మాధురి మీద హత్యా ప్రయత్నం చేసింది అఖిల్ కాదని సునంద కొడుకు కన్నబాబు అని జానకి ఇంట్లో వాళ్ళందరికీ చెప్తుంది. అది విని జ్ఞానంబ, జెస్సి చాలా సంతోషిస్తారు. అఖిల్ విషయంలో ఉన్న టెన్షన్ అంతా పోయిందని విష్ణు కూడా అంటాడు. పోలీసాఫీసర్ కాకుండానే క్రిమినల్ ఎవరో కనిపెట్టావ్ అంటే నువ్వు గ్రేట్ అని మల్లిక పైకి మెచ్చుకుంటుంది. అఖిల్ కి ఏదో ఫోన్ రావడంతో బయటకి వెళ్తే జానకి తన వెనుకాలే వెళ్తుంది. అఖిల్ మీద ఏ మచ్చ లేదని తెలిశాక ఎటువంటి టెన్షన్ లేదని గోవిందరాజులు రిలీఫ్ గా ఫీల్ అవుతాడు. అఖిల్ తన ఫ్రెండ్ తో ఫోన్ మాట్లాడి వెనక్కి తిరిగేసరికి జానకి ఉంటుంది.


మాధురి విషయంలో కన్నబాబు తప్పు చేశాడని నిరూపించినందుకు జానకికి థాంక్స్ చెప్పి వెళ్లబోతుంటే ఆపుతుంది.


జానకి: కన్నబాబు తప్పు చేశాడంటే నీది కూడా ఉంది. నువ్వు కొట్టిన దెబ్బ వల్ల మాధురికి ఇది జరగకపోవచ్చు కానీ నువ్వు కొట్టడం నేను చూశాను, నువ్వు ఎందుకు చంపేస్తానని అరిచావో ఎందుకు కొట్టడానికి వెంట పడ్డావో నాకు తెలియదు, అయితే నీ ఏజ్ కుర్రాళ్ళు ఫోకస్ చేయాల్సింది ఇలాంటి వాటి కోసం కాదు. లైఫ్ మీద గోల్ ఉండాలి అవేవీ నీలో కనిపించడం లేదు. నువ్వు ఏం సాధించకపోయినా నీ తల్లి సైలెంట్ గా ఉండవచ్చు. కానీ రేపు నీకు బిడ్డ పుట్టి ఎదిగిన తర్వాత ఏంటి ఇది అని ప్రశ్నిస్తే నీ దగ్గర సమాధానం ఉందా? నువ్వు దేనికి పనికిరాకుండా పోతే ఎలా అందుకే ఏదో ఒక జాబ్ చూసుకో అంతే కానీ మన ఫ్యామిలీ బాధపడేలా చేస్తే ఊరుకోను అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది.


జానకి మాట్లాడింది ఎవరు చూడలేదు కదా అని అఖిల్ చుట్టూ చూసుకుంటాడు. రామా ఇంటికి వచ్చి పోలీసులు కన్నబాబుని అరెస్ట్ చేసి తీసుకెళ్లారా అని జానకిని అడుగుతాడు. అవునని చెప్తుంది. కానీ రామాకి గుడి దగ్గర కన్నబాబు కనిపించిన విషయం జానకితో చెప్తాడు. వాళ్ళ పరపతి అడ్డం పెట్టుకుని అమాయకుడిని ఇరికించారు, వాళ్ళు మళ్ళీ అఖిల్ ని ఇరికించరని నమ్మకం ఏంటని రామా జానకితో అంటాడు. జానకి కోపంగా సునంద ఇంటికి వస్తుంది.


జానకి: అధికారం ఉంటే ఏమైనా చెయ్యొచ్చు అని మీరు నిరూపించారు, న్యాయం నిజాయితీ ఉంటే ఎలాంటి వాళ్ళని అయిన ఎదిరించొచ్చు అని నేను నిరూపిస్తాను


సునంద: ఏంటి సవాల్ చెయ్యడానికి వచ్చావా


Also Read: తులసి కోరిక తీర్చాలని డిసైడ్ అయిపోయిన సామ్రాట్- ఆవేశంతో రగిలిపోయిన ప్రేమ్


జానకి: మీ కొడుకు చేసిన తప్పు సమర్దించవద్దు అని చెప్పడానికి వచ్చాను. మాధురి హాస్పిటల్ బెడ్ మీద ప్రాణాలతో పోరాడటానికి కారణం నీ కొడుకే అని సాక్ష్యాధారాలతో నిరూపించాను కానీ డబ్బుతో వాటిని కొనేశారు


సునంద: నీకు ఎంత కావాలో చెప్పు


జానకి: నన్ను కొనడం నీ వల్ల కాదు. జానకి అంటే ఇంట్లో కూరగాయలు కట్ చేసే ఇల్లాలు కాదు యూనిఫాం వేసుకుని తప్పు చేసిన వాళ్ళని పరిగెత్తించి కొట్టగలిగే కిరణ్ బేడీ కూడా. నా మరిది పొరపాటు చేశాడు సరిదిద్దే ప్రయత్నం చేశాను మీరు మీ కొడుకుని కాపాడొద్దు. ఒంటి మీద యూనిఫాం లేకుండానే ఇదంతా చేశాను, యూనిఫాం పడితే తప్పు చేసిన వాళ్ళకి లైఫ్ టైమ్ సెటిల్మెంట్ ఇస్తాను


కన్నబాబు: ఏంటి బెదిరిస్తున్నావా


జానకి: ఆ పని నిన్ను చెయ్యొద్దు అని చెప్తున్నా ఎవరిని వదిలిపెట్టను అని మాయనకి వార్నింగ్ ఇచ్చావంట కదా అందుకే నేనే వచ్చాను నీ తాట తీస్తాను


కన్నబాబు: అనవసరంగా రెచ్చగొట్టకు


జానకి: నా జోలికి నా ఫ్యామిలీ జోలికి వస్తే నా రియాక్షన్ వేరేగా ఉంటుంది అది నువ్వు తట్టుకోలేవు, మర్యాదగా తప్పు ఒప్పుకుని సరెండర్ అవు లేదంటే మాధురికి ఎలా న్యాయం చెయ్యాలో నాకు తెలుసని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది.


Also Read: ఆదిత్యకి ఆరు నెలల జైలు శిక్ష- వేద జీవితాన్ని మార్చేందుకు వచ్చిన కొత్త క్యారెక్టర్లు


జ్ఞానంబ పిల్లల గురించి ఆలోచిస్తూ ఇంట్లోకి పాప వచ్చినట్టు కలకంటుంది. సడెన్ గా పాప వెళ్లిపోయిందని కంగారుగా ఏడుస్తుంది. అది చూసి జానకి, గోవిందరాజులు బాధపడతారు. మల్లికకి కడుపు పోయిందని చెప్పగానే గుండె పగిలినట్టు అయ్యిందని తన బాధ అంతా జానకికి చెప్పుకుని చాలా బాధపడుతుంది.