కడుపుతో ఉన్న కోడళ్ళ కోసం జ్ఞానంబ సున్ని ఉండలు చేసి పెడుతుంది. జానకి వస్తే నీ తోడి కోడళ్లకి వీటిని ఇచ్చి రోజు క్రమం తప్పకుండా తినమని చెప్పు. మనసులో ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండమని చెప్తుంది. జెస్సి ఫోన్లో పిల్లల ఫోటోస్ చూస్తూ మురిసిపోతుంటే జానకి సున్ని ఉండలు తీసుకొచ్చి ఇస్తుంది. అత్తయ్యగారు మీరు ప్రెగ్నెంట్ అని ప్రత్యేకంగా చేశారు వీటిని తీసుకొని తిను అని చెప్తుంది. దైవం మనిషి రూపంలోనే ఉంటుందని ఎక్కడో చదివాను ఇప్పుడు అత్తయ్యగారిని చూస్తుంటే అది నిజమే అనిపిస్తుందని జెస్సి అంటుంటే అటుగా జ్ఞానంబ వచ్చి ఆ మాటలు వింటుంది. రీజన్ ఏదైనా సరే నేను డైరెక్ట్ గానో ఇన్ డైరెక్ట్ గానో అత్తయ్యగారిని ఇబ్బంది పెట్టాను, బాధ కూడా పెట్టాను, ఇక్కడి పద్ధతులు తెలియక మనసు కష్టపెట్టాను. అయినా కూడా నా విషయంలో అత్తయ్యగారు ఇలా ఉంటున్నారంటే చాలా గ్రేట్ నేను లక్కీ అని అంటుంది.


Also Read: అభి, ప్రేమ్ కొట్లాట- తులసిని ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మన్న పరంధామయ్య


ఏదైనా ప్రాబ్లం వస్తే కొడుకుని అయిన నిందిస్తారు కానీ కోడళ్లని ఏమి అనరు, నా వల్ల అత్తయ్యగారు చాలా బాధపడ్డారు కానీ తను ఓర్చుకున్నారు. మనల్ని కన్న బిడ్డలాగా కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నారు. అలాంటి అత్తయ్యగారిని మనం బాధపెట్టకూడదు అని జానకి జెస్సికి చెప్తుంది. అందరూ కలిసి ఉండాలని తోటికోడళ్లని కలుపుకుని పోవాలని జానకి చాలా ఆరాటపడుతుంది. వాళ్ళ వల్ల నేను బాధపడకూడదని తపన పడుతుందని జ్ఞానంబ మనసులో అనుకుంటుంది. జానకి మళ్ళీ ప్రెగ్నెంట్ అవునా కాదా అని కన్ఫామ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. బీ కాంప్లెక్స్ టాబ్లెట్స్ తీసుకొచ్చి వేసుకోమని ఇస్తుంది. ఇవి ఏంటో మల్లికకి తెలియదు కాబట్టి వేసుకుంటే ప్రెగ్నెంట్ అయినట్టే వేసుకోకపోతే ప్రెగ్నెంట్ కాదని అర్థం అని జానకి అనుకుంటుంది. ట్యాబ్లెట్ వేసుకోమని ఇస్తే నేను తర్వాత వేసుకుంటా అని తనని పంపించి వాటిని పక్కన పడేస్తుంది. అదంతా జానకి గమనిస్తుంది.


మల్లిక ప్రెగ్నెంట్ కాదని అర్థం అయ్యింది డ్రామాలు ఆడుతుంది ఈ నిజాన్ని ప్రూవ్ చేయాలని ఎమోషన్స్ తో ఆడుకుంటున్నందుకు బుద్ధి చెప్పాలని జానకి ప్లాన్ వేస్తుంది. నీలావతి ద్వారా అసలు విషయం రాబట్టాలని అనుకుంటుంది. వెంటనే తనకి ఫోన్ చేసి అర్జెంట్ గా ఇంటికి రమ్మని కోపంగా చెప్తుంది. మల్లికకి ఫోన్ చేసి విషయం అడుగుదామనుకుంటుంది నీలావతి కానీ తను ఫోన్ లిఫ్ట్ చేయదు. మల్లిక కడుపు డ్రామా బయటపడితే తన మీదకే తోసేస్తాను నాకెందుకు ఈ గొడవ అని కంగారుగా జ్ఞానంబ ఇంటికి వస్తుంది నీలావతి. జానకిని పిలుస్తుంటే మల్లిక బయటకి వస్తుంది. వాళ్ళని దూరం నుంచి జానకి గమనిస్తూ ఉంటుంది.


Also read: గుండె పగిలేలా ఏడుస్తున్న వేద- మాళవిక మీద ఆగ్రహంతో ఊగిపోతున్న అభిమన్యు, ఆజ్యం పోస్తున్న ఖైలాష్


మల్లికని పక్కకి తీసుకెళ్లిన నీలావతి నీకు కడుపు వచ్చిందని దొంగ నాటకం ఆడుతున్నావాని జానకికి తెలిసిపోయిందా అని అడుగుతుంది. ఎందుకు అలా అడుగుతున్నావ్ అని మల్లిక అంటుంది. తెల్లారగానే జానకి ఫోన్ చేసి నీతో మాట్లాడాలి అని ఇంటికి రమ్మని కోపంగా చెప్పిందని నీలావతి చెప్తుంది. జానకి నిజం తెలిసి నన్ను రమ్మంటే ఈ నేరానికి నన్ను పోలీసులకి పట్టిస్తుందని భయపడుతుంది. అంతా నువ్వే చేయమన్నావ్ అని చెప్పేస్తాను అని అంటుంది. దానికి మల్లిక బిత్తరపోతుంది. ఇప్పటి వరకు జానకికె కాదు ఇంట్లో ఎవరికి నాది దొంగ కడుపు అని తెలియదు నువ్వు అనవసరంగా నోరు పారేసుకోకు అని నీలావతికి మల్లిక చెప్తుంది. అప్పుడే జ్ఞానంబ వస్తుంటే ఇద్దరు మాట్లాడుకోవడం ఆపేసి టాపిక్ డైవర్ట్ చేస్తారు.