యష్ వేద కోసం ఫ్యాషన్ డ్రెస్ సెలెక్ట్ చేస్తాడు. అదే డ్రెస్ తనకి నచ్చిందని ఇవ్వమని మాళవిక అడిగినా ఇవ్వకుండా తీసుకుని వెళ్ళిపోతాడు. వేదకి ఆ డ్రెస్ తీసుకుని మొహం మాడ్చుకుంటుంది. ఈ డ్రెస్ పార్టీకి ఎలా వేసుకోవాలని తల పట్టుకుని కూర్చుంటుంది. అప్పుడే చిత్ర వచ్చి గొంతెమ్మ కోరికలు కోరిందని చెప్పింది. షాపింగ్ మాల్ లో జరిగిన విషయం మొత్తం చిత్ర పూసగుచ్చినట్టు చెప్తుంది. ఇక యశోధర్ పార్టీకి వస్తాడు. అక్కడ అందరూ యష్ కి స్వాగతం పలికి వేద గురించి అడుగుతారు. అభి వచ్చి బాగా కవర్ చేశావ్ మీరు కలిసి రారని, కలిసి లేరని కౌంటర్ వేస్తాడు. వావ్ భలే కనిపెట్టేశావ్ గా నీకు ఇక ఇదే పని అనుకుంట కదా. అశాంతిని కోరుకునే ఎవడూ మనశ్శాంతిగా ఉండలేరు. నేను వేద ఎంత హ్యాపీగా ఉన్నామో తెలుసా? పవిత్రమైన నదిలాంటిది మా జీవితమని అంటాడు.


అభి: ఆడవాళ్ళని అడ్డు పెట్టుకుని బాగానే ఎదిగావ్


యష్: ఇంకోసారి ఆ మాట మాట్లాడితే చంపేస్తా. పార్టీకి వచ్చావ్ ఎంజాయ్ చేసి వెళ్ళు


అభి: ఈ ఒక్క రోజు నీది అయినంత మాత్రన అన్ని రోజులు నీవే అవుతాయని అనుకోకు


Also Read: జానకి బూజు దులుపిన జెస్సి- రామ మీద మరో తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేసిన ఎస్సై


పార్టీలో యష్ వేద కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. వసంత్ వచ్చి వదిన ఇంకా రాలేదని అంటాడు. వస్తుందని ఆత్రంగా కూల్ గా చెప్తాడు. అదేంటి ఎప్పుడు సీరియస్ గా అరుస్తావ్ కదా ఏంటి కూల్ గా చెప్తున్నవాని అడుగుతాడు. మీ వదిన ఎప్పుడు కనిపించనంత ట్రెండీగా కనిపిస్తుందని చెప్తాడు. తను తీసుకొచ్చిన డ్రెస్ వేసుకుని వస్తుంటే అందరూ తనని పొగుడుతుంటే ఎంత బాగుంటుందోనని మనసులో అనుకుంటాడు. అప్పుడే వేద యష్ కోణం డ్రెస్ కాకుండా చీర కట్టుకుని వస్తుంది. నువ్వు చెప్పినట్టే వదిన చాలా అందంగా రెడీ అయి వచ్చిందని వసంత్ చెప్తాడు.


యష్: నేను ఏం తెచ్చాను నువ్వు ఏం కట్టుకుని వచ్చావ్


వేద: నేను అప్పుడే చెప్పాను కదా అది నాకు కంఫర్ట్ గా ఉండదు అది నాకు సూట్ అవదు


యష్: ఇదేమైన సత్యనారాయణ స్వామి వ్రతమా చీర చుట్టుకుని రావడానికి మూడ్ అంతా పాడు చేశావ్. ఆశపడి ఒక డ్రెస్ తెస్తే అది రిజెక్ట్ చేశావ్  


వేద: నాకు ఇష్టం లేనిది ఫోర్స్ చేయొద్దు


యష్: నీకు చెప్పడం అనవసరం మొత్తం అప్ సెట్ చేశావని కోపంగా వెళ్లిపోతుంటే మాళవిక యష్ కొన్న డ్రెస్ వేసుకుని పార్టీకి వస్తుంది. అభి వచ్చి ఈ డ్రెస్ లో వెలిగిపోతున్నావాని కాంప్లిమెంట్ ఇస్తాడు.


మాళవిక: నేను చెప్పానా కొన్ని కొంతమందికే సూట్ అవుతాయని. నువ్వు ఆశపడినట్టు వేద నీ కోరిక తీర్చలేదని


యష్ కోపంగా వెళ్ళిపోతాడు. మాళవిక తన దగ్గరకి వచ్చి దెప్పి పొడుపు మాటలు మాట్లాడుతుంది. ఈ డ్రెస్ నీకోసం సెలెక్ట్ చేశాడు కానీ అది నీకు దక్కలేదు. మీరిద్దరూ కలవని రెండు రైలు పట్టాలు లాంటి వాళ్ళు. నీలాంటి వాళ్ళకి యష్ సెలెక్ట్ చేసిన డ్రెస్ మాత్రమే కాదు ఏవి సెట్ కావు. అసలు నువ్వు తనకి ఏమి సెట్ కావు. నీ డ్రీమ్స్ ఎప్పటికీ డ్రీమ్స్ అనేసి వెళ్ళిపోతుంది.


Also Read: గదిలో కావ్య అరుపులు, కేకలు- ఇంద్రాదేవి ముందు అడ్డంగా బుక్కైన రాజ్, ఫుల్ కామెడీ


అందరూ సంతోషంగా పార్టీలో డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటే యష్ మాత్రం మొహం మాడ్చుకుంటాడు. వేద యష్ సంతోషంగా డాన్స్ చేస్తారు. మధ్యలో వేద పడబోతుంటే పట్టుకుని సీరియస్ అవుతాడు. మోడ్రన్ డ్రెస్ వేస్తే వేసుకోకుండా ఇలా చీర చుట్టుకుని వచ్చావని తిట్టేసి వెళతాడు. మాళవిక వచ్చి వేదని మరింత బాధ పెట్టేందుకు ట్రై చేస్తుంది. యష్ నీకు దగ్గర కావడం అనేది జరగదని అంటుంది. మగాడిని బట్టి ఆడది ఉండాలని నువ్వు అంటున్నావా ఎవరి ముందు అనకు ఆ మాట పరువు పోతుంది. ఆయన నన్ను ప్రేమిస్తున్నారు ఎంతలా తెలుసా నేను పడిపోతుంటే పట్టుకునేంత అని దిమ్మతిరిగే కౌంటర్ ఇస్తుంది.