జ్ఞానంబ డాక్టర్ ని కలిసి తన కోడలు జానకి నిజం చెప్పిందని వివరంగా చెప్పమని అడుగుతుంది. ప్రాణం పోతుందని తెలిసినా ఇంత దూరం వచ్చారు, ఇంత ప్రశాంతంగా మాట్లాడుతున్నారంటే అని డాక్టర్ అనేసరికి జ్ఞానంబ షాక్ అవుతుంది. అదేంటి మీ కోడలు ఏమి చెప్పలేద అని డాక్టర్ అంటుంది. తన కోడలు ఏం చెప్పలేదని మొత్తం మీరే చెప్పారని జ్ఞానంబ చెప్తుంది. ఇప్పటికైనా నిజం చెప్పండి ఎందుకు ప్రాణం పోతుందని జ్ఞానంబ అడిగేసరికి డాక్టర్ జరిగింది అంతా వివరిస్తుంది. అప్పుడే జానకి వస్తుంది. జ్ఞానంబ ఉందని జానకి కవర్ చేయడానికి చూస్తుంది కానీ జ్ఞానంబ మాత్రం ఎన్ని మందులు వాడినా పోయే ప్రాణాన్ని ఆపలేరు కదా అని అంటుంది ఆ మాటకి జానకి షాక్ అవుతుంది.


జ్ఞానంబ: నిజం నాకు తెలియకూడదని ఇప్పటికే చాలా కష్టపడ్డావ్ నాకు అంతా తెలుసు. ఎందుకు జానకి నిజం దాచావ్, నీలో నువ్వు బాధపడి ఏం సాధించాలని


జానకి: ఆరోగ్యం బాగోకపోతే చెప్పొచ్చు కానీ


జ్ఞానంబ: నువ్వు చెప్పలేదని నా చావు ఆగిపోతుందా. బతుకు కంటే చావు గొప్పది అందుకే బతకడానికి వందేళ్లు ఇచ్చిన దేవుడు చావడానికి క్షణాలే ఇచ్చాడు. అందరికీ చెప్పకుండా వచ్చే చావు నాకు ముందే చెప్పి వస్తుంది


Also Read: నగలతో స్వప్న జంప్, కనకం షాక్- రాజ్ పెళ్లి కావ్యతోనే జరుగుతుందా?


జానకి: అది అదృష్టం ఎలా అవుతుంది అత్తయ్య


జ్ఞానంబ: ఈ విషయం రామకి తెలుసా(ఆయనకి తెలుసన్న విషయం చెప్పకూడదని అనుకుని తెలియదని చెప్తుంది). నేను చనిపోయేవరకు ఎవరికీ ఏ విషయం చెప్పొద్దు నా గురించి ఎవరు ఆలోచించాల్సిన అవసరం లేదు మీ గురించి ఆలోచించుకోండి. ఇక నుంచి నువ్వు కన్నీళ్ళు పెట్టుకోవడానికి వీల్లేదు. చావుకి ఆనందంగా ఎదురు వెళ్తానని అంటుంది.


మలయాళంని కొట్టడానికి వెంటపడుతూ జారిపడబోతుంటే తిలోత్తమ వచ్చి పట్టుకుంటుంది. అది చూసి మల్లిక వామ్మో అని నోరెళ్ళబెడుతుంది. కాసేపు గోవిందరాజులను ఆడుకుంటుంది. జ్ఞానంబ, జానకి ఇంటికి వస్తారు. జెస్సి వాళ్ళ నాన్న ఫోన్ చేసి కాన్పుకి ఇంటికి పంపించమని ఫోన్ చేశారని గోవిందరాజులు చెప్తాడు. ఎవరూ ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదని జ్ఞానంబ అనేసరికి అందరూ ఆశ్చర్యపోతారు. అందరూ తన కళ్ళ ముందే ఉండాలని పుట్టబోయేది తన కుటుంబ వారసుడి అని కాన్పు ఇంట్లోనే జరగాలని చెప్పేస్తుంది. గోవిందరాజులు సర్ది చెప్పడానికి చూస్తాడు కానీ జ్ఞానంబ ఒప్పుకోదు. అందరూ తన కళ్ళ ముందే ఉండాలని, ఎవరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదని మరోసారి గట్టిగా చెప్తుంది.


Also Read: రాజ్యలక్ష్మి అసలు స్వరూపం బట్టబయలు, తల్లిని గుడ్డిగా నమ్ముతున్న విక్రమ్- దివ్యని ఒప్పించేపనిలో తులసి


జ్ఞానంబ ప్రవర్తన ఏం అర్థం కాక గోవిందరాజులు చూస్తూ ఉంటాడు. జెస్సి అత్తయ్య చెప్పినట్టు ఇక్కడే ఉంటానని అంటుంది. జానకి ఒంటరిగా నిలబడి కుమిలికుమిలి ఏడుస్తుంటే రామ వస్తాడు. జ్ఞానంబకి నిజం తెలిసిపోయిందని జానకి భర్తకి చెప్తుంది. చనిపోతున్న విషయం ఇంట్లో ఎవరికి తెలియకూడదని అత్తయ్య మాట తీసుకుందని చెప్పేసరికి రామ, జానకి ఎమోషనల్ అవుతారు. తల్లిని కాపాడుకోలేమా అని రామ అంటాడు. జానకి కిడ్నీ ఇస్తానని అంటుంటే రామ వద్దని చెప్తాడు.