యష్ కి వేద అన్నం క్యారేజీ తీసుకుని వస్తుంది. కారులో వస్తూ యష్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. మీరు చేసేది ఏది కరెక్ట్ గా లేదు కానీ ఏంటో మీ వైపు చూడకుండా మీతో మాట్లాడకుండా ఉండలేను అని తనలో తను అనుకుంటుంది. అటు ఆఫీసులో మాళవిక, యష్ గొడవపడుతూ ఉంటారు.


యష్: ఈ యాక్సిడెంట్ వెనుక ఉన్న అసలు రహస్యం నాకు తెలియదు అనుకుంటున్నావా, ఈ యాక్సిడెంట్ చేసింది నువ్వు కాదు ఆదిత్య. ఏమనుకుంటున్నావ్ నువ్వు నాకేమీ తెలియదు అనుకుంటున్నావా, ముందు ఈ యాక్సిడెంట్ ఖైలాష్ చేశాడు అనుకున్నా మీ ఇంటికి వస్తే అభిమన్యు యాక్సిడెంట్ చేసిన కారు ఎప్పుడో అమ్మేశాను అంటే నమ్మేశాను. తర్వాత నువ్వు డ్రామా మొదలుపెట్టావ్ యాక్సిడెంట్ నువ్వే చేశాను అంటే నమ్మేశాను కానీ అంతలోనే ఆది వచ్చాడు నీలాగా మోసాలు చేయడం వాడికి తెలియదు కదా అందుకే నిజం చెప్పేశాడు (యాక్సిడెంట్ చేసింది ఖైలాష్ అంకుల్, మమ్మీ కాదు నేనే అని ఆది గతంలో చెప్పింది గుర్తు చేసుకుంటాడు) పన్నెండేళ్ళ నా మైనర్ కొడుకు ఆరోజు డ్రైవ్ చేశాడు, యాక్సిడెంట్ చేశాడు, అసలు అలా చెయ్యడానికి కారణం ఎవరు నువ్వు, ఆ అభిమన్యు.. చిన్నపిల్లాడికి కారు ఎందుకు అని మొత్తుకున్నా విన్నారా కారు గిఫ్ట్ ఇచ్చారు. కనీసం ఆది యాక్సిడెంట్ చేశాడనే విషయం నాదగ్గరే కాదు అభిమన్యు, ఖైలాష్, ఈ ప్రపంచం దగ్గరే దాచావ్


మాళవిక: యష్ నేను ఏది చేసినా నా కొడుకు ఆది కోసమే చేశాను


Also Read: మీడియా ముందు అడ్డంగా బుక్కైన రిషి, వసు- మహేంద్ర ఎంట్రీ అదుర్స్, దేవయాని ప్లాన్ తుస్స్


యష్: అది సగమే నిజం.. మిగతాది నేను చెప్పనా, వేదని టార్చర్ చేసి నాకు దూరం చేయాలని అనుకున్నావ్, అభిమన్యుని లొంగదీసుకోవాలని అనుకున్నావ్ కాదంటావా, దురాశ నీది ఇదే నీ ఒరిజినల్ క్యారెక్టర్, నీ ట్రాప్ లో పడేశాను అనుకున్నావ్ కానీ నా కొడుకు కోసం ఇదంతా చేశాను, వాడి మీద ఒట్టేసాను కాబట్టి వేద దగ్గర నిజం దాచాను. ఇంట్లో వాళ్ళందరూ నీకోసం నేను వేదని దూరం పెడుతున్నా అనుకుంటున్నారు కానీ ఎలా చెప్పేది నేను కాపాడేది నిన్ను కాదు నా కొడుకు ఆదిత్యని. వాడు కారు నడపటం చట్టరీత్యా నేరం, కానీ కారు ఇచ్చిన మీది తప్పు.. మీరు చేసినదానికి నేను శిక్ష అనుభవిస్తున్నా, వేద విషయంలో తప్పు చేస్తున్నా, ఒకరకంగా వేదని పోగొట్టుకున్నా


మాళవిక: నీకు వేద పిచ్చి బాగా పట్టింది. మరి ఆది, నా సంగతి ఏంటి. మమ్మల్ని నువ్వు కాపాడతావాని నమ్ముతున్నాడు. మీనాన్న నీకు ఇచ్చిన మాట తప్పాడు, నీకిక మీ నాన్న లేడని చెప్పేస్తాను


యష్: చంపేస్తాను నిన్ను.. నా ఆదికి నాకు మధ్య చిచ్చు పెట్టాలని చూస్తే చంపేస్తాను, నేను పాత యశోధర్ ని కాదు, వాడిని కంటికి రెప్పలా కాపాడుకుంటాను


మాళవిక: ఎలా కాపాడుకుంటావ్ కేసు పెట్టింది నీ భార్య.. ఎవరికి సపోర్ట్ చేస్తావ్ నువ్వు నాకా, ఆ వేదకా


యష్: నేను ఎవరికి సపోర్ట్ చెయ్యను నా ఆది కోసం నేను ఏమైనా చేస్తాను.. వేద చాలా మంచిది సమస్య చెబితే అర్థం చేసుకుంటుంది


మాళవిక: చెప్పడానికి వీల్లేదు, చెప్పను అని ఆది మీద ఒట్టేశావ్ విషయం వేదకి చెప్పడానికి వీల్లేదు.. ఈ ఒక్కసారి నా మాట విను అని చెయ్యి పట్టుకుని అడుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో యాక్సిడెంట్ చేసింది నేను కాదు ఆదిత్య అని తెలియనివ్వకు. నిజం తెలిసిన తర్వాత వేద ఒప్పుకోకపోతే, ఆదిత్యని జైలుకి పంపిస్తే


Also Read: కార్తీక్ ని ఫాలో అవుతున్న మోనిత- తల్లిదండ్రుల కోసం శౌర్య పోస్టర్స్ ప్లాన్


అప్పుడే వేద ఆఫీసుకి వస్తుంది.


యష్: ఆ మాట కూడా అనొద్దు, అది నేను భరించలేను. నేను ఈ విషయం వేదకి చెప్పను


మాళవిక: మన ఆదికి ఏమి కాకూడదు, నువ్వేమి కానివ్వకూడదు, థాంక్యూ సోమచ్ అనేసి వెళ్ళిపోతుంది.


మాళవిక వెళ్లిపోగానే వేద యష్ ఛాంబర్ లోకి ఎంట్రీ ఇస్తుంది.


తరువాయి భాగంలో..


వేద లిఫ్ట్ లోనే మాళవిక కూడా ఉంటుంది. ఇద్దరూ మాట మాట అనుకుంటారు. చేసిన తప్పుకి ఎలాగైనా నీకు శిక్ష పడేలా చేస్తాను అని వేద అంటుంది. నువ్వు ఒడిపోతావ్.. నన్ను కాపాడటానికి ఒక కవచం ఉంది అదే యశోధర్ అని మాళవిక పొగరుగా చెప్తుంది. అప్పుడే లిఫ్ట్ ఆగిపోతుంది. యష్ కంగారుగా వచ్చి చూసేసరికి ఇద్దరూ లోపల ఉంటారు. యష్ తన చెయ్యే ముందు పట్టుకుని బయటకి తీసుకెళ్తాడని మాళవిక అంటుంది.