మల్లిక రామాని అవమానించేలా మాట్లాడేసరికి జానకి తనకి గట్టిగా బుద్ధి చెప్తుంది. ఒకాయన వచ్చి ఫంక్షన్ ఉందని 70 కేజీల లడ్డూ కావాలని ఆర్డర్ ఇస్తాడు. రాత్రికి రాత్రికి చేయడం అంటే కష్టమేమో అని రామా అంటాడు. కానీ జానకి మాత్రం చేస్తామని చెప్తుంది. లడ్డూల డబ్బు వస్తే ఫీజుకి ఎటువంటి ఇబ్బంది ఉండదని జానకి మనసులో అనుకుంటుంది. మలయాళం వంట చేశాడో లేదోనని చూసేందుకు జానకి వెళ్తుంది. రామాకి మిల్లు శీను ఫోన్ చేసి గోవిందరాజులు తమ దగ్గర గుమాస్తాగా చేరాడని పనికి దింపమని చెప్తాడు. నాన్న పనికి వెళ్ళడం ఏంటని అనుకుని రామా వచ్చి తండ్రిని అడుగుతాడు. ఎందుకు పనిలో చేరావని అడుగుతాడు. అది విని జ్ఞానంబ చాలా బాధపడుతుంది.
Also Read: లాస్య షాక్, మాజీ భార్య గురించి గొప్పగా చెప్పిన నందు- అభి మాటలకు గుండె పగిలేలా ఏడ్చిన తులసి
ఇంట్లో పరిస్థితి బాగోలేదని మిల్లులో పని చేయడానికి ఒప్పుకున్నానని గోవిందరాజులు చెప్తాడు. ఆ పని అయినా చేయాల్సిన అవసరం ఏముందని జానకి అడుగుతుంది. ఆరోగ్యం బాగోలేనప్పుడు ప్రశాంతంగా ఉండాలసిన టైమ్ లో ఎందుకు ఇలా చేయడం అని రామా అంటాడు. మీరు ముగ్గురు కష్టపడుతుంటే నేను ఖాళీగా కూర్చోవడం బాగోలేదని గోవిందరాజులు చెప్తాడు. ఈ వయస్సులో పని చేయాల్సిన అవసరం లేదని రామా అంటాడు. పిల్లలు ఉండేది ఆస్తులు పంచుకోవడానికి మాత్రమే కాదు పెద్దలని బాగా చూసుకోవడానికి కూడా అని జానకి చెప్తుంది. మీరు పనికి వెళ్తున్నారంటే మేము మిమ్మల్ని సరిగా చూసుకోవడం లేదా అని రామా బాధగా అడిగి ఇటువంటి నిర్ణయం ఇంకెప్పుడు తీసుకోవద్దని చెప్తాడు.
జానకి వాళ్ళు భోజనానికి కూర్చుంటూ 70 కేజీల లడ్డూలు చేయాలని అనేసరికి మలయాళంని సహాయం చేయమనేసరికి బిత్తరపోతాడు. మల్లిక జానకి మాటలు తలుచుకుని కోపంతో రగిలిపోతుంది. మావయ్య కూర్చుని చేసే పనే కదా చేస్తే తప్పేముంది, అయినా ముగ్గురం కలిసే సంపాదిస్తున్నామని మీ అన్నయ్య చెప్పారని తిట్టుకుంటుంది. ఇంట్లో డబ్బులు ఇవ్వకుండా ఎలా తప్పించుకోవాలో ఆలోచించమని భర్తకి చెప్తుంది. విష్ణు మాత్రం తింటున్నాం కదా ఇవ్వకపోతే బాగోదని అంటాడు కానీ మల్లిక మాత్రం వినిపించుకోదు. రామా, జానకి లడ్డూలు చేస్తూ ఉంటారు. వాళ్ళకి వెన్నెల సహాయం చేస్తూ ఉంటుంది. మలయాళం లడ్డు చేయకుండా దానితో గారేలాగా బొక్కలు పెడుతూ ఉంటాడు. అది చూసి ఏంటని రామా అనేసరికి లడ్డు అంటాడు. లడ్డూలు చేయడం వచ్చా నిజం చెప్పమని వెన్నెల అడుగుతుంది.
Also Read: అభిమన్యుతో చేతులు కలిపిన విన్నీ- వేద కోసం పార్టీకి వచ్చిన యష్
వెన్నెల, రామాని పడుకోమని చెప్పి జానకి పంపించేస్తుంది. మలయాళం సహాయంతో చేస్తానులే అని చెప్తుంది. నిద్రకి ఆగలేక మలయాళం తిప్పలు పడుతూ కాసేపటికి నిద్రపోతాడు. జానకి ఒక్కతే లడ్డూలు చేయడం చూసి గోవిందరాజులు బాధపడతాడు. సాయం చేస్తానని అంటాడు కానీ జానకి వద్దని చెప్తుంది.