జానకి పోలీస్ డ్రెస్ పట్టుకుని ఏడుస్తుంది. ఇదే చివరి వీడ్కోలు అంటూ యూనిఫాంని గుండెలకు హత్తుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది. కబోర్డ్ లో పెన్ డ్రైవ్ తీసుకుని ఇందులో ఏవో కేసు డీటైల్స్ ఉన్నాయని సుగుణ ఇచ్చింది వెంటనే తనకి ఇచ్చేయాలని అనుకుంటుంది. సరిగా ఇలాంటి పెన్ డ్రైవ్ ఎక్కడో చూశానని గుర్తు చేసుకుంటుంది. స్టేషన్ లో మనోహర్ జేబులో నుంచి ఒక పెన్ డ్రైవ్ కింద పడిపోతుంది. అది సుగుణ తీయబోతుంటే ఆగమని చెప్పి తనే తీసుకుంటాడు. ఇది నా బంగారు బాతు దీని మీద ఎవరి చెయ్యి పడటానికి వీల్లేదు. దీన్ని ఎవరూ ముట్టుకోకూడదు ముట్టుకోడానికి కూడ ట్రై చేయవద్దని అంటాడు. బంగారు బాతు అన్నాడంటే ఏదో కేసుకి సంబంధించినదే. ప్రస్తుతం మధుకర్ ఎస్సైకి బంగారు బాతు. అందులో మధుకర్ హత్య చేసిన సీసీటీవీ ఫుటేజ్ ఏమైనా ఉందా? దాన్ని ఎలాగైనా తీసుకుంటే దొంగ దొరికేస్తాడని అనుకుంటుంది.


Also Read: విక్రమ్ రూడ్ బిహేవియర్ - రాజ్యలక్ష్మి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పిన దివ్య


జానకి సుగుణ దగ్గరకి వెళ్తుంది. తెల్లారితే ఎస్సై పెట్టిన గడువు తీరిపోతుంది. ఏదో మార్గం దొరికితే రామని కాపాడుకోగలను లేదటే యూనిఫాంకి దూరం కావలసి వస్తుంది. ఎస్సై పెన్ డ్రైవ్ పట్టుకుని బంగారు బాతు అంటాడు కదా అది దొరికితే రామని బయటకి తీసుకుని రావచ్చని ఐడియా చెప్తుంది. ఇది చాలా రిస్క్ కదా అని సుగుణ అంటే అయినా తప్పదని చెప్పి తనని తీసుకుని మనోహర్ ఇంటికి వెళతారు. గోడ దూకి ఇంట్లోకి వెళతారు. విచిత్రంగా కర్రతో జానకి ఇంటి లోపల పెట్టిన బోల్ట్ తీసేసి ఇంట్లోకి వెళ్తుంది. తర్వాత మనోహర్ గదికి వెళ్తుంది. అప్పుడే మధుకర్ ఫోన్ చేస్తాడు. నిద్రలోనే లిఫ్ట్ చేసి మాట్లాడతాడు. జానకి ఈసారి నా మాట వినకపోతే దాని మరదల్ని తీసుకెళ్ళి జైల్లో వేస్తానని చెప్తాడు. రామని జైలుకి తీసుకెళ్తుంటే జానకి ఏడుపు మొహం చూడాలని ఉంది రేపు కోర్టుకి వస్తానని మధుకర్ అంటే సరేనని ఒప్పుకుంటాడు.


Also Read: ట్విస్ట్ అదుర్స్, కావ్యని తోసేసి పారిపోయిన స్వప్న- రాహుల్ చెంప పగలగొట్టిన రాజ్


మనోహర్ మళ్ళీ నిద్రలోకి జారుకున్న తర్వాత జానకి మొత్తం వెతుకుతుంది. కబోర్డ్ లో పరస్ తీసి అందులో ఉన్న పెన్ డ్రైవ్ తీసేసుకుంటుంది. దాన్ని తీసుకుని మెల్లగా బయటకి రాబోతుంటే అక్కడే ఉన్న ఫ్లవర్ వాజ్ కి చూసుకోకుండా తగులుతుంది. ఆ సౌండ్ కి ఎక్కడ లేస్తాడోనని కంగారూ పడతారు కానీ ఎస్సై కదిలి మళ్ళీ నిద్రపోతాడు. పెన్ డ్రైవ్ తీసుకుని ఇద్దరూ బయటకి వెళ్లిపోతారు. తెల్లారి కోర్టు దగ్గరకి రామని తీసుకొస్తారు. మనోహర్ జానకిని పక్కకి పిలిచి మాట్లాడతాడు. ఇప్పటికైనా మించిపోయింది లేదు జీపులో కూర్చుని రాజీనామా లెటర్ రాసి ఇస్తే ఇదే జీబులో మిమ్మల్ని ఇంటి దగ్గర దింపేస్తానని చెప్తాడు. మనసు మార్చుకునే ఉద్దేశమే ఉంటే ఇక్కడి దాకా ఎందుకు వస్తానని ధైర్యంగా మాట్లాడుతుంది. నా గొప్ప ఏంటో మీరు తెలుసుకునేలా చేస్తానని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. నన్ను రెచ్చగొడితే ఒడిపోతావని మనోహర్ బెదిరిస్తాడు. అన్యాయం గెలిస్తే నేను పర్మినెంట్ గా యూనిఫాంకి దూరమవుతానని చెప్తుంది.