అఖిల్ జెస్సిని ఉద్యోగం వెతుక్కోమని అంటుంది. ఆ మాటకి అఖిల్ కోపంగా తన మీద అరుస్తాడు. నువ్వు ఎటు ఉద్యోగం చూసుకోవడం లేదు నేను అయినా ఉద్యోగం చేసేదా అని జెస్సి అడుగుతుంది. నువ్వు ఉద్యోగం చేస్తే నన్ను చేతకాని వాడిని అనుకుంటారు, నా చెప్పుతో నేను కట్టుకున్నట్టే అని కోపంగా అనేసి వెళ్ళిపోతాడు. జ్ఞానంబ భర్త గోవిందరాజులు చేతికి నూనె పెడుతూ ఉంటే ఇంటి పరిస్థితులు అర్థం చేసుకోమని చెప్తాడు. కానీ మనసుకి తగిలిన బాధ మర్చిపోవడం అంత సులభం కాదు ఒక్కోసారి అది నా మాట కూడా వినదు అని అంటుంది. పండగ అయిపోగానే వెన్నెలని నానమ్మ దగ్గరకి వెళ్లిపొమ్మని జ్ఞానంబ అంటుంది. ‘నువ్వు ఎందుకు వెళ్ళమని అంటున్నావో నాకు తెలుసు, ఏ సౌకర్యాలు లేని ఈ ఇంట్లో నేను ఎక్కడ ఇబ్బంది పడతానో అని వెళ్ళమని అంటున్నావ్’ కదా అని వెన్నెల అంటుంది.


Also Read: కూతుర్ని కాపాడుకున్న తులసి- ఇక లాస్య పని అవుట్


మీరు బాగున్నట్టయితే వెళ్ళేదాన్ని కానీ ఇక్కడ మిమ్మల్ని ఇలా వదిలేసి వెళ్ళడం కరెక్ట్ కాదు ఎవరు చెప్పినా వెళ్ళేది లేదని వెన్నెల అంటుంది. ఆ మాటకి జ్ఞానంబ బాధపడుతుంది. ఇంటికొచ్చిన ఆడపిల్లకి పండక్కి బట్టలు కూడా కొనలేని పరిస్థితి మన కష్టాలు ఎప్పుడు తీరుతాయో అని బాధపడుతుంది. రామా పని కోసం వెతుక్కుంటూ ఉండగా చరణ్ అటుగా కారులో వెళ్తున్నట్టుగా కనిపిస్తాడు. రామా వాళ్ళని ఫాలో అయి కారుకి అడ్డు పడి అందులో ఉన్న వాడిని కొట్టబోతాడు. కానీ అతను వేరే ఎవరో అయ్యేసరికి క్షమించమని అడుగుతాడు. వెన్నెల పని చేస్తుంటే జానకి వచ్చి ఆపుతుంది. మా వల్ల మారిన ఇంటి పరిస్థితిని మామూలు స్థితికి తీసుకొచ్చి మళ్ళీ అత్తయ్య మొహంలో ఆనందం చూడాలి అని జానకి అంటుంది. ఆ మాటకి వెన్నెల సంతోషిస్తుంది.


విష్ణు తన దగ్గర ఉన్న డబ్బుతో ఇంట్లో పండగకి బట్టలు తీసుకోమని అమ్మకి ఇద్దామని మల్లికని అడుగుతాడు. కానీ అందుకు మల్లిక అసలు ఒప్పుకోదు. మన దగ్గర డబ్బులు ఉన్నాయని వాళ్ళకి తెలియదు కదా అని విష్ణు బతిమలాడినా కూడా అందుకు అంగీకరించదు. డబ్బులు లేకపోయినా మీ అన్నయ్య పండగ ఎలాగోలా జరిపిస్తాడు మీరు సైలెంట్ గా ఉండండి అని వార్నింగ్ ఇస్తుంది. వెన్నెల దగ్గరకి వచ్చి మల్లిక తన మైండ్ చెడగొట్టడానికి చూస్తుంది. జానకి పుణ్యమా అని పరిస్థితులు ఇలా అయిపోయాయని ఎక్కిస్తుంది. 'నువ్వు అనవసరంగా ఇక్కడికి ఎందుకు వచ్చావ్, ఇక్కడ దరిద్రం వెతుక్కుంటూ వచ్చావా. లక్షల్లో అప్పులై ఉన్నాం. నువ్వు వీళ్ళని నమ్ముకుంటే పెళ్లి కూడా చెయ్యలేరు. మన పరిస్థితి చూస్తే అటు నుంచి అటే వెళ్లిపోతారు. నా మాట విని మీ నానమ్మ ఇంటికి వెళ్లిపో. తను అయితే మంచి సంబంధం చూసి ఘనంగా పెళ్లి చేస్తుంది. నీకు ఈ ఖర్మ అవసరమా చెప్పు’ అని మల్లిక మైండ్ చెడగొడుతుంది.


Also Read: యష్, వేద మధ్యలో విన్నీ- అభికి సంబంధాలు చూస్తున్న భ్రమరాంబిక, మరి మాళవిక పరిస్థితేంటి?


ఇదే పరిస్థితుల్లో మీ అమ్మానాన్న ఉంటే వాళ్ళని వదిలేసి వెళ్లిపోతావా వదిన అని వెన్నెల అడుగుతుంది. ఇక్కడ ఉంటే నా పెళ్లి జరగదు అంటే నేను ఇక్కడే ఉంటాను, వాళ్ళని వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళను అని గడ్డి పెడుతుంది. వాళ్ళ మాటలు విన్న జానకి మల్లిక మీద కోప్పడుతుంది.