జానకి వల్ల అఖిల్ ఉద్యోగం, విష్ణు షాపు సమస్యల్లో పడతాయి. తన వల్లే ఇదంతా జరుగుతుందని ఇంట్లో అందరూ మూకుమ్మడిగా దాడి చేస్తారు. ఇంత జరుగుతున్నా నీ కళ్ళు తెరుచుకోవడం లేదా అని మల్లిక తిడుతుంది. ఈ ఉద్యోగం పోతే రోడ్డు మీద పడి అడుక్కోవాలని అఖిల్ అంటాడు. చదువుకున్న అమ్మాయి ఈ ఇంటి కోడలిగా వస్తే ఇలాంటివి జరుగుతాయనే నా భయం అందుకే అప్పుడు వద్దన్నాను. రామ నా దగ్గర నిజం దాచి ఐపీఎస్ చదివించాడు. ఆ పాపానికి ఫలితం వాడు అనుభవిస్తాడు. తెలుసుకునే సరికి నిండా మునిగిపోతాడు. అప్పుడు జానకి అని ఏడవడు అమ్మా అని ఏడుస్తాడు. జరుగుతున్న అనార్థాలు చూస్తున్నావ్ కదా అయినా నీ మనసు మారడం లేదా. వాడేవాడో మనిషిని చంపిన వాడి మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకుంటావా లేదా అని జ్ఞానంబ నిలదీస్తుంది.


Also Read: లాస్యకి విడాకులు ఇస్తానన్న నందు- దివ్య మీద ఫైర్ అయిన విక్రమ్


ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఉండటం నీకు ఇష్టం లేకపోతే తలా కొంచెం విషయం ఇచ్చేసేయ్ అంతే కానీ ముక్కు మొహం తెలియని వాళ్ళ చేతుల్లో మా చావు రాసి పెట్టకు. లేదంటే చెప్పు నా వాళ్ళకి నేనే విషం ఇస్తానని జ్ఞానంబ చెప్తుంది. ఎవరు ఎన్ని మాట్లాడినా జానకి మాత్రం మౌనంగా భరిస్తుంది. ఇల్లు వదిలి వెళ్ళడానికి ఇంత కంటే మంచి అవకాశం దొరకదు మనల్ని ఆపేవాళ్ళు ఉండరు తెగదెంపులు చేసుకుండామని మల్లిక అంటే విష్ణు కూడా సరేనని అంటాడు. జ్ఞానంబ ఆవేశంగా నిద్రమాత్రాలు వేసుకుని చనిపోయినట్టు జానకి కల కంటుంది. పొద్దున్నే గుడికి వెళ్ళి జానకి దేవుడి ముందు గోడు వెళ్లబోసుకుంటుంది. న్యాయం కోసం పోరాడుతుంటే ఎందుకు అండగా నిలబడటం లేదని బాధపడుతుంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు ఒక్కో క్షణం గడుస్తుంటే ప్రాణం పోతున్నట్టు భయంగా ఉందని గుడి దగ్గర కూర్చుని ఏడుస్తుంది.


Also Read: జానకి చుట్టు ఉచ్చు బిగించిన మనోహర్- చావుబతుకుల్లో జ్ఞానంబ


ఐపీఎస్ లక్ష్యం ఇప్పుడు నా స్వార్థం అవుతుంది నా కుటుంబాన్ని కాపాడుకోవాలంటే దాన్ని వదులుకోవాలి. గుడిలో ఈ ఆలోచన వచ్చిందంటే ఇదే దేవుని ఆజ్ఞ అనుకుంటానని నిర్ణయం తీసుకుంటుంది. అప్పుడే గుడి దగ్గర ఒకామే వచ్చి ఐపీఎస్ అవడం కోసం కష్టపడుతున్నావ్ నువ్వే మాకు ఆదర్శమని సెల్ఫీ తీసుకుని వెళ్ళిపోతుంది. ట్యాబ్లెట్స్ వేసుకోమని వెన్నెల బతిమలాడుతుంటే జ్ఞానంబ మాత్రం అందుకు అంగీకరించదు. నన్ను బతిమలాడే బదులు జానకికి నచ్చజెప్పమని అంటుంది. అప్పుడే జానకి వస్తుంది. ఇద్దరికీ ఇద్దరూ ఇలా బిగదీసుకుని కూర్చుంటే ఎలా చివరికి భర్త మాట కూడా వినడం లేదు. ఎవరికి చెప్పుకోను నా బాధ. తెగే వరకు లాగొద్దు పరిస్థితి అర్థం చేసుకోమని గోవిందరాజులు బాధగా చెప్తాడు. నాలో స్వార్థం తప్ప రామ మీద ప్రేమ లేదని అనుకుంటున్నారు. రామని వెంటనే ఇంటికి తీసుకొస్తానని చెప్తుంది. కానీ జ్ఞానంబ మాత్రం రామ ఇంటికి వస్తేనే భోజనం చేస్తానని తెగేసి చెప్తుంది.