
Also Read : మెగాస్టార్ చిరంజీవికి అరుదైన అవార్డు - ప్రకటించిన ఐఎఫ్ఎఫ్ఐ!
ఆషిక్ హుస్సేన్, బద్రుల్ ఇస్లాం, అంగన రాయ్, రిజు బజాజ్, జగన్నాథ్ సేథ్, శృతి జయన్ దిలీప్ దాస్, దత్తాత్రేయత దితరులు నటించిన ఈ చిత్రాన్ని ఓరియన్ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, సన్‌టచ్ ప్రొడక్షన్స్ సంస్థలపై పద్మశ్రీ పురస్కార గ్రహీత సునీత కృష్ణన్, ప్రదీప్ నారాయణన్ నిర్మించారు. ఈ చిత్రానికి కూర్పు : శశి కుమార్, మాటలు : రవి పున్నం, ఛాయాగ్రహణం : నౌషాద్ షెరీఫ్, ప్రొడక్షన్ డిజైనర్ : సునీల్ బాబు, సౌండ్ డిజైనర్ : అజిత్ అబ్రహం జార్జ్, నేపథ్య సంగీతం : జార్జ్ జోసెఫ్, సంగీతం : డా. గోపాల్ శంకర్, కథ - కథనం - దర్శకత్వం : రాజేష్ టచ్ రివర్.