నందు పెట్టె బిజినెస్ గురించి అభి హేళనగా మాట్లాడటం విని తులసి తనని తిడుతుంది. నువ్వు చదువుకోలేదు కదా మామ్ నీకు స్టేటస్ అంటే ఏంటో తెలియదులే అని తల్లిని అవమానిస్తాడు. ఆ మాటకి పరంధామయ్య తులసి గొప్పతనం గురించి కాసేపు చెప్తాడు. నువ్వు ఈరోజు బతికి ఉన్నావంటే అది మీ అమ్మ వల్లే. నిన్ను చూసి మేము సిగ్గు పడుతున్నామని అంటాడు. నీ పరువు పోతుందని అనుకుంటే నిరభ్యంతరంగా ఇంట్లో నుంచి వెళ్లిపోవచ్చని పరంధామయ్య అంటాడు.


అభి: ఈ ఇంట్లో ఉండాలనే ముచ్చట నాకు లేదు ఎప్పుడెప్పుడు పారిపోదామనే ఉంది


అనసూయ: ఉమ్మడి కుటుంబం కోసం మీ అమ్మ అంత తాపాత్రయపడుతుంటే నువ్వేంటి ఇలా మాట్లాడతావ్


అభి: ఈ ఇంట్లో నాకు ఎవరు విలువ ఇవ్వరు. అంకిత కేవలం నీకోసమే ఉంటున్నా


అంకిత: మన మధ్య గొడవలు పబ్లిక్ గా డిస్కస్ చేయకు, పద్ధతిగా ఉండు


Also Read: అభిమన్యుతో చేతులు కలిపిన విన్నీ- వేద కోసం పార్టీకి వచ్చిన యష్


అభి: నాకు పద్ధతులు నేర్పించడం కాదు ముందు నువ్వు పద్ధతులు నేర్చుకో మా మామ్ ని ఫాలో అయితే మన కాపురం కూడా వాళ్ళ కాపురంలాగా ముక్కలు అవుతుంది. డైవర్స్ దాకా వెళ్తుంది అనేసరికి తులసి గుండె ముక్కలైపోతుంది. నువ్వు కోరుకుంది కావలసింది అదే అయితే ఆవిడ అడుగుజాడల్లో నడువు అనేసి వెళ్ళిపోతాడు.


నందు అభి దగ్గరకి వెళ్ళి మాట్లాడతాడు. తప్పుడు సలహాలు విని తప్పుడు పనులు చేస్తున్నారని తండ్రిని అంటాడు. కానీ నందు మాత్రం ఒప్పుకోడు. మామ్ మిమ్మల్ని వద్దని అనుకుని డైవర్స్ తీసుకుంది కానీ మళ్ళీ మిమ్మల్ని ఎందుకు తన చేతుల్లోకి తీసుకోవాలని అనుకుంటుందని అభి అడుగుతాడు. మీ అమ్మ ఎదుటి వాళ్ళు బాగుండాలని కోరుకుంటుంది అది మీ అమ్మ మంచితనం అని పొగుడుతాడు. ఆ మాటలన్నీ లాస్య వింటుంది. మీకు మామ్ అంటే ఇష్టమా అని అభి అంటాడు. మంచి చేసినప్పుడు మంచి అనడానికి ఇష్టమే ఉండాల్సిన అవసరం లేదు, నేను కేఫే స్టార్ట్ చేసే విషయంలో న్నీ ఒపీనియన్ చెప్పావ్ అది హార్ష్ గా చెప్పాల్సిన అవసరం లేదని నందు అంటాడు. మీ గొడవల్లోకి మీ అమ్మని లాగడం తనకి నచ్చలేదని నందు అంటాడు.


నందు: మీ అమ్మ నచ్చకపోతే పెళ్ళైన ఏడాదికే విడాకులు ఇచ్చేవాడిని, ముగ్గురు పిల్లల్ని కనేవాడిని కాదు, డైవర్స్ విషయంలో తన తప్పేమీ లేదు. విడాకులు తీసుకోవడానికి తను కారణం కాదు.. నేనే అందుకు పూర్తిగా నేనే బాధ్యుడిని


అభి: ఎందుకు మీ మీద తప్పు వేసుకుంటున్నారు


Also Read: స్వప్నకి కుజదోషం, కనకం నెత్తిన పిడుగు- మళ్ళీ గొడవపడిన రాజ్, కావ్య


నందు: చేయని తప్పు మీద వేసుకునే వాడిని కాదు నేను చిన్న చిన్న గొడవలు జరిగి అవి పెద్దవి అయి డైవర్స్ అయిపోయింది. మిమ్మల్ని చాలా ప్రేమగా చూసుకుంది. తులసి పిల్లల విషయంలో ఎప్పుడు తండ్రి గౌరవం తగ్గకూడదని చూసుకుంది. అందుకే నీకు నిజాలు చెప్పడానికి వచ్చాను. ఇంకెప్పుడు మీ అమ్మని అలా అనకు, నీకు నేను కేఫే స్టార్ట్ చేయడం ఇష్టం లేకపోతే అటు వైపు రాకు


నందు మాటలు అర్థం చేసుకోవడం అవడం లేదు కాసేపు తనని తిడతాడు. కాసేపు ప్రేమతో అభిషేకం చేస్తాడు గోపి(గోడమీద పిల్లి) అని లాస్య షాక్ అవుతుంది. తులసి అభి మాటలు తలుచుకుని బాధపడుతూ ఉంటుంది. వాడికి ఏం తక్కువ చేశానని అంత కోపం అని తులసి చాలా ఏడుస్తుంది. విడాకులు తీసుకోవాల్సి వచ్చింది అది నా తలరాత అందుకు నేనేం చెయ్యను అని తులసి బాధపడుతుంటే దూరం నుంచి నందు, లాస్య కూడా చూస్తారు. వెళ్లిపోవాలని అనుకుంటే వెళ్లిపోనిద్దాం ఎవరు అడ్డుపడొద్దని తులసి అంటుంది. అంకిత తులసి కాళ్ళ మీద క్షమాపణ అడుగుతుంది.