యష్ ఉన్న హోటల్ కి వెళ్ళి తనని సర్ ప్రైజ్ చేయాలని వేద అనుకుంటుంది. అక్కడే కూర్చుని మాట్లాడుకుంటే మా మధ్య ఉన్న మసస్పర్థలు కూడా తొలగిపోతాయని హోటల్ కి బయల్దేరుతుంది. యష్ వేద కి ఫోన్ ట్రై చేస్తూ ఉంటాడు కానీ కలవదు. అప్పుడే హోటల్ లో ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది. హోటల్ మొత్తం పొగ కమ్మేస్తుంది. వేద హోటల్ దగ్గరకి వస్తుంది. ఏమైందని పోలీసులని అడిగితే అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పేసరికి వేద కంగారుగా లోపలికి వెళ్ళాలి అని అక్కడి పోలీసుని బతిమలాడుతుంది. లోపల పొగ పీల్చి మాళవిక ఊపిరి పీల్చడానికి ఇబ్బంది పడుతూ స్పృహ తప్పి పడిపోతుంది. యష్ మాళవికని ఎత్తుకుని బయటకి పరుగులు తీస్తాడు.


బయట ఉన్న వేద మాళవికని ఎత్తుకుని వస్తున్న యష్ ని చూసి షాక్ అవుతుంది. యష్ కూడా వేదని చూస్తాడు. వేద కళ్ళ ముందే మాళవికని తన కారులో కంగారుగా హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళిపోతాడు. అది చూసి వేద గుండె ముక్కలవుతుంది. అభిమన్యు మాళవికకి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఫోన్ పక్కన పడేసి మాజీ మొగుడితో కులుకుతూ ఉండి ఉంటుంది, నీ బిహేవియర్ నాకు నచ్చలేదని అభిమన్యు కోపంగా ఉంటాడు. ఆ యశోధర్ తో నువ్వు మళ్ళీ అంత క్లోజ్ గా మూవ్ అవడం నాకు నచ్చలేదని అనుకుంటాడు. ఖైలాష్ వచ్చి ఏమైంది ఎందుకు అలా ఉన్నావ్ అని అంటాడు. నీ విషయంలో సిస్టర్ చేసింది కరెక్ట్ కాదని ఎక్కిస్తాడు.


Also read: గృహలక్ష్మికి అగ్నిపరీక్ష- తులసిని నీచంగా అవమానించిన నందు, అనసూయ


అభి: ఇది మా పర్సనల్ విషయం నువ్వు జోక్యం చేసుకోకు


ఖైలాష్: మీ ఫుడ్ తింటూ మీ విషయంలో జోక్యం చేసుకోవద్దంటే ఎలా ఉంటాను.. ఎంత చేశారు ఆవిడకి, స్టార్ హోటల్లో పార్టీలకి వెళ్తుందంటే కారణం ఎవరు ది గ్రేట్ అభిమన్యు. అలాంటి నిన్ను వదిలేసి పనికిమాలిన నా బామ్మర్దితో తిరుగుతుందా. సిస్టర్ ఇంతకముందులా లేదు చాలా మారిపోయింది. ఆ యశోధర్ చేసిన అవమానానికి నాకే నెత్తురు మారిగిపోతుంటే మీరేంటి సైలెంట్ గా ఉన్నారు


అభి: ఈ సైలెంట్ వెనుక ఎంత వైలెంట్ ఉందో మాళవికకి తెలిసొచ్చేలా చేస్తా.. నా అందమైన గాజు బొమ్మ తను.. వదిలేస్తే చాలు వందముక్కలు అవుతుంది.. బంగారం నీ అభి డార్లింగ్ ని రాంగ్ సైడ్ టచ్ చేశావ్, గుర్తుండిపోయే గిఫ్ట్ ఇస్తాను రెడీగా ఉండు


Also Read: ఆదిత్యపై దేవుడమ్మ అనుమానం - మాధవ్ ఇంట్లో భాగ్యమ్మని చూసిన షాకైన సత్య


నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, ఒకదాని తర్వాత ఒకటి ఎందుకు ఇలా గాయాలు అవుతున్నాయి. ఎన్ని సార్లు పరిస్థితులకి రాజీ పడతాను, ఎన్ని సార్లు నన్ను నేను సముదాయించుకునేది అని వేద కుమిలి కుమిలి ఏడుస్తుంది. మాళవిక దగ్గరకి ఆదిత్య కంగారుగా వచ్చి నాన్న అమ్మకి ఏమైందని అడుగుతాడు. ఏం కాలేదు మీ మమ్మీ బాగానే ఉందని యష్ చెప్తాడు. మీ నాన్న నేను లాయర్ ని కలవడానికి హోటల్ కి వెళ్ళాం కదా అక్కడ చిన్న ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది మీ నాన్నే కాపాడారు అని చెప్తుంది. థాంక్యూ నాన్న అని ఆది అంటాడు. ఇంటి దగ్గర నుంచి కాల్ వస్తుంది వెళ్తాను అని యష్ అంటే నాన్న మీరు ఉండండి నాన్న మీరు ఉంటే నాకు ధైర్యంగా ఉంటుందని అడుగుతాడు. మాళవిక కూడా వెళ్లనివ్వు ఇంటి దగ్గర ఎదురుచూస్తూ ఉంటారు అంటుంది. వేద ఏడుస్తుంటే వెనుక నుంచి ఖుషి వస్తుంది. ఏంటమ్మా ఏడుస్తున్నావ్ అని ఖుషి అడుగుతుంది. అదేమీ లేదమ్మా అని నవ్వుతూ ఖుషిని దగ్గరకి తీసుకుంటుంది.