మల్లిక తులసి కోట పడగొట్టేస్తుంది. ఈ తప్పు తన మీదే వేసుకుంటుంది జానకి. తులసి కోటలో మట్టి సరి చేస్తుంటే ఉంగరం కనిపిస్తుంది. ఇది మన పెళ్లి నాటి ఉంగరం అని గోవిందరాజులు అనడంతో జ్ఞానంబ సంతోషిస్తుంది. మంచి మనసు ఉన్న వాళ్ళు పొరపాటు చేసిన మంచే జరుగుతుంది, జానకి వల్ల నీ ప్రధాన ఉంగరం దొరికిందని గోవిందరాజులు అనేసరికి మల్లిక ఏడుపు మొహం పెట్టేస్తుంది. చదువు చెడగొట్టడానికి ట్రై చేస్తే జానకికి మంచే జరిగిందని ఏడుస్తుంది. తులసి మొక్కని యథాస్థానంలో పెట్టమని చెప్తుంది. రామా మాత్రం జానకి చేసిన పనికి కోప్పడతాడు. ఆ మల్లిక చేసిన పని మీ నెత్తి మీద వేసుకోవడం నచ్చలేదని అంటాడు.
ఏ విధంగా జానకికి చెడు చేయాలని చూసిన తనకి మంచే జరుగుతుందని మల్లిక అనుకుంటుంది. అప్పుడే వచ్చిన జానకి ఏం సాధిద్దామని ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నావ్ అని అడుగుతుంది. నువ్వు తులసి కోట పడగొట్టడం నేను రామా గారు చూశాం. ఈ విషయం అత్తయ్యగారికి చెప్పడం క్షణం పట్టదు కానీ నువ్వు కడుపుతో ఉన్నావ్ అని నేనే రామాగారిని ఆపాను. ఇంట్లో గొడవలు పెట్టాలని ఇలా చేస్తే ఊరుకోను అని వార్నింగ్ ఇస్తుంది. అది విష్ణు విని ఎందుకు వదిన నీ మీద సీరియస్ అయ్యిందని అడుగుతాడు. పెద్ద కోడలు కదా తోడి కోడలిని చులకనగా చూస్తుందని చెప్తుంది. జ్ఞానంబ ఆ ఉంగరం పెట్టుకుని దాన్ని చూసుకుంటూ మురిసిపోతుంది.
Also Read: జాబ్ మానేసిన నందు, సామ్రాట్ ముందు అడ్డంగా బుక్కైన లాస్య- చేతులెత్తేసిన అనసూయ
జానకి కోసం కాలేజీ ప్రిన్సిపల్ ఇంటికి వస్తుంది. త్వరలో రాబోయే మెయిన్స్ గురించి నీతో మాట్లాడాలని వచ్చాను, నువ్వు రాయబోయే ఎగ్జామ్ నీ కెరీర్ మాత్రమే కాదు మా ఇన్స్టిట్యూట్ పేరు కూడా నిలబడుతుంది. అందుకే నీకోసం ఇంపార్టెంట్ స్టడీ మెటీరియల్ తెప్పించాను అని చెప్పి వాటిని జానకికి ఇస్తుంది. నువ్వు టైమ్ వెస్ట్ చెయ్యొద్దు అని చెప్తుంది. జానకి చదువుకుంటూ ఉంటుంది. జెస్సికి సడెన్ గా కడుపు నొప్పి వస్తుంది. జానకి రామాకి ఫోన్ చేసి హాస్పిటల్ కి రమ్మని చెప్తుంది. జానకి చదువుకోవడానికి ఏది కుదరడం లేదని అనుకుంటాడు. జానకి జెస్సిని తీసుకుని బయటకి వెళ్తున్నట్టు చికితకి చెప్పి వెళ్లిపోతారు.
జెస్సిని డాక్టర్ పరీక్షిస్తుంది. జెస్సి కడుపులో బిడ్డ సరిగా పెరగడం లేదు, అలాంటప్పుడు పుట్టబోయే బిడ్డ ఏదో ఒక లోపంతో పుడతాడు. బిడ్డ కడుపులో ఉండగా ఏమి చేయలేము, బేబీ హెల్తీ గా పుట్టడం జరగదు. బిడ్డ పుట్టిన తర్వాత ప్రాబ్లంని బట్టి పెరిగే కొద్ది ట్రీట్మెంట్ చెయ్యొచ్చు. అందుకే ఇప్పటి నుంచే డబ్బులు ఏర్పాటు చేసుకోవడం మంచిదని డాక్టర్ చెప్తుంది. ఈ విషయం ఎవరికి చెప్పొద్దని జానకి డాక్టర్ ని అడుగుతుంది. ఉన్న సమస్యలు చాలవు అన్నట్టు కొత్త సమస్య వచ్చిందని రామా జానకి బాధపడతారు. ఈ విషయం అమ్మకి తెలిస్తే అసలు తట్టుకోలేరని అంటాడు. అత్తయ్యగారు మాత్రమే కాదు ఇంట్లో వాళ్ళు కూడా బాధపడతారు. జెస్సి విషయంలో అఖిల చేసిన కొన్ని పనుల వల్ల ఆనందం కంటే బాధే ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడిప్పుడే జెస్సి విషయంలో అత్తయ్యగారు మారుతున్నారు. ఈ విషయంలో జెస్సి కొంచెం సంతోషంగా ఉంది. ఈ టైమ్ లో ఇది తెలిస్తే ఇంకా బాధపడుతుందని జానకి అంటుంది.
Also Read: మేడమ్ తన ప్రాధాన్యత అనేసిన వసు, ఇంప్రెస్ అయిపోయిన ఇగో మాస్టర్- జగతి తరపున క్షమాపణ అడిగిన రిషి
మనం ఈ విషయం ఎన్నాళ్ళు దాచగలము అని రామా అంటాడు. అత్తయ్యగారికి ఏదో ఒక కారణం చెప్పి ఇప్పటి నుంచే మీరు డబ్బు ఆదాయ చేస్తే బాగుంటుందని జానకి చెప్తుంది. ఇంట్లో వాళ్ళకి, జెస్సికి తెలియకుండా ఈ ప్రాబ్లం మనం పరిష్కరించాలని అనుకుంటారు.