రామా జానకి గురించి అఖిల్ చెప్పిన మాటలు ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే జ్ఞానంబ పూజ చేసేందుకు వెళ్తు కళ్ళు తిరిగి తూలిపడబోతుంది. అది చూసి రామా, గోవిందరాజులు కంగారుపడతారు. నా బిడ్డ నా కళ్ళ ముందే జైలు పాలవుతుంటే నేనేమీ చేయలేకపోతున్నా అని బాధపడతాడు. ఆ తప్పు నీది కాదు నా భార్య మొండితనానిది, ఇప్పుడే ఈ సమస్యకి పరిష్కారం చేస్తానని రామా కోపంగా జానకి దగ్గరకి వెళ్తాడు. జానకి దీని గురించే ఆలోచిస్తూ ఉంటుంది.
రామా: జానకి గారు ఎంతో చదువుకున్న మీకు కుటుంబ విలువలు కాపాడాలనే ఉద్దేశం ఉన్న మీకు నేను చెప్పాలసిన పరిస్థితి వస్తుందని అనుకోలేదు. అఖిల్ విషయంలో మీ కళ్ళు చూసిన దాంట్లో 80 శాతం మాత్రమే వాస్తవం ఉంది. అదే పట్టుకుని మీరు కోడలి ధర్మానికి అన్యాయం చేస్తున్నారు. మీరు చేసిన ఈ ఒక్క పని వల్ల కుటుంబం ఆధారిపడి ఉంటుంది. ఎఫ్ ఐ ఆర్ రాస్తే ప్రయోజనం ఉండదు. కేసు వెనక్కి తీసుకుని అఖిల్ ని విడిపిద్దాం
జానకి: మీ తమ్ముడి మీద మమకారంతో మాట్లాడుతున్నారు నేనేమో ఒక ఆడపిల్లకి న్యాయం జరగాలని చూస్తున్నా అర్థం చేసుకోండి ప్లీజ్
రామా: ఒక ఆడపిల్లకి అన్యాయం చెయ్యమని నేను చెప్పను. కేవలం మీరు చూసిన దానికి విలువ ఇవ్వకండి కాస్త ఆగమని చెప్తున్నా.. ఇప్పుడు అఖిల్ జైలుకి వెళ్తే విచారణలో వాడు ఏ తప్పు చేయకపోతే వాడి జీవితం మీద మచ్చపడుతుంది
Also Read: ఆదిత్య, సత్య చెంపలు పగిలాయ్- దేవి తన మనవరాలని తెలుసుకున్న దేవుడమ్మ
జానకి: నేను అన్నీ ఆలోచించాకే కేసు పెట్టాను
రామా: అన్ని ఆలోచించిన మీరు సంపాదన విషయంలో ఎందుకు అఖిల్ ని ఒత్తిడికి గురి చేశారు, వాడు ఈ సంగతి నాతో చెప్పుకుని ఎంత బాధపడ్డాడో తెలుసా? ఈ ఇల్లు చక్కదిద్దాలని మీరు చేసే పని ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడుతున్నారో తెలుసా? మీరు ఎంత సేపు కాబోయే ఐపీఎస్ ధోరణిలో ఆలోచిస్తున్నారే తప్ప ఇంటి కోడలిగా ఆలోచించడం లేదు. జరిగింది ఏదో జరిగిపోయింది కేసు రాసేలోపు మీరు అఖిల్ మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకుందుగాని రండి
జానకి: ఇప్పుడు అఖిల్ ని వెనక్కి తీసుకొస్తే పాశ్చాత్తాపడకుండా తప్పులు మీద తప్పులు చేస్తాడని మనసులో అనుకుంటుంది
రామా బలవంతంగా చెయ్యి పట్టుకుని తీసుకుని వెళ్తుంటే జానకి వెళ్ళకుండా ఆగిపోతుంది. తను కంప్లైంట్ వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని తెగేసి చెప్తుంది. మీ ఈ నిర్ణయం ఇంట్లో చాలా మంది బాధలకి కారణం అవుతుంది, దయచేసి నా మాట విని స్టేషన్ కి వెళ్దాం అని అంటాడు. కానీ జానకి మాత్రం ఒప్పుకోదు. తన నిర్ణయాని మార్చుకోలేనని చెప్పేస్తుంది. పెద్ద కోడలిగా బాధ్యతలు ఇచ్చి నెత్తిన పెట్టుకున్నారు, జానకి ఆశయం నిలబడాలని వెంటపడి మరి చదివిస్తున్నారు. కానీ తను మాత్రం కోడలి బాధ్యత మర్చిపోయి అఖిల్ మీద కేసు పెట్టి అరెస్ట్ చేయించిందని మల్లిక పెట్రోల్ పోస్తుంది.
Also read: వేదనే తన జీవితమన్న యశోధర్- కోడలిని ఆకాశానికెత్తేసిన మాలిని
కుటుంబ ధర్మాన్ని పాటిస్తా అని నువ్వు ఇచ్చిన మాట విని తప్పు చేశాను, పాముకి పాలు పోసినట్టు అయ్యిందని జ్ఞానంబ కూడా మాటలు అంటుంది. ఇప్పుడు నీతి నియమం అని మాట్లాడుతున్నారు మరి నేను ఎన్నో సార్లు అబద్ధాలు చెప్పి మిమ్మల్ని కాపాడాను, మీకోసం నేను ఎంత చేసిన మాకు సహాయం చెయ్యడం మానేసి ఇప్పుడు ఇలా చేయడం నమ్మకద్రోహంగా అనిపిస్తుంది. మీరు కేసు వెనక్కి తీసుకోకపోయినా నా తమ్ముడిని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసని రామా అంటాడు. ఇంట్లో అందరూ జానకికి వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్ కి వెళ్లిపోతారు. సెల్ లో అఖిల్ ని చూసి జ్ఞానంబ ఎమోషనల్ అవుతుంది. రామా కేసు పెట్టొద్దని ఎస్సైని బతిమలాడతాడు.