జానకి అదే పనిగా ఆలోచిస్తుంటే రామ పనికిరాని ఆలోచనలు చేయవద్దని చెప్తాడు. మీరు తప్పు చేస్తున్నారని రామ అనేసరికి నేను అదే అనుకుంటున్నా తప్పు నాదే అంటుంది. మీరు నిర్ణయం మీద నిలబడకపోవడం తప్పని రామ అంటే కుటుంబం కోసం ఆలోచించకపోవడం తన తప్పని జానకి చెప్తుంది. ఐపీఎస్ లక్ష్యం పిచ్చిలో పడి మమిమ్మల్ని పట్టించుకోవడం లేదని అత్తయ్య అంటున్నారని బాధపడుతుంటే రామ మాత్రం సరసాలు మొదలుపెడతాడు. జానకి, రామ పొద్దున్నే గుడికి వెళ్దామని బయల్దేరబోతుంటే మనోహర్ వస్తాడు. మీతో మాట్లాడటానికి కాదు మేము వచ్చింది రామని అరెస్ట్ చేయడానికని చెప్తాడు. మిఠాయి బండి దగ్గర కస్టమర్స్ తో గొడవపడ్డాడు వాళ్ళు స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇచ్చారని మనోహర్ చెప్పి అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు.
రామని అరెస్ట్ చేయవద్దని జ్ఞానంబ దణ్ణం పెడుతుంటే పెట్టాల్సింది నాకు కాదు మీ కోడలికని చెప్పేసి వెళ్ళిపోతాడు. రామని కాపాడతానని మాట ఇచ్చావ్ ఇప్పుడు ఏం మాట్లాడవేంటి చేతకాని దానివి మాట ఇవ్వడం ఎందుకని జ్ఞానంబ సీరియస్ అవుతుంది. స్టేషన్ కి వచ్చిన తర్వాత మనోహర్ రామని లాగి కోపంగా సెల్ లో పడేస్తాడు. నాకు ఇప్పుడు చాలా హాయిగా ఉందని మనోహర్ అంటుంటే జానకి వస్తుంది.
Also Read: కోడలి హోదాలో భోగాలు అనుభవించమన్న అపర్ణ- అత్తకి ఫ్యూజులు ఎగిరిపోయే షాకిచ్చిన కావ్య
మనోహర్: మొగుడ్ని బయటకి తీసుకెళ్ళి కేసు నుంచి తప్పించవచ్చని అనుకుంటున్నావా
జానకి: ఇచ్చిన బెయిల్ సడెన్ గా రద్దు చేయడం అన్యాయం. మీరు మీ యూనిఫాం కి ద్రోహం చేస్తున్నారు
మనోహర్: ఇప్పుడు ఆలోచించాల్సింది నా గురించి కాదు యుద్దం మొదలైందని శంఖం పూరించావ్ కదా బుద్ధిగా రిజైన్ చేయమని చెప్తే మర్డర్ కేసు విషయంలో రహస్యంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నావంట కదా అది నా పేరు అడ్డం పెట్టుకుని
జానకి: ఒక క్రిమినల్ ని కాపాడుతూ తప్పు మీద తప్పు చేస్తున్నారు
మనోహర్: నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది మిస్టర్ రామ నీ షాపు తాకట్టు పెట్టావంట కదా అప్పు తీర్చమని ఒత్తిడి పెరుగుతుందట కదా. చేతిలో డబ్బులు లేక మత్తు మందు వ్యాపారం మొదలు పెట్టావా
జానకి; అబద్ధం ఇదంతా కట్టు కథ
మనోహర్: ఇదంతా నేను నిజమని నమ్మిస్తాను మీకు అప్పు ఇచ్చిన వాళ్ళు మీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పబోతున్నారు. నువ్వు మొండివి అయితే నేను జగమొండిని
రామ: మీరు న్యాయం కోసం పోరాడండి మనమే గెలుస్తాం
Also Read: నిజం తెలుసుకున్న తులసి - సంజయ్ మెడలు వంచిన దివ్య- నందుని జైలుకి పంపించిన లాస్య
మనోహర్: రేపు ఉదయమే రామని కోర్టుకి తీసుకెళ్తున్నా ఈలోపు నీ రాజీనామా లెటర్ నా టేబుల్ మీద ఉండాలి లేకపోతే కోర్టులోనే కలుసుకుందాం ఇక నీ మొగుడు గురించి నువ్వు మర్చిపో. నువ్వు యూనిఫాంతో నా స్టేషన్ లో ఉంటే నాకు ఎప్పటికైనా ప్రమాదమే
రామాని కలవనివ్వకుండా జానకిని పంపించేస్తాడు. ఎస్సై రాక్షసుడు ఎంతకైనా తెగించేలా ఉన్నాడని జానకి ఆలోచిస్తుంది.