సౌభాగ్య వ్రతానికి జానకి ఇంకా రాలేదని జ్ఞానంబ అంటుంది. అదేంటి ఇంకా రాలేదా అని రామ అడుగుతాడు. వెంటనే తనకి ఫోన్ చేస్తాడు. ఇంకా రాలేదేంటి ఇంటి దగ్గర అందరూ కంగారు పడుతున్నారని చెప్తాడు. బయల్దేరాను దారిలో ఉన్నానని చెప్పమని జానకి భర్తకి చెప్తుంది. పూజ మొదలు పెడదాం జానకి వచ్చేస్తుందిలే అని అంటాడు. పూజ కోసం అమ్మలక్కలు జ్ఞానంబ ఇంటికి వస్తారు. ఇంట్లో పూజ మొదలవుతుంది కానీ జానకి మాత్రం ఇంకా ఇంటికి రాకపోవడంతో రామ గుమ్మం వైపు ఎదురుచూస్తూ ఉంటాడు. పూజారి కూడా పెద్దకోడలు ఇంకా రాలేదేంటని అంటాడు. జానకి రాలేదని జ్ఞానంబ బాధపడుతుంది.


జానకి ఎస్సైని అడిగి ఇంటికి వెళ్తానని అడుగుతుంది. కానీ మనోహర్ మాత్రం తనని ఇంటికి పంపించకూడదని అనుకుంటాడు. ఏటీఎం దొంగతో కానిస్టేబుల్ నిజం చెప్పించలేకపోయాడు తనతో నిజం చెప్పించి బయల్దేరమని చెప్తాడు. ఇప్పటికిప్పుడు కుదరదని జానకి అంటుంది కానీ మనోహర్ మాత్రం వినిపించుకోకుండా మాటలతో దెప్పిపొడుస్తాడు. ఈరోజు నుంచి పెద్ద కోడలి హోదా తనదేనని మల్లిక సంబరపడుతుంది. రామ మళ్ళీ జానకికి ఫోన్ చేస్తాడు. ఇంకా బయల్దేరలేదని కాసేపటిలో బయల్దేరతానని చెప్తుంది. జానకి దొంగ దగ్గరకి వచ్చి పూజకి టైమ్ అవుతుందని ఇరుక్కుపోయాను ఇంటి దగ్గర అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు ప్లీజ్ నిజం ఒప్పుకోరా అని బతిమలాడుతుంది. నిజంగా దొంగతనం చేయలేదని ఉత్తిపుణ్యానికి తీసుకొచ్చి వేశారని చెప్తాడు. అది చూసి ఇప్పుడు కావలసింది సెంటిమెంట్ సీన్ కాదు యాక్షన్ అని జానకి చేతిలోని లాఠీ తీసుకుని మనోహర్ బాదుతాడు.


Also read: రాజ్ తిక్కకుదురుస్తున్న దుగ్గిరాల ఇంటి కంచు కోడలు- కావ్య దగ్గరకి వచ్చిన కనకం


ఇంటికి వెళ్ళడం గురించి కాదు పని గురించి ఆలోచించమని మనోహర్ జానకిని తిడతాడు. ఫోటోల కోసం పని చేయడం కాదు పొట్టకూటి కోసం పనిచేయమని చెప్పమని సుగుణతో అంటాడు. పూజలో భాగంగా కంకణం కట్టమని పూజారి చెప్తాడు. రామ మాత్రం పక్కన జానకి లేకుండా బిక్క మొహం వేసుకుని కూర్చుంటాడు. పూజ పెట్టుకుని ఈ నిర్లక్ష్యం ఏంటి జానకి ఇలా చేసే మనిషి కాదే అని అక్కడకి వచ్చిన ముత్తైదువులు అంటారు. దీంతో రామ మళ్ళీ జానకికి ఫోన్ చేస్తాడు. ఆ కోపం అంతా జానకి దొంగమీద చూపిస్తుంది. నిజం చెప్తానని ఒప్పుకుంటాడు. జానకి వచ్చి ఏటీఎం దొంగతనం ఒప్పుకున్నాడని చెప్తుంది. దీంతో జానకిని వెళ్ళమంటాడు. రామ తప్ప మిగతా జంటలు అన్నీ కంకణధారణ చేసుకుంటారు. జానకి రాకుండానే పూజ పూర్తయిపోతుంది.


Also read: భర్తకి ముద్దు పెట్టేసిన వేద- యష్ ని దూరం చేసేందుకు విన్నీ కుట్ర


జానకికి బుద్ధి వచ్చేలా అక్షింతలు వేయమని మల్లిక అంటుంది. ఆ మాటకి రామ బాధపడతాడు. మల్లిక పూజకీ వచ్చిణ ముత్తైదువులకు వాయనం ఇస్తుంది. పెద్ద కోడలు జ్ఞానంబ చెయ్యి దాటిపోయింది ఇప్పుడు నువ్వే మీ అత్తయ్యని చూసుకోవాలని ఒకావిడ చెప్తుంది. పేపర్ లో ఫోటో పడింది కదా ఇక భూమి మీద కాలు ఎక్కడ నిలుస్తుందని మరొక ఆవిడ అంటుంది. పూజకి వచ్చిన ప్రతి ఒక్కరూ జానకి గురించి తలాఒక మాట అంటారు.