రామా రోడ్డు మీద ఉంటే కన్నబాబు వచ్చి పలకరిస్తాడు. నోటికొచ్చినట్టు మాట్లాడుతూ రామాని రెచ్చగొడతాడు. కష్టపడి రూ.20 లక్షలు అప్పు చేసి ఎవడో చేతిలో పెట్టేశావ్ ఇప్పుడేంటి పరిస్థితి మూడు రోజుల్లో మూటా ముల్లు సర్దుకోవాలి అంట కదా అని అంటాడు. ‘నీ భార్య జానకికి నాకు చిన్న పంచాయతీ ఉంది అది సెటిల్ చేస్తే నీకు కావాల్సిన రూ.25 లక్షలు ఇస్తాను. మొన్న ఒక కేసులో నేను తెలివిగా బయటపడ్డాను కానీ మీ ఆవిడ వచ్చి మాకు వార్నింగ్ ఇచ్చింది. అప్పటి నుంచి చలి జ్వరం పట్టుకుంది అది తగ్గాలంటే నీ భార్య వచ్చి తప్పు చేశాను క్షమించండి అని నా కళ్ళు పట్టుకుని అడగాలి’ అని కన్నబాబు అంటాడు. ఆ మాటకి రామా కోపంగా తన కాలర్ పట్టుకుంటాడు. తన కాలిగోటికి కూడా సరిపోవు అని వార్నింగ్ ఇచ్చి రామా వెళ్ళిపోతాడు.


జ్ఞానంబ నగలు తాకట్టు పెట్టి రూ.5 లక్షలు తీసుకుని వస్తుంది. ఒక్కరోజే సమయం ఉంది ఏమవుతుందో ఏమో అని జ్ఞానంబ కంగారుపడుతుంది. లక్ష్మీదేవిలా నిండుగా ఉండే నిన్ను ఇలా నగలు లేకుండా చూడలేకపోతున్నా అని గోవిందరాజులు బాధపడతాడు. అలంకారంగా ఉండే నగలు ఇటువంటి టైమ్ లో ఉపయోగపడితే తప్పేముందని జ్ఞానంబ అంటుంది. రామా ఎంతకీ ఇంటికి రాకపోయేసరికి జానకి ఎదురు చూస్తూ ఉంటుంది. మల్లిక వచ్చి జానకిని నోటికొచ్చినట్టు తిడుతుంది. మీ వల్లే గౌరవంగా బతికిన కుటుంబం రోడ్డున పడాల్సి వచ్చిందని అంటుంది. గోవిందరాజులు వచ్చి తన నోటికి తాళం వేస్తాడు. జెస్సి రామా వాళ్ళ గురించి బాధపడుతూ ఉంటుంది. అఖిల్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా ఉండటం నచ్చలేదని జెస్సి అంటుంది.


Also Read: 'తులసికి సీమంతం చేద్దామా' అని నీచంగా మాట్లాడిన లాస్య- ఇంటిని తాకట్టు పెడుతున్న నందు


అఖిల్: ఇప్పుడు నేను కూడా వెళ్ళి అందరి కాళ్ళు పట్టుకుని అప్పు కోసం ప్రాధేయపడాలా 


జెస్సి: మన ఫ్యామిలీ రోడ్డున పడినా పట్టించుకోను, ఎవరి పరువు పోయినా పట్టించుకోను, ఇలా పట్టనట్టే ఉంటాను అంటే నువ్వు మనిషివే కాదు సెల్ఫీష్ వి


అఖిల్: కోపంగా తన మీదకి చెయ్యి ఎత్తుతాడు


జెస్సి: ఆగిపోయావే కొట్టు


అఖిల్: వదిన నా మీద ఇలా పగతీర్చుకుంటుందని అనుకోలేదు భార్య దగ్గర నన్ను శత్రువుని చేసింది


Also Read: సౌందర్యని కలిసిన దీప, కార్తీక్ ని కలిసిన పిల్లలు- చారుశీలకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మోనిత


విష్ణు గదిలోకి వచ్చి మల్లికని పిలుస్తాడు. కానీ మల్లిక మాత్రం దుప్పటి ముసుగు వేసుకుని దిండులా పడుకుని మెక్కుతుంది. అందరూ తిండి మానేశారు నాకు ఆకలేస్తుంది అందుకే తింటున్నా అని అంటుంది. ఇంకా బాధపడుతున్నావ్ అనుకున్నా ఇదా నువ్వు చేస్తుందని విష్ణు అంటాడు. ఇల్లు అందరిదీ కదా కనీసం అది పోతుందనే భయం కూడా లేదా అని అడుగుతాడు. ఆ డబ్బు ఏమైనా మనం తీసుకున్నామా, ఏదైనా తేడా కొడితే ఇల్లు తీసుకున్నాం కదా వెళ్లిపోదామని మల్లిక చెప్తుంది. అందరినీ వదిలేసి వెళ్తే అమ్మ వాళ్ళు ఏమైనా అనుకుంటారని విష్ణు అంటాడు కానీ మల్లిక మాత్రం ఊరుకోదు.