వేదని కూల్ చేయడానికి యష్ కాఫీ కలుపుతూ ఉంటే ఫోన్ సైలెంట్ లో పెట్టిందేవరని కోపంగా వచ్చి అడుగుతుంది. అలిసిపోయి నిద్రపోతున్నావని నేనే పెట్టానని చెప్తాడు. వేద కోపంగా ఎందుకు పెట్టారు రాత్రి క్లినిక్ కి హై ఫీవర్ తో ఒక పాపని తీసుకొచ్చారు నాకు కాల్ చేశారు, తనకి ఏదైనా అయితే ఎవరు బాధ్యత తీసుకుంటారని అందరి ముందు చెడామడా తిట్టేస్తుంది. యష్ సోరి చెప్పినా వినిపించుకోకుండా కోపంగా వెళ్ళిపోతుంది. ఎన్నాళ్ళని ఓపిక పట్టేది రోజు ఈ గొడవలు ఏంటి తెగేదాక లాగకూడదని తెలియకూడదా? ఎన్నాళ్ళు ఇలా ఎందుకు ఇలా అని ఇద్దరూ ఆలోచిస్తారు. మాళవికని ఇంటికి తీసుకొచ్చినందుకు చిత్ర సంతోషంగా వసంత్ కి థాంక్స్ చెప్తుంది. తనని ఇష్టపడి ఇంటికి తీసుకురాలేదని అన్నయ్య, వదిన చెప్పారని తీసుకొచ్చానని చెప్తాడు.


ఒకసారి ఇంటికి వచ్చి మాళవికని కలవమని చిత్రని వసంత్ అడుగుతాడు. తప్పకుండా కలుస్తాను అభిమన్యు చేతిలో మాళవిక బలి కాకుండా చెప్పాల్సింది చెప్పి చేయాల్సింది చేస్తానని అనుకుంటుంది. వేద జరిగిన దానికి కోపంగా ఉంటే యష్ తనతో మాట్లాడానికి వస్తాడు.


Also Read: పట్టాలెక్కిన దివ్య, విక్రమ్ లవ్- భార్యాభర్తలుగా ఒకే గదిలోకి నందు, తులసి


యష్: సోరి నీ ఫోన్ సైలెంట్ లో పెట్టడం తప్పే


వేద: ఒక చిన్న పాప హైఫీవర్ తో వస్తే ట్రీట్మెంట్ చేయలేకపోయాను. మీతో విసిగిపోయాను. భార్యాభర్తల మధ్య ఉండాల్సింది నమ్మకం మన విషయంలో అది లేదు. నేను ఎంత వరకు ఓపిక పట్టేది నా వల్ల కావడం లేదు


యష్: ఎక్కువగా ఫీల్ అవకు వేద ఒప్పుకుంటున్నా నా వల్ల తప్పులు జరిగాయి, ఇంతటితో వదిలేయ్


వేద: మీరే నన్ను వదిలేయండి


యష్: బతిమలాడే కొద్ది బిగుసుకుంటున్నావ్ ఏంటి. ఫ్యామిలీ ముందు అలా అరిచావ్ ఏంటి భర్త అనే గౌరవం ఉండొద్దా. తెగేదాకా లాగొద్దు తెగదెంపులు చేసుకోవడానికి నిమిషం పట్టదు


వేద: మీరు అన్న మాటలకు గుండెని రాయి చేసుకునేందుకు నిమిషం పట్టదు


యష్: అర్థం చేసుకోలేని నీకు నాకు భార్యగా ఉండే అర్హత లేదు


వేద: మీకు భర్తగా ఉండే హక్కు లేదు


యష్: అయితే విడిపోదాం లెట్స్ గెట్ డివోర్స్


వేద: అవును డివోర్స్


అనగానే వద్దు నా కూతురికి విడాకులు ఇవ్వొద్దని సులోచన నిద్రలో ఉలిక్కిపడి లేచి కంగారుగా అరుస్తుంది. శర్మ తనని కదిలించి కల ఏమైనా వచ్చిందా అని అంటాడు. ఇదంతా నా కల భయంకరమైన పీడకల అని బాధపడుతుంది. మరుసటి రోజు తన బిడ్డని కాపాడి చల్లగా చూడమని దేవుడి ముందు వేడుకుంటుంది. సులోచన వేదతో మాట్లాడటం కోసం హాస్పిటల్ కి వస్తుంది. అప్పుడే విన్నీ కూడా వస్తాడు. అల్లుడు మీద అలా అరిచావ్ ఏంటి, మా అందరి ముందు అలా అరిచినందుకు చిన్నబుచ్చుకుని ఉంటారని సులోచన అంటుంది. అవును అలా అని ఉండాల్సింది కదా అని ఫీల్ అవుతుంది. వాళ్ళ మాటలన్నీ విన్నీ వింటూ ఉంటాడు.


Also Read: కావ్యకి బలవంతంగా అన్నం తినిపించిన రాజ్- దుగ్గిరాల ఇంట్లో నిప్పు రాజేసి సంబరపడుతున్న రుద్రాణి


భర్త కోపాలు, తప్పులు అన్నీ గుండెల్లో దాచుకుని భరించాల్సింది భార్య. కాపురం అంటే ఇద్దరు మనుషులు కలిసి ఉండటం కాదు ఒక్కటిగా కలిసిపోవడం. భర్తే భార్యకి మొదటి బిడ్డ అని చెప్తుంది. సులోచన వెళ్లిపోగానే విన్నీ వస్తాడు. మనసుల్ని హర్ట్ చేయకుండా ఉండాల్సింది కదా అని విన్నీతో అంటుంటే మీ ఆయన మారడు వదిలేయ్ అంటాడు. నేను చెప్తుంది ఆయన గురించి కాదు నా గురించని అంటుంది. అణిగిమణిగి కాపురం చేయడం అవసరమా మొగుడి టార్చర్ భరిస్తూ ఉండటం అవసరమా అని అంటాడు. చాలా ఏళ్ల క్రితం నీమీద ఎందుకో కోపం వచ్చింది నీతో ఫ్రెండ్షిప్ కటీఫ్ చేసుకుందామని అనుకున్నాను. అప్పుడు మా అమ్మ ఏం చెప్పిందో తెలుసా అపోహలు, అపార్థాలు ఉండవని చెప్పేసరికి నిన్ను క్షమించిందాన్ని ఈరోజు భర్తని క్షమించలేనా? అని విన్నీకి షాక్ఇస్తుంది. విన్నీకి బై చెప్పేసి భర్త దగ్గరకి వెళ్ళిపోతుంది. హజ్బెండ్ అనే పదాన్ని నీ లైఫ్ లో నుంచి డిలీట్ చేస్తానని అంటుంది.