జానకి మీద ఉన్న ప్రేమని రామ మరోసారి మాటల ద్వారా బయటపెడతాడు. ఉద్యోగ సమస్యలు గుమ్మం బయటే వదిలేసి వచ్చానని మిమ్మల్ని ఇబ్బంది పెట్టనని జానకి మనసులో అనుకుంటుంది. కాసేపటికి రామ భోజనం గదికి తీసుకొస్తాడు. ఎందుకు తెచ్చారంటే పెళ్ళానికి కొసరి కొసరి తినిపించాలని అనిపించిదని అంటాడు. బయటవాళ్ళు తప్పుగా అనుకుంటారు అందరితో కలిసి తిందామని జానకి అంటుంది కానీ రామ మాత్రం ఏకాంతంగా కలిసి తినాలని అనుకుంటున్నట్టు చెప్పేసి వచ్చేశానని చెప్తుంది. చిన్నప్పటి నుంచి పోలీస్ అవాలనే కల తీర్చారని ఇద్దరూ ఎమోషనల్ అవుతారు. భార్యకి ప్రేమగా గోరుముద్దలు తినిపిస్తాడు.


Also Read: ఇద్దరం కొండెర్రిపప్పలమేనన్న రాహుల్- కావ్య దుగ్గిరాల ఇంటికి సరైన కోడలన్న ధాన్యలక్ష్మి


జానకి రెడీ అయి డ్యూటీకి వెళ్తుంటే ఎక్కడికని జ్ఞానంబ అడుగుతుంది. అదేంటి ఒక్కరోజుకే అన్ని మర్చిపోయావా అని గోవిందరాజులు అంటాడు. జానకి ఈరోజు డ్యూటీకి వెళ్ళడం లేదని జ్ఞానంబ ఇంట్లో వాళ్ళందరినీ బయటకి పిలుస్తుంది. ఇంట్లో సౌభాగ్య వ్రతం చేసుకుంటున్నామని చెప్తుంది. రెండేళ్ల నుంచి చేసుకోవడం లేదు కదా అని మల్లిక అంటుంది. అనుకోని కారణాల వల్ల రెండేళ్లుగా చేసుకోలేకపోయాం అందుకు తగ్గ ఫలితం అనుభవించాం. చావు దగ్గర దాకా వెళ్లొచ్చాను, జానకి తన లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. వంశపారపర్యంగా వస్తున్న పూజలు ఆపకూడదు. పూజ చేసుకోవాలంటే ఏర్పాట్లు చూసుకోవాలి కదా అందుకే డ్యూటీకి వెళ్లొద్దని చెప్తుంది. ఒక్కరోజు డ్యూటీ మానేస్తే ఏం కాదులే అని మల్లిక అంటుంది. అలా కుదరదు నిన్ననే ఉద్యోగంలో చేరాను ఈరోజు రానని అంటే ఒప్పుకోరని జానకి అంటుంది. రామ ఎస్సై కి తను చెప్తానని జానకిని డ్యూటీకి వెళ్లొద్దని అంటాడు.


Also Read: దివ్య నిర్ణయం విని ఎగిరిగంతులేస్తున్న విక్రమ్- లాస్య దుమ్ముదులుపుతున్న వాసుదేవ్


గోవిందరాజులు జానకి ఉద్యోగం కదా అని నచ్చ జెప్పడానికి చూస్తాడు కానీ జ్ఞానంబ వినదు. అయితే మీ ఇష్టం మొన్న ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది, ఈసారి ప్రాణమే పోతుందని జ్ఞానంబ కోపంగా అంటుంది. పెద్ద కోడలిగా బాధ్యతలు ముఖ్యమా, నిన్నగాక మొన్న వచ్చిన ఉద్యోగం ముఖ్యమా అని మల్లిక పుల్లలు పెడుతుంది. వ్రతం సాయంత్రం కదా ఆ సమయానికి ఇంటికి వచ్చేస్తానని. వెళ్ళగానే ఎస్సైని పర్మిషన్ అడిగి ఇంట్లో ఉంటానని జానకి చెప్తుంది. భార్య తరఫున రామ ఉంటుందని హామీ ఇస్తాడు. గోవిందరాజులు మళ్ళీ నచ్చజెప్పేసరికి జానకి డ్యూటీకి వెళ్ళడానికి ఒప్పుకుంటుంది. అందరూ వెళ్ళిపోయిన తర్వాత గోవిందరాజులు మల్లికని ఓ ఆట ఆడుకుంటాడు. దొంగల్ని పట్టించిన జానకి గురించి పేపర్ లో వస్తుంది. అది చూసి స్టేషన్లో ఉన్న కానిస్టేబుల్స్ అందరూ సంతోషంగా ఉంటారు. ఈ ఫోటో చూస్తే ఎస్సై మొహం పెనంలా మాడిపోతుందని అంటూ ఉండగా మనోహర్ వస్తాడు. పేపర్ ఎక్కడ అని అడిగేసరికి సుగుణ వెళ్ళి ఇస్తుంది. అందులో జానకి గురించి పడిన వార్త చూసి కోపంతో రగిలిపోతాడు. అప్పుడే జానకి వచ్చి గుడ్ మార్నింగ్ చెప్పగానే మనోహర్ కోపంగా తిరిగి గుడ్ మార్నింగ్ చెప్తాడు.